మెయిన్ ఫీచర్

గుర్రంపై పరీక్షలకు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరు: కృష్ణ
చదువు: పదోతరగతి
ఊరు: కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలోని మాల పట్టణం..
తండ్రి: అజయ్ కాళింది
వృత్తి: విష్ణు గుడిలో పూజారి
తల్లి: ఇందు వృత్తి: గృహిణి
ఇంతకూ విషయం ఏంటి? ఈ కృష్ణ ఎవరు? ఈమె బయోడేటాతో పనేంటి? ఈ అమ్మాయి ఏమైనా సెలబ్రెటీనా? లేక జీవితంలో ఏదైనా సాధించిందా? అనే కదా మీ డౌటు.. కృష్ణ ఇటీవలే పదోతరగతి పరీక్షలు రాసింది. అయితే బోర్డు పరీక్షలు రాసేందుకు అందరూ బస్సులో లేదా ఆటోలో లేదా తండ్రితో పాటు వెళతారు. కానీ కృష్ణ మాత్రం గుర్రాన్ని స్వారీ చేసుకుంటూ వెళ్లింది. అజయ్ కాళింది, ఇందులకు కృష్ణ ఒక్కతే కూతురు. అందుకే అల్లారుముద్దుగా పెరిగింది. ఆమె పదకొండో ఏట గుర్రం కావాలని తండ్రిని అడిగిందట. అడిగిందే తడవుగా ఆ తండ్రి గుర్రాన్ని కొనిచ్చేశాడు. 3ఇదేం కానుక?2 అని ఊర్లో ఎవరైనా ఆ తండ్రిని అడిగితే.. 3ఏదో చిన్నపిల్ల.. ముచ్చటపడింది.. కొనిచ్చాను.. అయినా ఝాన్సీలక్ష్మి గుర్రపుస్వారీ నేర్చుకోలేదా? ఆవిడకు మనమందరం బ్రహ్మరథం పట్టలేదా? భారతదేశం యావత్తూ ఝాన్సీలక్ష్మిని పొగుడుతుంది కదా.. అలాగే నా బిడ్డ కూడా గుర్రపుస్వారీ నేర్చుకోవాలని.. గుర్రం కావాలంది.. కొనిచ్చాను.. దానిపై చర్చ ఎందుకు?2 అని నవ్వేస్తాడట. తరువాత ఆమె ఇలాంటివే చాలా అడిగిందట.. అడిగిన వాటన్నింటినీ కొనేశాడు ఆ తండ్రి. అలా ఇప్పటికి ఆ ఇంట్లో రెండు గుర్రాలు, ఒక ఎద్దు, ఒక ఆవు.. ఇలా చాలానే ఉన్నాయి. ఏడో తరగతిలో ఉండగానే కృష్ణ గుర్రపు స్వారీ నేర్చేసుకుంది.
అప్పుడప్పుడూ కృష్ణ గుర్రంపైనే స్కూలుకు వెళుతుందట. ఇటీవల ఆమె పదో తరగతి సోషల్ పరీక్షకు గుర్రంపైన వెళ్లింది. యూనిఫాంతో, మెడలో ఐడీ కార్డుతో, వెనక స్కూలు బ్యాగుతో గుర్రంపై కూర్చుని రోడ్లపై పరుగులు తీస్తుంటే.. ఆశ్చర్యపోయిన ఓ గుర్రపు స్వారీ కోచ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడట.. ఇప్పుడు అది కాస్తా వైరల్ అయ్యింది. ఇప్పుడు కృష్ణ పదో తరగతి పూర్తిచేసింది. ఆమెకు తరచూ స్కూలుకు కూడా గుర్రంపైనే వెళ్లాలని కోరికట.. 3అన్ని సమయాల్లో అది సాధ్యపడదు కాబట్టి అప్పుడప్పుడూ వెళుతుంటాను2 అని చెబుతుంది కృష్ణ. 3నిజానికి నాకు ఇది కొత్తకాదు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు కూడా పరీక్షలకు గుర్రంపైనే వెళ్లాను. నా కోరిక అది.. ఆడపిల్ల గుర్రంపై వెళుతుంటే స్థానికులు, స్కూల్లో తోటిపిల్లలు, ఉపాధ్యాయులు వింతగా, ఆసక్తిగా చూస్తారు. అది నాకు చాలా ఇష్టం. కేవలం పరీక్షలకే కాదు.. అప్పుడప్పుడూ స్కూలుకు గుర్రంపైనే వెళుతుంటా.. గుర్రపు స్వారీ అంటే నాకు చాలా ఇష్టం. ఇది చేస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది2 అని చెబుతోంది కృష్ణ.
కృష్ణ తండ్రి అజయ్ కాళింది మాట్లాడుతూ 3గుర్రంపై పరీక్షకు వెళ్లడం నిజానికి చాలా రిస్క్.. అది మా వరకు మాత్రమే.. తనకు మాత్రం గుర్రంపై పరీక్షకు వెళ్లడం చాలా ఇష్టం. ఇందులో తప్పేముంది? పైగా ఎవరో, ఏదో అనుకుంటారని, అంటారని.. మనమే అనుకుని బాధపడటం దేనికి? అయినా నా కూతురు గుర్రపు స్వారీ చేస్తుంటే భలే ఉంటుంది. చిన్నప్పుడు ఏదో ముచ్చటపడిందని వీటిని కొనిచ్చాను. ఇకముందు ఇలాంటివి ఏమైనా అడిగితే.. నేను కొనియ్యను బాబోయ్.. ఎందుకంటే వాటిని మేపడానికే నాకు చుక్కలు కనిపిస్తున్నాయి..2 అని నవ్వుతూ చెప్పాడు. కూతురు అడిగిన వెంటనే.. ఆమె కోరిక తీర్చిన ఆ తండ్రి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఏదిఏమైనా గుర్రంపై పరీక్షలకు వెళ్లే ఆలోచన మాత్రం సూపర్. ఈమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియోని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చూశాడట. అప్పటినుంచి కృష్ణని తెగ పొగుడుతున్నాడు ఆనంద్ మహీంద్ర. 3అసలు ఆ అమ్మాయి వీధుల్లో గుర్రపుస్వారీ చేయడం చూశారా.. ఎంత బాగుందో.. ఇప్పుడు నా ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ సేవర్‌గా ఆ అమ్మాయి గుర్రపుస్వారీ ఫొటోనే పెట్టుకున్నాను. ఇప్పుడు నా ఫేవరేట్ హీరో ఈ అమ్మాయే2 అంటూ కృష్ణని, ఆమె గుర్రపుస్వారీని తెగ పొగుడుతున్నాడు ఆనంద్ మహీంద్రా. హైదరాబాద్ వంటి ట్రాఫిక్ జంఝాటంలో మనకంటూ ఓ సొంత వాహనం, అదీ ఇలాంటి మంచి మేలిమి జాతి గుర్రం ఉండి, గుర్రపు స్వారీ తెలిసుంటే హాయిగా పరీక్షలకు వెళ్లిపోవచ్చేమో.. నిముషం ఆలస్యం కాకుండా.. ఆలోచించండి మరి!