మెయిన్ ఫీచర్

పెళ్లికి గుడ్ బై! (ఒంటరి జీవితానికే ఓటు!)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. వరకట్నం అనే జాఢ్యం ఈ కమ్మటి మాటను కాలరాస్తోంది. అం దుకే ఆధునిక యువతి పెళ్లికి గుడ్‌బై చెప్పేస్తోం ది. ఒంటరి జీవితమే బెటర్ అనే నిర్ణయానికి వస్తోంది. కట్నం ఇస్తేనే తాళి కడతానని వరుడు భీష్మించుకుని కూర్చోవటాన్ని నేటి యువతులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిని అవమానకరంగా భావిస్తున్నారు. కట్నం అడిగితే అవసరమైతే పెళ్లి పీటల మీద నుంచి లేచిపోతామని వరుడి కంటే వధువులే సాహసం చేస్తున్నారు. వరుడి తరుపున వారు కట్నకానుకలు అడగటాన్ని అవమానంగా భావించిన 51.4శాతం మంది యువతులు తాళి కట్టించుకోకుండా ఒంటరిగా జీవించటానికి నిర్ణయం తీసుకున్నట్లు షాదీ డాట్ కమ్ నిర్వహించిన సర్వేలోవెల్లడైంది. కట్నం అడగటం సామాజిక అవమానంగా 48.6శాతం మంది యువతులు భావిస్తున్నారంటే వరకట్నం అనే జాఢ్యాన్ని వారు ఎంతగా అసహ్యించుకుంటున్నారో అర్థంచేసుకోవచ్చు. షాదీ డాట్ కమ్‌వారు ఆన్‌లైన్‌లో వరకట్నానికి సంబంధించిన అభిప్రాయాలను వెల్లడించమనగా 24 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసుగల 5,680 మంది యువతులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 75శాతం మంది వరకట్న సమస్యను నివారించాలని కోరారు. కట్నం అడిగినవారిని జైలుకు పంపాలని 59.8శాతం తెలిపారు. వరకట్న సమస్య సామాజిక అవమానం అంటూ 40.2శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మన మీద మనకు ఎంతో గౌరవం ఉన్నపుడు జీవిత భాగస్వామిగా వచ్చే యువతి పట్ల కూడా అంతే గౌరవాన్ని కలిగివుండాలని, అంతేకానీ కట్నం పేరుతో నలుగురిలో అడగటం అవమానంగా భావిస్తున్నట్లు యువతులు అభిప్రాయపడుతున్నారు. చక్కటి అనుబంధం ఆర్థిక అనుబంధంగా మారనంతకాలం సంసార జీవనయనాంలో అసంతృప్తులకు తావు ఉండదు. ఫలితంగా దేశంలో రోజుకు 20మంది యువతులు వరకట్న దాహనికి బలి కావల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావు.