మెయిన్ ఫీచర్

ముందే మేలుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యావంతులైన పురుష పుంగవులు మర్యాద అనే మేలిమసుగు మాటున మహిళల పట్ల నీచంగా ప్రవర్తిస్తుంటే, చదువుసంధ్యలు లేకుండా వున్న మానవ మృగాలు ఎక్కువగా స్ర్తిలపట్ల అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రాక్షస ప్రవృత్తి కలిగి ఆడపిల్లలను వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు జరపటం, హింసించడం, తరువాత దారుణంగా పెట్రోలు పోసి తగులబెట్టడం వంటివి చేస్తూ సభ్య సమాజం నివ్వెరపోయేలా, ఆ దుర్మార్గుల తల్లిదండ్రులు తలలు దించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి ఘోరమైన వార్త ఒకటి తెలిసి మనసు కకావికలమై సర్దుకొనకముందే మరొక వార్త, మరొక వార్త.. ఇటువంటివే వినవలసి రావడం ప్రతిఒక్కరినీ దిగ్భ్రమకు గురిచేస్తున్నది.
నేటి సమాజంలో స్ర్తిలు ఎంతో పురోగతిని సాధించినప్పటికీ నిరక్షరాస్యులైన స్ర్తిలు కూడా ఇంకా ఎందరో ఉన్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటివారికి అక్షరాస్యత కంటే ముందు వారిలో సామాజిక స్పృహను, పిల్లల పెంపకంలో వారి బాధ్యతలను బోధించి వారిని చైతన్యవంతులుగా చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. అప్పుడే వారు వారి సంతానంపట్ల శ్రద్ధ వహించి సన్మార్గంలో వారిని నడిపించగలుగుతారు.
ప్రతి తల్లి తాను చదువుకుని ఉండకపోయినా తన పిల్లలను తప్పకుండా చదివించాలి. విద్య వినయాన్ని, సంస్కారాన్ని ఇస్తుంది. చిన్నతనంనుండే మగపిల్లలకు ఆడపిల్లలపట్ల సహృదయంతో, సదుద్దేశ్యంతో, మర్యాద పూర్వకంగా మెలిగే విధంగా మంచి బుద్ధులను నేర్పించాలి. అక్కచెల్లెళ్ళు ఉన్నవాళ్ళయినా, లేనివాళ్ళయినా మహిళలను ఎలా గౌరవించాలో తెలియజేస్తూ ఉండాలి. విచ్చలవిడిగా తిరుగుతూ జల్సాగా డబ్బులు ఖర్చు చేస్తూ చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తుంటే వారిని మందలించి బాల్యం నుండే వారిని సరియైన దారిలో పెడుతూ, ఒక కంట వారిని గమనిస్తూ ఉండడం తల్లిదండ్రుల తప్పనిసరి కర్తవ్యం.
తల్లిదండ్రులు ఇద్దరిలో ఏ ఒక్కరి భయమైనా పిల్లలకు లేకపోతే వారు దుర్మార్గులుగా మారి సమాజానికి, ముఖ్యంగా స్ర్తిజాతికి చేటు కలిగించేవారుగా మారటానికి అవకాశాన్ని ఇచ్చినవారవుతారు. చేతులారా తామే తమ పిల్లలను చెడగొట్టుకున్న వారవుతారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని ఏం లాభం? అన్నట్లు కొడుకులు నిందితులై చేయరాని నేరాలు చేసి పదిమందితో ఛీ కొట్టబడుతూ వున్నపుడు ‘మీ ఇష్టం.. మీరు వాళ్ళను ఏమైనా చేసుకోండి! ఏ శిక్ష విధించినా మాకు అభ్యంతరం లేదు’ అంటే మాత్రం కన్నపేగు తల్లడిల్లకుండా ఉంటుందా? దానికంటే ముందే తమ పిల్లలను అదుపులో పెట్టుకోవడం మంచిది కదా!
పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు కేవలం సిలబస్‌లు పూర్తిచేసుకోవటం మీదే దృష్టి పెట్టి పాఠాలు చెప్పటంతోనే సరిపెట్టకుండా సందర్భానుసారంగా కాని ప్రత్యేక శ్రద్ధతోకాని విద్యార్థులకు నీతికథలు, పద్యాల రూపంలో నేటి సమాజ స్థితిగతులను, స్ర్తిలను చులకనగా చూడకుండా వారిపట్ల ఏ విధంగా మెలగాలో మొదలైన విషయాలను వివరిస్తూ నైతిక విలువలు పెంపొందే విధంగా వారిని తీర్చదిద్దగలిగితే సమాజంలో దౌర్జన్యాలు, అక్రమాలు అరికట్టగలుగుతారు.
మురికివాడలలోను, నిరక్షరాస్యులు అయిన కుటుంబాలు వున్న ప్రదేశాలకు వెళ్లి ఆవారాగా తిరుగుతున్న మగ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు స్ర్తి జాతి యొక్క ఔన్నత్యాన్ని, విలువను గురించి అనేక రూపాలలో, ప్రక్రియలతో వారికి వివరించి వారిని జాగృతపర్చాల్సిన అవసరం వుంది. మహిళల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న నేటి పరిస్థితులను, పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయటంవల్ల కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. అందుకుగాను మహిళా సంఘాలు, అభ్యుదయ భావాలున్న యువతీ యువకులు ఒక ఉద్యమంగా ప్రయత్నిస్తే తప్ప ఆడవారిపట్ల రోజురోజుకూ మితిమీరిపోతున్న అరాచకాలకు ఆనకట్ట పడదు. మృగాళ్ళకు అందరికీ తెలిసే విధంగా కఠినశిక్షను విధిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళను అణచివేస్తేనే ఆడపిల్లల జీవితాలకు, వారి అందమైన భవిష్యుత్తుకు భద్రతను కల్పించగలుగుతాం. అందుకే అందరం ముందే మేలుకుందాం. మృగాళ్ళు లేని సంస్కారవంతమైన సభ్య సమాజాన్ని నిర్మిద్దాం!

- అబ్బరాజు జయలక్ష్మి