మెయిన్ ఫీచర్

మహిళా ఆహారశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది కేరళలోని త్రిస్సూర్ ప్రాంతం..
అక్కడ 2014లో ఓ ఆహార వేదిక ప్రారంభమైంది..
దానిపేరు ‘ఉమెన్స్ ఫుడ్ కోర్ట్’..
కేవలం పదిమంది మహిళలతో మొదలైన ఈ ఫుడ్ కోర్ట్ నేడు అంచెలంచెలుగా ఎదిగింది..
నేడు జాతీయ అవార్డును సొంతం చేసుకుంది..
వివరాల్లోకి వెళితే..
కుటుంబానికి చేదోడు, వాదోడుగా ఉందామని.. అవకాశమొస్తే ఏదో ఒక పని చేసుకుందామని.. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న మహిళలు ఎంతో మంది ఈ ప్రపంచంలో.. అలాంటి వారే కేరళలోని త్రిస్సూర్ ప్రాంతానికి చెందిన ఆ పదిమంది మహిళలు. వారందరినీ ఓ చోట చేర్చి ఉపాధి కల్పించారు కె.పి. అజయ్ కుమార్, కె.పి. అశోక్ కుమార్‌లు. వారి సాయంతో ఆ పదిమంది మహిళలూ కలిసి 2014లో ఉమెన్స్ ఫుడ్ కోర్ట్‌ను ప్రారంభించారు. ఇప్పుడు వీరందరూ ఇందులో వ్యాపారవేత్తలు. పదిమంది మహిళలతో ప్రారంభించిన ఈ ఫుడ్‌కోర్ట్‌లో ఇప్పుడు నలభై మంది మహిళలు పనిచేస్తున్నారు.
ఈ ఫుడ్‌కోర్ట్‌లో టీ, స్నాక్స్, దోశ, చపాతీ, పరోటా, బిర్యానీ.. ఇలా రకరకాల ఆహారపదార్థాలు తక్కువ ధరలకే లభ్యమవుతాయి. ఒక్కో ఆహారపదార్థానికి ఒక్కో కౌంటర్ ఉంటుంది. అతి తక్కువ ధరలకే రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తుంది కాబట్టే ఈ ఫుడ్‌కోర్టును అక్కడివారు ‘బడ్జెట్ ఫలహారశాల’ అని పిలుచుకుంటారు. రోజూ ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలవరకు ఈ ఫుడ్ కోర్టు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ ఫుడ్‌కోర్టులో ఎవరు తయారుచేసిన ఆహారపదార్థాలను వారే విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఇలా అమ్ముడుపోయిన వాటిని లెక్కచూసి సాయంత్రం పని ముగిసిన తర్వాత ఎవరి బిల్లులు వారికి చెల్లిస్తారు. ఇక ఈ ఫుడ్‌కోర్డుకు సంబంధించిన అద్దె, కరెంటు, వాటర్ బిల్లులు.. వంటి వాటిని అందరూ సమానంగా పంచుకుంటారు.
ఉపాధి లేకుండా ఖాళీగా ఉన్న మహిళలు.., భర్త సంపాదనకు, నా సంపాదనకూడా తోడైతే సంసారం సజావుగా సాగుతుంది అని భావించే మహిళలు.., వేర్వేరు చోట్ల పనిచేసి విసిగిపోయిన మహిళలు.. ఇలాంటి వారంతా ఈ ఫుడ్‌కోర్టులో పనిచేస్తున్నారు. ఒకప్పుడు నెలకి ఏడువేల రూపాయలు కూడా సంపాదించలేని మహిళలు.. నేడు నెలకి 60,000 వరకు సంపాదించగలుగుతున్నారు. ఎంతోమంది మహిళలు ఈ ఫుడ్‌కోర్టుద్వారా ఉపాధి పొందడమేకాక కొన్నాళ్లపాటు ఇక్కడ పనిచేసిన తర్వాత వ్యాపారం ప్రారంభించుకోవడానికి తగిన నైపుణ్యాలను కూడా ఇక్కడ పనిచేసే సమయంలో నేర్చుకుంటున్నారు. ఇందుకు ఆ అన్నదమ్ములు సహాయం చేస్తున్నారు. ఈ ఫుడ్ కోర్టులో పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించడమే కాకుండా సొంత ఇల్లు, కార్లను కూడా కొనుక్కుంటున్నారు ఆ మహిళలు.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్ని వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్ది వారిని సాధికారత దిశగా నడిపిస్తోన్న ఈ మహిళా ఫుడ్‌కోర్టు సేవల్ని గుర్తించిన ‘నేషనల్ రూరల్ ఎంట్రప్రెన్యూర్స్ మీట్’ అధికారులు ఈ ఆహార బజార్‌కు జాతీయస్థాయి గుర్తింపును కల్పించారు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ వ్యాపార సేవల్ని అందిస్తూ, మహిళల్ని ప్రోత్సహిస్తున్నందుకుగాను 2018, డిసెంబర్‌లో జాతీయ అవార్డును కూడా అందుకుంది ఈ ఫుడ్‌కోర్ట్. కెరీర్‌పరంగా మహిళలకు వరంగా మారిన ఈ ఫుడ్‌కోర్టులోని ఉద్యోగినులు ఖాళీ సమయాల్లో యోగ, వ్యక్తిత్వ వికాస తరగతుల్లో కూడా శిక్షణ పొందుతున్నారు. ఏదిఏమైనా చిరుద్యోగం కోసం బయటకి వచ్చి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు ఈ మహిళామణులు.