మెయిన్ ఫీచర్

ఆదర్శమూర్తి సోదరి నివేదిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంగ్లేయుల కబంధహస్తాల్లో భారతదేశం చిక్కుకుని విలవిలలాడుతున్న సమయమది. పేదరికం, నిరక్షరాస్యత కష్టాలు అనుభవిస్తున్న భారతదేశ ప్రజలను ఆదుకునేందుకు, వారికి సేవ చేసేందుకు పశ్చిమ దేశాల నుంచి పలువురు తరలివచ్చారు. అలాంటి వారిలో మిస్ మార్గరేట్ ఒకరు. ఈమె ఐర్లాండ్‌నుంచి వచ్చింది. భారత్‌లాగే ఐర్లాండ్ కూడా అప్పట్లో స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తోంది.
శామ్యుల్ నోబుల్, మేరి హెమిల్‌టన్‌లకు 1867 అక్టోబర్ 28న మార్గరేట్ జన్మించింది. ఆ కుటుంబం సేవాభావం గలది కావడంతో సహజంగానే చిన్నతనం నుంచే మార్గరేట్‌కు ఆ గుణం అబ్బింది. జీవశాస్త్రం, కళలపై మక్కువ పెంచుకున్న మార్గరేట్ విద్యాబోధనలో ఎన్నో ప్రయోగాలు చేసి, మన్ననలు అందుకుంది. 1892లో ఆమె సొంతంగా పాఠశాలను ఆరంభించింది.
సున్నిత హృదయానికి పెద్ద గాయం
మంచి అధ్యాపకురాలిగా పేరుగడించిన మార్గరేట్‌కు ఇంజనీరింగ్ పట్ట్భద్రుడైన ఓ విదేశీయుడితో వివాహం జరిగింది. అయితే, ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. భర్త తీవ్ర అనారోగ్యం పాలై, మరణించాడు. ఈ మనోవేదన నుంచి బయటపడేందుకు పాఠశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆ దుఃఖం నుంచి కోలుకుంది.
జీవితంలో మలుపు
1895 సం.. మార్గరేట్ జీవితంలో ఒక గొప్ప మలుపు. ఆ రోజు ఆదివారం. ఆమె స్నేహితురాలు మార్గెస్‌నన్ ఓ భారతీయ సాధువుకు పరిచయం చేసేందుకు తన ఇంటికి మార్గరేట్‌ను ఆహ్వానించింది. ఆవిడ చెప్పిన ప్రకారం కాషాయ వస్త్రాలను ధరించిన ఓ సాధువు అక్కడ పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ధ్యానముద్రలో సంస్కృతంలో మంత్రాలు ఉచ్ఛరిస్తున్నారు. వీరితోపాటు అక్కడ ఆసీనులైన వారు ‘శివశివ’ అనే పవిత్ర ఉచ్ఛారణకు ప్రభావితులయ్యారు. 1893లో చికాగోలో జరిగిన సర్వధర్మ సమ్మేళనంలో తన ఆధ్యాత్మిక ప్రసంగంతో కోట్లాది మంది అమెరికన్ల హృదయాలను జయించిన స్వామి వివేకానంద ఈ సాధువే అనే సంగతి మార్గరేట్ తెలుసుకుంది.
నివేదితగా..
స్వామి వివేకానంద మార్గరేట్‌ను 1898 మార్చి 25న భగవంతునికి, భారతదేశ సేవకు అంకితమిచ్చారు. ఆ రోజు శుక్రవారం.. మార్గరేట్‌ను అమె సహచరుల్ని స్వామిజీ ఓ మఠానికి తీసుకువెళ్ళారు. అక్కడ మార్గరేట్ చేత శివుడి విశేష పూజలు చేయించారు. ఆమెను ఆశీర్వదించారు. ‘నివేదిత’గా నామకరణం చేశారు. నివేదిత అంటే ‘సమర్పణ’ అని అర్థం. ఆమె ఆరోజు ఈశ్వరునికి సమర్పితమైంది. దేశ సేవకు కంకణం కట్టుకుంది.
చిన్న గుడిసెలో విద్యాలయం
నివేదిత 1898 నవంబర్ 13న కలకత్తాలోని ఓ చిన్న గుడిసెలో పాఠశాలను ప్రారంభించింది. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం సొంతం చేసుకున్న నివేదిక మెడ లో రుద్రాక్షమాల ధరించి, తన సాధు స్వభావాన్ని చెప్పకనేచెప్పేది. ఎన్నో కష్టా లు భరించి, పాఠశాలను నడిపించేది. చదువుకు దూరమైన ఆడపిల్లలను బడి పంపించమని కోరేది.
వణికించిన ప్లేగ్
అడవిలో కార్చిచ్చులా కలకత్తా నగరంలో 1899 మార్చిలో ప్లేగ్ వ్యాధి ప్రబలింది. లక్షలాది మందిని ఆ మహమ్మారి పొట్టనపెట్టుకునేది. అపదలో ఉన్న ప్రజలను రక్షించాలనే దృఢ సంకల్పం గల నివేదిత మురికి కాలువలు, మరుగుదొడ్లు శుభ్రపరిచేది. రోగులకు సపర్యలు చేసేది. ఆమె సేవలను చూసిన యువకులు, అక్కడి మహిళలు సిగ్గుతో తలదించుకుని తాము కూడా సేవా కార్యక్రమాలకు కదిలేవారు. ఇలా నెలరోజులపాటు విశ్రాంతి లేకుండా సేవా కార్యక్రమాల్లో నివేదిత పాల్గొనడంతో అనారోగ్యానికి గురైంది.
నిధుల కోసం పాశ్చాత్యదేశాలకు..
పాఠశాల నడపడం కష్టం కావడంతో నివేదిత ఆలోచనలో పడ్డారు. గురువు స్వామి వివేకానంద సలహా కోసం సంప్రదించింది. గురువు నుంచి ఆజ్ఞ రాగానే యూరప్‌కు పయనమైంది. తిరిగి 1901లో భారతదేశానికి వచ్చింది. పాఠశాల సజావుగా నడవడం మొదలైంది. తన గురువును చూసేందుకు బేలూరు మఠానికి వెళ్ళింది. అది జూన్ 19వ తేదీ... ‘మహోన్నతమైన ఆత్మ నన్ను పిలుస్తోంది. ఎదురుపడే మృత్యువును కౌగలించుకోవడానికి నాకు నేను సిద్ధం చేసుకుంటున్నాను’ అని నివేదితతో స్వామిజీ అన్నారు.
గుండెకోత
1902 జూలై మూడోతేదీన స్వామిజీ మహాసమాధి అయ్యారు. ఈ దుర్వార్త నాలుగోతేదీ సాయంత్రానికి నివేదితకు తెలిసింది. ఆమె మనసు కకావికలమైం ది. అంతా చీకట్లు కమ్మినట్టయింది. మఠానికి చేరుకుని కన్నీళ్ళపర్యంతమై గు రువుకు శ్రద్ధాంజలి ఘటించింది. కొద్ది రోజుల తర్వాత కోలుకున్న ఆమె స్వా మిజీ తన చివరి రోజులో చెప్పినట్టు భారతదేశ స్వాతంత్య్రానికి పాటుపడింది.
సంపదనంతా బేలూరు మఠానికి..
నివేదిత తన దగ్గరున్న సంపదనంతా బేలూరు మఠానికి సమర్పించాలని పేర్కొంది. అప్పటికే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైం ది. తన నిధులతో భారతీయ మహిళలకు జాతీయ శిక్షణ ఇవ్వాలన్నది ఆమె కోరికగా ప్రకటించింది. అక్టోబర్ 13న ఉదయం.. ‘చుక్కాని లేని నా జీవిత నౌక మునిగిపోవాలనుకుంటుంది. కానీ నాకు ఉజ్వల భవిష్యత్ తాలూకా వెలుతురు కనిపిస్తోంది’ అని అంది. అవే మన నివేదిత చివరి మాటలుగా మిగిలిపోయాయి. ఆంగ్లేయుల బానిసత్వపు కోరల నుంచి విముక్తి పొందిన భరత ఖం డం ఇపుడు వాయువేగంతో అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అయినా భారతీయ మహిళల్లో ఏదో నిస్సత్తువ... ఆవేదన అవహించివుంది. వ్యక్తిత్వ సం పన్నులుగా పరుగుపెడుతున్నా ఏవేవో అడ్డంకులు, అనుమానాలు తొలగిపోలేదు. ఝాన్సీలక్ష్మీబాయి, రుద్రమదేవి, నివేదిత వంటి వీరనారీమణుల సేవా దృక్పథా లు, వ్యక్తిత్వాలు, ధైర్యసాహసాలు క్షణ క్షణాన జ్ఞప్తికి తెచ్చుకుంటే అవరోధాలన్నీ మట్టిలో కలిసిపోతాయనడంలో సందేహం లేదు.

మేల్కొల్పిన ప్రవచనాలు
స్వామిజీ ప్రవచనాలు ఆమె హృదయంలో గూడుకట్టుకున్న అంధకారా న్ని పారదోలింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో సేవామార్గంవైపు అడుగులు వేసింది. భారతీయులకు సేవ చేసేందుకు స్వదేశం నుంచి 1898 జనవరి 28న కలకత్తా చేరుకున్న మార్గరేట్‌కు స్వయంగా స్వామి వివేకానంద స్వాగతం పలికారు. మృధు స్వభావం గల మార్గరేట్ బెంగాలి భాషపై పట్టుసాధించింది. అక్కడి ప్రజల్లో మమేకమై భారతదేశం విశిష్టతను ఇతిహాసాల ద్వారా అవగతం చేసుకుంది.

- కృష్ణ