మెయిన్ ఫీచర్

ప్రకృతి ఒడిలో జీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో, అదీ మిట్ట మధ్యాహ్నం కాసేపు కరెంటు లేకపోతే వామ్మో.. అంటూ గగ్గోలు పెడుతుంటారు. ఇక రాత్రిపూట అయితే ఫ్యాను, ఏసీ లేకుండా పడుకోవాలనే ఆలోచనే.. చాలా నరకంగా ఉంటుంది. అలాంటిది ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ డా. హేమా సనే దాదాపు 79 సంవత్సరాలుగా విద్యుత్తు లేకుండానే జీవిస్తోంది. డాక్టర్ హేమ ఊరు పుణెలోని బుధ్వార్ పెత్. ఇప్పటికీ ఆమె ఇంట్లె కరెంటు సదుపాయం లేదు. ఈమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టమట. అందుకని విద్యుత్ అవసరం లేకుండానే జీవించాలని నిర్ణయించుకుంది. వివరాల్లోకి వెళితే..
సావిత్రిబాయి పూలే పుణె యూనివర్శిటీలో బోటనీ పీహెచ్‌డీ పూర్తిచేసింది డా. హేమా సనే. ఆ తరువాత కొనే్నళ్ల పాటు గర్వారే కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. బోటనీ ప్రొఫెసర్ కాబట్టి సాధారణంగానే ఈమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. మనిషి బతకడానికి ఆహారం, దుస్తులు, నివాసం అనేవి కనీస అవసరాలు. విద్యుత్ కనీస అవసరం కాదు అంటారు హేమ. ‘ఒకప్పుడు మనకు విద్యుత్ సదుపాయం లేదు. చాలాకాలం తరువాత అది మనకు అందుబాటులోకి వచ్చింది. అప్పుడు విద్యుత్తు లేకుండా బతికాం కదా.. ఇప్పుడు కూడా నేను ఆ కాలంలోలాగానే ఉంటుంది. ఇది నాకు చాలా ఇష్టం. అందుకే ఇలా ఉంటున్నాను. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాల మధ్య హాయిగా జీవిస్తున్నాను. నాకు విద్యుత్తు అవసరం ఎప్పుడూ రాలేదు. రాత్రిపూట చినీలు పెట్టుకుని పీహెచ్‌డీ దాకా చదివాను. విద్యుత్తు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అని నన్ను చాలామందే అడుగుతారు. నేను కూడా వారిని విద్యుత్తుతో మీరు ఎలా జీవిస్తున్నారు? అని తిరుగు ప్రశ్నను సంధిస్తాను. నేడు ప్రతి ఒక్కరి జీవితం మెకానికల్ అయిపోయింది. ముఖ్యంగా టీవీలు, ఫోన్లు లేకపోతే పిల్లలు కనీసం ఒక్క నిముషం కూడా ఉండలేకపోతున్నారు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా.. కానీ నా జీవితం అలా కాదు. నా ఇంట్లో ఉన్న పక్షులే నా స్నేహితులు. ఇవన్నీ చూసిన చాలామంది నాది చాదస్తం అనీ, నాకు పిచ్చి అనీ, చెత్తలో బతుకుతుంది అని అనుకుంటూ ఉంటారు.. ఒక్కోసారి భరించలేక నాతోటే అంటూ ఉంటారు. వారి అభిప్రాయం కూడా నిజమే కావొచ్చు.. కానీ నా జీవితం నాకు నచ్చినట్లుగా బతకడం మంచిది కదా. నేను చాలామందిని కలిశాను. వారి జీవన విధానం నాకు పూర్తి భిన్నంగా ఉంది. అది నాకు నచ్చలేదు. అందుకే నాకు నచ్చిన ఈ పూరింట్లో ఉండటమే నాకు ఇష్టం. వారు ఇబ్బంది పడతారని నేను ఒకరింటికి వెళ్లను.. వారిని నా ఇంటికి రమ్మని ఆహ్వానించను. దీనితో ఎటువంటి సమస్యలు రావు కదా..’ అని చెబుతారు హేమ. బోటనీ, పర్యావరణంపై హేమ ఎన్నో పుస్తకాలు రాశారు. అవి నేటికీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆమెకు తెలియని పక్షి, చెట్లు లేవంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఖాళీగా ఉన్న సమయంలో ఆమె పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఏదిఏమైనా డాక్టర్ హేమా సనే నిర్ణయం చాలా గొప్పది. ఆమెకు నచ్చిన బాటలోనే, నచ్చినట్లుగా, ప్రకృతి మాత ఒడిలో జీవనం సాగిస్తున్నందుకు డాక్టర్ హేమా సనేకు అభినందనలు తెలపాల్సిందే.