మెయిన్ ఫీచర్

స్వర్ణ ‘ థింగ్ ఎక్స్‌ప్రెస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఫలితాలు వచ్చినప్పుడు టీవీల్లో వచ్చే వాణిజ్య ప్రకటన కాదిది. అసోం రన్నర్ పందొమ్మిదేళ్ల హిమదాస్ వరుస పసిడి పతకాలతో సృష్టించిన సంచలనం. పద్దెనిమిది రోజుల్లో ఏకంగా ఐదు స్వర్ణాలు కొల్లగొట్టి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసింది హిమదాస్. సరిగ్గా సంవత్సరం క్రితం జులైలోఅండర్-20 వరల్డ్ చాంపియన్‌షిప్ 400 మీ. పరుగులో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన దాస్ ఏడాది తిరిగేసరికి స్వర్ణాల వర్షం కురిపించింది. వెన్నునొప్పి సమస్యను కూడా లెక్కచేయకుండా లక్ష్యం వైపుకే దూసుకుపోతోంది.
2018, జులైలో ఈశాన్య రాష్ట్రం నుంచి వచ్చిన ఈ పద్దెనమిదేళ్ల తార పరుగులో తళుక్కున మెరిసింది. స్వర్ణాన్ని గెలిచింది. ఆ పతకాన్ని అందుకుంటూ.. వెనుక జాతీయగీతం వినిపిస్తోంటే.. ఆపుకోలేని ఉద్వేగంతో ఆనందభాష్పాలను రాల్చింది. అంతవరకు పడిన శ్రమ అంతటినీ మరిచింది. హిమదాస్ ధనక్ అనే వెనుకబడిన, వెలివేయబడిన కులానికి చెందిన అమ్మాయి. ఈమెది అసోంలోని నగావ్ జిల్లా థింగ్ గ్రామం. వీరిది పేద వ్యవసాయ కుటుంబం. రన్నర్‌గా తొలి అడుగులను తన పొలంలోనే వేసింది. పాఠశాల స్థాయిలో ఫుట్‌బాల్ ఆడిన ఆమె.. కోచ్ నిపాన్‌దాస్ సలహా మేరకు ట్రాక్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. థింగ్ నుంచి గౌహతి 140 కిలోమీటర్లు.. మంచి శిక్షణ కావాలంటే కనీసం రాష్ట్ర స్థాయి కోచింగ్ సౌకర్యాలున్నచోట మాత్రమే మేలని కోచ్, ఆమె తల్లిదండ్రులను ఒప్పించాడు. ఊరిని వదలడానికి హిమదాస్ విముఖంగా ఉంటే, ఆమె తల్లిదండ్రులు కూడా కాదూకూడదంటున్నా.. కోచ్ వారిని ఒప్పించి ఆమెను గౌహతి సరుసజాయ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అద్దెకు చిన్న వసతి. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్.. అలా పొలాల నుంచి ఆమె పరుగు ట్రాక్‌పైకి మారింది.. అంతవరకు ఒట్టి కాళ్లతో పరిగెట్టిన ఆమె కాళ్లకు మరింత వేగాన్ని, సౌకర్యాన్ని జతచేసే బూట్లు వచ్చి చేరాయి. ఇందుకోసం నిపాన్‌దాస్ అనేకసార్లు తన సొంత డబ్బే ఖర్చుపెట్టేవాడు.
హిమదాస్ గౌహతికి చేరాక రాష్ట్ర అథ్లెటిక్ కోచ్ నవజీత్ మలకర్ ఆమె కాళ్లకు మరింత పదును పెట్టాడు. అనుకున్నట్లుగానే ఆమె టైమింగ్ మెరుగుపడుతూ వచ్చింది. మొదట్లో ఆమె 100, 200, మీటర్ల పోటీల్లోనే పాల్గొనేది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో ఆమె ప్రావీణ్యం బయటపడింది. ఈలోపు నైరోబీలో వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ పోటీలు వచ్చాయి. అక్కడికి వెళ్లడానికి డబ్బులు లేవు. ఆమె ఇద్దరు కోచ్‌లు అప్పుచేసి ఆమెను పోటీలో నిలిపారు. 200 మీటర్ల పోటీలో ఆమె ఐదో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. నైరోబీ పోటీల్లో హిమ నమోదుచేసిన టైమ్, ఆమె చూపిన ప్రావీణ్యం అథ్లెటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోచ్ గలెనా బుఖారినాను ఇంప్రెస్ చేసింది. ఆమె హిమదాస్‌కు కొత్త మెళకువలు, జాగ్రత్తలు నేర్పించింది. బుఖారినా హిమదాస్ విషయంలో పర్సనల్ కేర్ తీసుకుంది. అలా హిమదాస్ తన ఆటతీరును మెరుగుపరుచుకుని ఇప్పుడు స్వర్ణాల పంట పండిస్తోంది. గత ఏప్రిల్‌లో దోహాలో జరిగిన ఏషియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు లో పాల్గొనకుండా వెన్నునొప్పి కారణంగా వైదొలిగింది. ఆ తర్వాత కోలుకున్న ఆమె ప్రస్తుతం యూరప్‌లో పాల్గొంటున్న అంతర్జాతీయ టోర్నీలో పసిడి పతకాలతో హోరెత్తించింది. అద్భుత ప్రదర్శన చేస్తున్న ఈమెను ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొనియాడారు. సచిన్ తెందూల్కర్ కూడా ఆమెకు అభినందనలు తెలియజేశారు. హిమదాస్ ప్రపంచ చాంపియన్ అయిన తరువాత అసోం ప్రజలు ఆమెను ముద్దుగా ‘్థంగ్ ఎక్స్‌ప్రెస్’ అని పిలుస్తున్నారు.
‘గత కొన్ని రోజులుగా అద్భుతంగా రాణిస్తున్న హిమదాస్‌ను చూసి దేశం గర్విస్తోంది. దేశం తరపున ఐదు అంతర్జాతీయ స్వర్ణాలను సాధించినందుకు ఆమెను చూసి అందరూ సంతోషిస్తున్నారు. ఆమెకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను’
- నరేంద్రమోదీ
‘గత 19 రోజులుగా యూరప్‌లో మీరు రాణించిన తీరు ఎంతో బాగుంది. గెలవడానికి మీరు పడే శ్రమ, పట్టుదల యువతకు ప్రేరణ కలిగిస్తుంది. ఐదు పతకాలను సాధించినందుకు అభినందనలు. రాబోయే రేసుల్లో మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను’
- సచిన్