మెయిన్ ఫీచర్

భోగ భాగ్యాలనిచ్చే భోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగి పండుగ పెద్దపండుగగా భావించే సంక్రాంతికి ముందురోజు చేసుకొనేది. భోగాలను, భాగ్యాలను పెద్ద చిన్న అనే తేడాల్లేకుండా అందరినీ సంతోషింపచేసే పండుగ భోగి.
పొద్దు పొద్దునే్న భోగి మంటలు వేసుకుని చుట్టూరు కూర్చుని పిల్లా పెద్ద అందరూ భోగి పండుగ ఆనందాన్ని ఆస్వాదించడానికి ఆరంభం చేస్తారు. భోగి మంటలు రాబోయే సంవత్సరంలోని చీడపీడలను దూరం చేస్తాయని పాతచీపురు, పాత చేటలను ఆ మంటల్లో వేస్తారు.
ఆతరువాత ఇంటిల్లిపాది అభ్యంగన స్నానాలు చేస్తారు.
ఇక రోజంతా ఉండే సందడి ఇలా.. వ్యవసాయదారులకు పంట చేతికి వచ్చిన ఆనందం, చల్లగాలులు వాటికి వెచ్చవెచ్చగా సూర్యుడి కిరణాలు తగులుతుంటే ఆనందంతో కేరింతలు కొడుతూ గాలి పటాలు ఎగిరేసుకునే ఆనందం మగపిల్లలకు, ఇక ఆడపిల్లలు వాకిళ్లనిండా రంగు రంగుల రంగవల్లులు తీర్చి వాటి మధ్య పొద్దున పెట్టే గొబ్బెమ్మలు, సంధ్యగొబ్బిళ్లు ఇలా రెండురకాలుగా గొబ్బెమ్మలను పెట్టి వాటిపై గుమ్మడి పూలను అలంకరించి నలుగురూ కలిసి గొబ్బిపాటలు పాడుతూ ఆస్వాదించే ఆనందం ఇక ఇంటి ఇల్లాలైతే రకరకాల పిండి వంటలు, ఘుమ ఘుమ లాడే పండుగ వంటలు తయారు చేసి ఇంటిల్లిపాది ఆనందానికి కారణమయ్యాన న్న ఆనందం ఇలా ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిచ్చే భోగి పెద్దపండుగే.
రంగవల్లులను మధ్యలోకి వచ్చే హరిదాసులు,గంగిరెద్దులు డూడూ బసవన్నలు, పటాల కథలు చెప్పేవాళ్లు, అర్థనారీశ్వర నృత్యం చూపేవాళ్లు, పగటివేషకాండ్రు, అనేక రకాల జానపద నృత్యకారులు, చాకలి, మంగలి, నేత న్నలు, కుమ్మరి, కమ్మరి ఇలా అన్ని రకాల వృత్తుల వారు కష్ట్ఫలాలను అందుకుంటూ ఆ ఆనందంలో వారివారి వృత్తికళలను ఆవిష్కరించే వేదిక భోగి పండుగ.
అన్నిరకాలవృత్తుల వారిని గృహస్థులు సంభావనలిచ్చి గౌరవించుకొనే రోజు భోగి పండుగ. సాయంసంధ్య అవుతుందంటే ఎక్కడ లేని ఆనందం ప్రతి ఇంట్లోను కొలువయ్యే బొమ్మల కొలువులు పేరంటాలు, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ గ్రహదోషాలను, దిష్టిదోషాలను, బాలారిష్టాలను దూరం చేయడానికి రేగుపండ్లు చిల్లరపైసలు, శనగలు, చెరుకు ముక్కలు, మురమురాలు కలిపి భోగిపండ్లు పోసే వేడుకలు,
ఇలా రోజంతా ఇంటిల్లిపాదిని సంతోషింపచేసే పండుగ భోగి.
అంతా లౌకిక ఆనందమే కాదండోయ్ పరమానందాన్నిచ్చే పండుగ కూడా భోగి. ఈరోజు చిన్ననాటి నుంచి రంగని సేవించి మెప్పించిన రంగనాయికి రంగనాథుని చేపట్టినరోజుకూడా గోదారంగనాథుల కల్యాణ వైభోగ శోభ దేవాలయాల్లో కనుల పండుగగా జరుగుతుంది. ఈ గోదారంగనాథుల కల్యాణాన్ని చూచి తీరవలసిందే కానీ వర్ణించడానికి కవులకే వర్ణాలు కొరవడుతాయి అంటారు. ద్వాపరంలో కృష్ణుడు ఇంద్రుని గర్వమణచడానికి ఇంద్ర పూజ బదులు గోవర్థన పూజ చేయించాడని, ఇంద్రుని వల్ల వచ్చిన ఆపదను గోవర్థన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడాడని కథలను ఈరోజున రమ్యమైన కృష్ణకథలను చెప్పుకుంటూ పౌరాణికులు, ఆధ్యాత్మిక వాదులంతా ఆనందిస్తారు.
కవులంతా కొత్త కోయిలలు మధుమాస గీతాలాపనలు పాడుతోందని సంక్రాంతి కోయిలలకు స్వాగతం చెబుతూ రమ్యమైన ఆనందకరమైన కవితోత్సావాలను చేసుకోవడానికి తయారు అయ్యే రోజు కూడా భోగి. పెద్దపండుగలో మొదటిరోజు కొత్త అల్లుళ్లను కూతుర్లను ఇంటికి పిలుస్తారు. బంధువులందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ రోజంతా ఆనందంగా గడిపి సంక్రాంతి సంబరాలకు సన్నాహాలు చేసుకొంటుండే పండుగే భోగి.