మెయిన్ ఫీచర్

ఒత్తిడి నుంచే విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతికూలాంశాలను అనుకూలంగా మలచుకుని మనిషి తనను తాను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తుంటాడు. ఇందుకు చక్కని ఉదాహరణ- మానసిక ఒత్తిడినుంచి పుట్టుకొస్తున్న సరికొత్త ఆలోచనల సక్సెస్.
అయితే మానసిక ఒత్తిడివలన ఏర్పడే డిప్రెషన్ ను అధిగమించటం ఎలా? ఆ నిస్సహాయ స్థితిని ఒక శక్తిగా మలచుకోవడం ఎలా గో మనం తెలుసుకుంటే, ఒకవేళ అలాంటి స్థితి వస్తే, బయటపడడం ఎలాగో ఒక అవగాహన ఏర్పడుతుంది. అప్పుడే మనం అసమర్థతలను సమర్థవంతంగా మలచుకోగలుగుతాం. ఆ క్రమం మీ గురించి మీరు విశే్లషించుకోండి. సమస్య వస్తే అధిగమించడం కోసం ప్రయత్నించండిలా..
మానసిక ఒత్తిడి అంటే.. ఆలోచనలు అంతం లేకుండా కొనసాగించి, మెదడు పనిచేయకుండా చేసుకోవడం. కాబట్టి ఏదైనా ఒక సమస్య మీకు ఎదురైనా లేదా ఏదైనా సాధించడం కోసం మీరేదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆలోచించటం కొద్ది క్షణాలు ఆపండి. ఎడతెగని ఆలోచనలు హఠాత్తుగా ఆపడం సాధ్యమా.. అంటే సాధ్యమే!
ఆలోచనలు ఆపడానికి అనేక టెక్నిక్స్ ఉన్నాయి. అందులో నెంబర్ కౌంటింగ్ (బ్రీతింగ్ టెక్నిక్స్) ఎఫెక్టివ్‌గా వుంటాయి. ‘నా ఆలోచనలు ఆగిపోయాయి.. ఇపుడు నేను ఒకటి, రెండు, మూడు..’ అంటూ అంకెలను నా కళ్లముందు నిలుపుకుని వాటిని దర్శించగలుగుతున్నాను అనుకోవడం నెంబర్ కౌంటింగ్ టెక్నిక్. ఒకటి, రెండు, మూడు.. తర్వాత మనసు డైవర్ట్ అయితే మళ్లీ ఒకటి నుండి కౌంటిం గ్ మొదలుపెట్టడం ద్వారా ఆలోచనలకు బ్రేక్ వేయాలి. ఇవే శ్వాసమీద ధ్యాస నిలపడం ద్వారా కూడా ఆలోచనలు ఆపవచ్చు.
పిచ్చి పిచ్చి ఆలోచనలు తగ్గాక మెదడు కాస్త తేలికైనట్టు అనిపిస్తుంది. అప్పుడు మీ గురించి మీరు విశే్లషించుకోవడం చేయాలి. ‘నేనిప్పుడే చేస్తున్నాను.. ఎలా ఆలోచిస్తున్నాను’ అనే విశే్లషణ ప్రతి మనిషి ఎప్పుడో అప్పు డు ఆత్మ పరిశీలన ద్వా రా చేసుకోవడం చాలా అవసరం. ఈ విశే్లషణ లేకనే అనేకమంది దారి తప్పి నడుస్తున్నారు.
విశే్లషణ తర్వాత విధానాల గురించి పరిశీలించుకోండి. విధానాలు అంటే అనుసరిస్తున్న మార్గాలు. మనమెంత చక్కగా ఆలోచించినా, ఎన్నుకున్న మార్గం సరైనది కాకపోతే ఫలితం ఉం డదు. ఫలితం లేని మార్గం వెంట ఎంత దూరం ప్రయాణించినా సాగేకొద్దీ ఒత్తిడి మాత్రమే పెరుగుతుంది. అందుకే సరైన మార్గం కోసం సరైన పరిశీలన చేయండి.
సరైన మార్గమే కాదు, సరికొత్త మార్గం ఏదైనా వుందా అంటూ అనే్వషణ సాగించండి. నిజానికి ఇలా భిన్నంగా ఆలోచించడమే సక్సెస్‌కి అసలు సూత్రం. అందులోనూ మానసిక ఒత్తిడి వున్నపుడు మెదడు మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాంటి సమయంలో భిన్నం గా ఆలోచించాలనే మోటివేషన్ మెదడుకి అందిస్తే చాలు. ఆ మెదడు అద్భుతంగా ఆలోచిస్తుంది. మీరు మాత్రం భిన్నంగా ఆలోచించాలి అని మెదడుకి చిన్న సూచన అందిస్తే చాలు.
విభిన్నంగా ఆలోచించటం ప్రారంభించాక, హఠాత్తుగా మెదడులో మెరుపు
మెరిసిన అనుభూతి మీకే తెలుస్తుంది. వెంటనే ఆ మెరుపును మెరుపులాంటి ఐడియాకు జత చేసి ఏకాగ్రతలో ఆలోచించి అవగాహన చేసుకోండి.
ఐడియాను అమలుచేయడంలో కష్టనష్టాలు పరిశీలించండి.
ఆలోచనలను ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేయడం చా లా ముఖ్యం. అద్భుతంగా ఆరంభిస్తే, సగం సక్సె స్ సాధించినట్టు అంటారు. కాబట్టి సరికొత్త మార్గం లో వెళ్ళదలచుకున్నపుడు, ఆ మార్గంలో సక్సెస్ సాధించగలమనుకున్నపుడు, కష్టనష్టాల గురించి ముందే అవగాహన చేసుకున్నపుడు ఆత్మవిశ్వాసంలో అడుగు ముందుకేస్తూ ఎఫెక్టివ్‌గా ప్రెజేంటేషన్ చేయగలగాలి.
సక్సెస్ పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి.
ఇలా ఒక క్రమ పద్ధతిలో మెదడును ట్యూన్ చేసుకున్నపుడు, డిప్రెసివ్ మూడ్ అనేది సహజ సిద్ధంగా మనిషికి కలిగినా, ఆ మూడ్‌నుండి బయటపడి సక్సెస్ దిశగా అడుగులేయగలుగుతారు.
జీవితం ఒక పోరాటం అనుకుంటే, డిప్రెసివ్ మూడ్ అనేది శత్రువు చేసే గాయం. ఆ గాయానికి భయపడి పోరాటం ఆపేస్తే, శత్రువు మనల్ని పూర్తి గా లొంగదీసుకుంటాడు. అప్పుడు మన చావు బతుకులు అతడి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి ఉంటాయి.
కాబట్టి మానసిక ఒత్తిడి తాలూకు డిప్రెసివ్ మూడ్‌కి అంత ప్రాధాన్యం ఇవ్వకండి. దెబ్బతిన్నాక మనిషి మరింత అలర్ట్ అయి, మరిన్ని మెళకువలు ప్రదర్శిస్తూ పోరాటం చేయడం అవసరం.
అలా పోరాడి గెలిచినవారు చరిత్రలో ఎందరో వున్నారు. వారి సక్సెస్ సూత్రం మనకు ఇన్‌స్ఫిరేషన్ కావాలి.

- పి.ఎం.సుందరరావు