మెయిన్ ఫీచర్

జీవితాన్ని జయిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య ఏ పేపర్ తిరగేసినా కూడా కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకున్న వార్తలే కనబడుతున్నయి. అసలు కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏముంది. అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయి అని ఆలోచిస్తే చాలా దిగ్భ్రాంతిగొలిపే వాస్తవాలు అగుపడతాయి. కుటుంబం పెద్ద వృత్తిపరంగా వచ్చిన వొత్తిళ్ళను ఎదుర్కోవడంలోను, లేదు ఆర్థిక ఇబ్బందువలన, పెద్ద మొత్తంలో అప్పు చేసి, అది తీర్చలేక, అప్పులవాళ్ళకి మొహం చూపించకలేక, సమాజంలో చుట్టుప్రక్కలవారి సూటిపోటి మాటలు పడలేక కుటుంబం మొత్తం ఆత్మహత్యకి పాల్పడటం ఒక్కటే పరిష్కారమని భావిస్తున్నాను. కానీ ఇది ఎంత మాత్రం సమంజసంకాదు. కుటుంబ యజమాని చేసిన తప్పుకి ముక్కుపచ్చలారని పిల్లల్ని బలి తీసుకోవటం ఎంతవరకు సబబు. తాము ఆత్మహత్య చేసుకుంటే పిల్లలని చూసే దిక్కు ఉండరని, బంధువులు కూడా దగ్గరికి తీసుకోరని, వాళ్ళు రోడ్డున పడతారని భయపడి బతుకుని ముగిస్తున్నారు.
కుటుంబాలని సామూహికంగా ఆత్మహత్యకి ప్రేరేపించే మరొక కారణం అక్రమ సంబంధం. భర్త వివాహ బంధంలో వుండి కూడా మరొక స్ర్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నపుడు, ఆ పురుషుడి భార్య అభద్రతాభావానికి లోనవుతుంది. ఇక తమ బతుకుకి భద్రత ఉండదని, నడి రోడ్డుపై ఉండాల్సిందే అని భావించి బావిలో దూకడంతో ముగించేస్తున్నారు. దీనికితోడు భర్త వ్యసనపరుడు అయితే ఇంకా దారుణం. చాలా కేసులలో ఆత్మహత్యకి ప్రేరేపించేవి ఆర్థిక కోణమే.
ఇటీవలికాలంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నవారి సంఖ్య ఎక్కువైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆత్మహత్యలకు పాల్పడుతున్నది పేద కుటుంబాలే కాదు బాగా డబ్బు, పలుకుబడి వుండే వ్యాపారస్తులు కూడా పాల్పడడం బాధాకరం. చాలామంది కేసులలో ఆర్థిక కోణమే కనిపిస్తుంది. వ్యాపారస్థులయితే తామర తంపరగా అప్పులు చేయడం.. ఇప్పటిదాకా సంపాదించుకున్న పేరు పోతుందేమోనన్న భయం, తాను ఒక్కడే చనిపోతే తన కుటుంబం దిక్కులేనిది అవుతుందని మొత్తం కుటుంబం చనిపోతే ఎలాంటి బాధ ఉండదని మొత్తం కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇటీవల ఢిల్లీ సమీపంలో సామూసిక ఆత్మహత్యలు జరిగాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 11మంది ఉరివేసుకుని చనిపోయారు. ఈ ఘటన దేశాన్ని కుదిపివేసింది. ప్రాథమిక సమాచారం మేరకు, ఆ కుటుంబంలోని మూడు తరాలకు చెందిన ఆడ, మగ, చిన్నా పెద్దా మొత్తం 11మంది ఆత్మహత్య చేసుకున్నారు. మోక్షం పొందడం లాంటి ఆలోచనా ధోరణులే ఈ ఆటవిక ఘటనకు పురిగొల్పి వుండవచ్చు. మతం మోక్షాన్ని ఇస్తుందనే నమ్మకం వీటికి ప్రేరణగా నిలిచి ఉండొచ్చు. ఒక సామాన్య కుటుంబం ఈ విధంగా సామూహిక ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతుంది అన్నది ప్రతి ఒక్కర్నీ తొలిచే ప్రశ్న.
ఢిల్లీలో బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటనను మర్చిపోకముందే, జార్ఖండ్‌లోని రాంచీలో ఇలాంటిదే మరో ఘటన చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలతో వీరంతా తనువు చాలించారని నివేదికల్లో తేలింది.
అన్నదాతల మృత్యుఘోషే కాదు.. ఆత్మహత్యలు చేసుకునేవారి ఇతర వర్గాల సంఖ్య కూడా దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే వుంది. సగటున ప్రతి గంటకు 15 మంది దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జాతీయ నేర నమోదు గణాంక సంస్థ లెక్కలు చెబుతోంది. అంతేకాదు బలవన్మరణాల్లోనూ తెలుగు రాష్ట్రాలు ముందువరుసలో ఉండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆత్మహత్యల్లో తెలుగు రాష్ట్రాలు తొలి పది స్థానాల్లో ఉన్నాయి. అత్యధిక బలవన్మరణాలు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన ‘ప్రమాద మరణాలు - ఆత్మహత్యల సమాచారం’ 2014 వార్షిక నివేదికలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
సామూహిక, కుటుంబం సహా ఆత్మహత్య కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో వుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా ఆత్మహత్యల కేసులు 33, తెలంగాణలో 10 నమోదయ్యాయి. ఈ విభాగంలో మొదటి మూడు స్థానాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకుంటన్నవారిలో ఎక్కువమంది గృహిణులు, స్వయం ఉపాధి పొందుతున్నవారే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1069 మంది, తెలంగాణలో 725 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలు, సమస్యలు, అనారోగ్య కారణాలు, వివాహ సమస్యలు, అప్పుల బాధ తాళలేక ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఏ సమస్యకూ ఆత్మహత్యే పరిష్కారం కాదు. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఇది ఖచ్చితమైన సమాధానం లేని ప్రశ్న. మాల్ అడ్జెస్ట్‌మెంట్ మెంటల్ డిజార్డర్ (ఎదుటివారితో పొసగకపోవడం), ఆత్మన్యూనత, ఆత్మవిశ్వాసం లేకపోవడం, క్రమశిక్షణ లోపించడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువవ్వడం, మారిటల్ డిజార్డర్ (వివాహ సంబంధ సమస్యలు), ఉద్యోగాలు.. ఇలా ఎన్నో కారణాలను నిపుణులు చెబుతున్నా అవన్నీ ఊహాజనితమే. జీవితంపై సరైన అవగాహన, దృక్పథం లేకపోవడమే అసలు సమస్య.
సమస్యలన్నింటికీ చావే పరిష్కారం కాదు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబం మొత్తం కనుమూసే స్థాయికి తీసుకువెళుతుంది. కుటుంబలోని పెద్ద తరచుగా ఆత్మహత్యలవైపు ఆలోచనలు మళ్లుతూ ఉన్నాయి అంటే ఆలోచించాల్సిందే.
అక్షరాస్యులైనా.. నిరక్షరాస్యులైనా.. నిరుద్యోగి అయినా.. జీవితంలో స్థిరపడ్డవారైనా చిన్నపాటి సమస్యకే బలవన్మరణాలను ఆశ్రయిస్తున్నారు. జీవితాన్ని జయించలేక చావును చేరుకుంటున్నారు. ఇది సమాజంలో పేరుకుపోతున్న అవాంఛనీయ ధోరణి. ఆత్మహత్య లక్షణాలను ముందుగా గుర్తిస్తే నివారించగలుగుతామంటున్నారు మానసిక నిపుణులు.
ఒక్క క్షణం పాజిటివ్‌గా ఆలోచిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం కళ్ళముందు కనిపిస్తుంది. ఆ ఒక్క క్షణం ఆలోచించే సహనం లోపించడమే అతి పెద్ద సమస్య. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే జీవితం బుగ్గిపాలవుతుంది. గెలవడం ధ్యేయం కావాలి కానీ గెలుపే జీవితం కాదు. ఓడినంతమాత్రాన జీవితం వృధా అనుకుంటే భవిష్యత్తు శూన్యంలా కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసానికి మించిన విజయం లేదు. ఒక్క క్షణం ఆలోచిస్తే జీవితం విలువ తెలుస్తుంది.

- పుష్యమీ సాగర్ 7997072896