మెయిన్ ఫీచర్

అశ్రద్ధ చేస్తే అకాల మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు పదుల వయసు దాటితే చాలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎంతో ఆకర్షణీయంగా.. అందంగా కనిపించే లావణ్య ఈ మధ్యకాలంలో థైరాయిడ్ అనే అనారోగ్యం ఆమెను అతలాకుతలం చేస్తోంది. ఎప్పుడూ అలసటగా.. పీక్కుపోయినట్లు ఉంటుంది. చర్మం అంతా ముడతలు పడి అరె! ఈమె లావణ్యానే అనేట్లు మారిపోయింది.
మహిళల్లో ఎక్కువ శాతం మంది ఎదుర్కొనే సమస్య థైరాయిడ్. ఈ స్టోమ్ వల్ల గుండె ఆగిపోవడం, గుండెపోటు మరణానికి కూడా కారణమవుతోంది. హైపర్ థైరాయిడిజం ఉన్నవ్యక్తికి చికిత్స చేయనప్పుడు ధైరాయిడ్ స్ట్రోక్ సంభవిస్తుంది. ఈ సందర్భంలో, ఒక వ్యక్తికి అధిక జ్వరం, సక్రమంగా లేని హృదయ స్పందన, పెరిగిన రక్తపోటు, వాంతులు, విరేచనాలు ఉండవచ్చు. కాబట్టి దీని గురించి వివరంగా చూద్దాం.
థైరాయిడ్ స్టోమ్ లక్షణాలు..
హైపర్ థైరాయిడిజం మాదిరిగా థైరాయిడ్ స్టోమ్‌కు సంకేతాలు ఉన్నాయి. కానీ అవి చాలా తీవ్రంగా ఆకస్మికంగా ఉంటాయి. అందుకే థైరాయిడ్ స్టోమ్ లక్షణాలు ఉన్నవారు తమని తాము రక్షించుకోలేకపోతున్నారు.
వీటి లక్షణాలు మనలో ఇలా కనిపిస్తుంటాయి..
*నిమిషానికి 140 బీట్ల కంటే ఎక్కువ హృదయ స్పందన రేటు (టాచీకార్డియా) ఉంటుంది.
* చాలా ఎక్కువగా జ్వరం వస్తోంది. కొన్నిసార్లు 105.8 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం వస్తోంది.
* నిరంతరం చెమటలు పడుతోంది. కామెర్లు వంటివి వస్తుంటాయి.
* అసౌకర్యంగా ఉంటుంది. వాంతులు, వికారంగా ఉంటుంది. తరచూ విరేచనాలు అవుతుంటాయి.
* నిరంతరం మగతగా ఉంటుంది.
* శరీర భాగాల పనితీరులో ఇబ్బంది ఉంటుంది. గుండె ఆగిపోవటం సంభవించవచ్చు. శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చు. తరచూ కడుపునొప్పి వస్తుంది. కాలేయం దెబ్బతినవచ్చు.
* కొన్నిసార్లు థైరాయిడ్ స్టోమ్ ఉన్న వ్యక్తికి ఎగువ శ్వాసకోశంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లు, న్యూమోనియా ఉండవచ్చు.
కారణాలు అనేకం..
హైపర్ థైరాయిడిజంనకు అసంపూర్తి చికిత్స చేయించటం. హైపర్ థైరాయిడిజం చికిత్స చేయనప్పుడు లేదా యాంటీ ధైరాయిడ్ మందులు నిలిపివేయనప్పుడు ఒక వ్యక్తి థైరాయిడ్ స్టోమ్‌కు ఎక్కువ ప్రమాదానికి గురవుతుంటాడు. చికిత్స చేయని థైరాయిడ్ గ్రంథి సంక్రమణ హైపర్ థైరాయిడిజంతో సంబంధం కలిగి ఉంటాయి. డయాగ్మోసిస్ ద్వారా థైరాయిడ్ స్టోమ్‌ను గుర్తించటానికి ప్రత్యేకమైన ల్యాబ్ పరీక్ష ఉండవు. దీనిని గుర్తించటానికి వైద్యులు రోగి సంకేతాలు, లక్షణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అదనంగా వైద్యులు థారాయిడ్ హార్మోన్ స్థాయిలను కొలవడానికి రక్త పరీక్షలను చేయిస్తారు. థైరాయిడ్ స్టోమ్ ఉన్నవారిలో డి3, డి4 హార్మోన్లు సాథారణం కంటే ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ స్టోమ్ అకస్మాత్తుగా మీ శరీరంలోని అన్ని నిర్మాణాలను అభివృద్ధి చేస్తుంది. ప్రభావితం చేస్తుంది. కాబట్టి వ్యక్తికి తక్షణ చికిత్స అవసరం. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించటానికి ప్రొపైల్దియోరాసిల్ లేదా మెథిమాజోల్ వంటి యాంటిడిప్రెసెంట్స్ ఇస్తారు. అంతేకాకుండా హైపర్ థైరాయిడిజం చికిత్సకు అవసరమైనప్పుడు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిది. హైపర్ థైరాయిడిజం ఉన్నవారికి రేడియోధార్మిక అయోడిన్‌తో చికిత్స చేయవచ్చు. ఇది థైరాయిడ్‌ను నాశనం చేస్తుంది. అయినప్పటికీ, ఈరేడియోధార్మిక అయోడిన్ గర్భిణీ స్ర్తిలకు హైపర్ థైరాయిడిజంతో చికిత్స చేయడానికి ఉపయోగించరు. ఎందుకంటే ఇది వారి గర్భంలో ఉన్న శిశువుకు హాని కలిగిస్తుంది. ఆ సందర్భాలలో అటువంటి మహిళ థైరాయిడ్‌ను శ్రస్త చికిత్స ద్వారా తొలగిస్తారు.
మెడ స్థావరానికి దగ్గరగా ఉంటుంది..
థైరాయిడ్ గ్రంథి మన మెడ స్థావరానికి దగ్గరగా ఉంటుంది. శరీర జీవక్రియలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేసే బాధ్యతను కలిగివుంటుంది. ఈ గ్రంథి ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఇది అన్ని గ్రంధుల సమకాలీన అనుసంధాన వ్యవస్థలో భాగంగా ఉంటుంది. దీనిని ఎండోక్రైన్ వ్యవస్థగా సూచిస్తారు. ఈ గ్రంథిని గుర్తించడానికి, థైరాయిడ్ హార్మోన్ (టి4 లేదా థైరాక్సిన్) థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ (టిఎస్‌హెచ్) స్థాయిలను కొలవడం జరుగుతుంది. ఈ స్థాయిలను కొలవడానికి రక్తపరీక్ష నిర్వహిస్తారు.
థైరాయిడ్ గ్రంధి విడుదల చేసే హార్మోను మితిమీరినప్పుడు ఈ పరిస్థితిని హైపర్ థైరాయిడిజంగా సూచిస్తారు. అలాగే హార్మోను స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థితిని హైపో థైరాయిడిజంగా వ్యవహరిస్తారు.
హైపోథైరాయిడిజం అంటే ఏమిటి?
థైరాయిడ్ గ్రంథి పనితీరు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు తగినంత హార్మోన్లు ఉత్పత్తి చేయబడవు. అదేవిధంగా థైరాక్సిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు టిఎస్‌హెచ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిని హైపోథైరాయిడిజం అని అంటారు.
పిట్యూటరీ గ్రంధి టిఎస్‌హెచ్‌ను విడుదల చేయడానికి బాధ్యత వహిస్తుంది. తద్వారా తగిన హార్మోన్లను ఉత్పత్తిచేసే క్రమంలో థైరాయిడ్ గ్రంధిని ప్రేరేపిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళలే ధైరాయిడ్ సమస్యలను ఎక్కవగా కలిగివుంటారు.
హైపోథైరాయిడిజం కొన్నిసార్లు హషిమోటో వ్యాధి కారణంగా కానీ, థైరాయిడ్ గ్రంధిని తొలగించే శస్తచ్రికిత్స జరిగినప్పుడు సంభవించే అవకాశాలు ఉన్నాయి. రక్తపరీక్ష ద్వారానే కాకుండా, వైద్యులు థైరాయిడ్ స్కాన్ పరీక్షను సిఫార్సు చేయవచ్చు. ఈ పరీక్షలో భాగంగా, రేడియోధార్మిక ట్రేసర్ వినియోగించి థైరాయిడ్ పనితీరును అంచనావేస్తారు. మరోరకమైన పరీక్ష కూడా చేస్తారు. అదేమిటంటే అయోడిన్ పరీక్ష నిర్వహిస్తారు. నోటి ద్వారా రేడియోధార్మిక అయోడిన్‌ను ఇస్తారు. మీ థైరాయిడ్ తీసుకోగల అయోడిన్ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. మీరు మూత్ర విసర్జన చేసిన తరువాత మీ శరీరం నుంచి ఈ ట్రేసర్ తొలగిస్తారు.
చేతులు చల్లగా మారటం..
చేతులు చల్లగా మారితే అది రక్తప్రవాహన్ని లేకపోవటాన్ని సూచిస్తుంది. హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడుతున్న సమయంలో థైరాయిడ్ గ్రంధి పనితీరు తక్కువగా ఉంటుంది. ఇది అధిక హోమిసిసిస్టీనోతో ముడిపడి ఉంటుంది. హోమోసిస్టిన్ అనేది ఒకరకమైన అనినో ఆమ్లం వర్గానికి చెందినది. ఇది రక్తం పేలవ ప్రవాహాన్ని సూచిస్తుంది. ఈ సమస్య ప్రధానంగా నరాలు గట్టిపడే సమస్యలకు గుండె వ్యాధులకు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం రక్తంలో నిర్వహించే ముఖ్యమైన పోషకాలు చేతులు, కాళ్లను చేరలేకపోవడమే.
చేతులు ముడతలు పడటం..
హైపోథైరాయిడిజంతో బాధపడేవారు, చేతులలో అదనపు గీతలను ముడుతలను అధికంగా కలిగివుంటారు. క్రియారహితమైన థైరాయిడ్ గ్రంధి, వృద్ధాప్య ఛాయలను కూడా పెంచుతుంది. క్రమంగా ముడుతలతో కూడిన చర్మానికి కారణమవుతుంది. పొడి చర్మానికి కూడా క్రియారహిత థైరాయిడ్ గ్రంథి కారణంగా ఉంటుంది. క్రమంగా ఇలాంటి అసాధారణ పోకడలకు చర్మం గురవుతుందని అనుమానం వచ్చిన ఎడల తక్షణమే వైద్యుడ్ని సంప్రదించటం మేలు.
చర్మం పసుపు రంగులోకి మారటం..
హైపోథైరాయిడిజం వల్ల చర్మం లేతగా పసుపు రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు చర్మం రంగు నారింజ రంగును తలపిస్తుంది. క్రియారహిత థైరాయిడ్ హార్మోన్ కారణంగా చర్మం పాలిపోయి పేలవంగా మారుతుంది. చర్మం కొన్ని సందర్భాలలో ఎరుపు, పసుపు రంగులోకి మారడమే కాకుండా పొరలు పొరలుగా కనపడవచ్చు. క్రమంగా ఇది దురదగా మారి అసౌకర్యంగా ఉంటుంది. ఈ రంగు మారడం వంటి సమస్యలు అధికంగా అరచేతుల్లో కనిపిస్తుంటుంది.
గోర్లు పసుపు రంగులోకి మారటం
గోరు చుట్టు వంటి సమస్యలు
హైపో థైరాయిడిజం కారణంగా చర్మం రంగు మారడమే కాకుండా, మీ గోర్లు కూడా అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా గోరుచుట్టు వంటి సమస్యలు అధికంగా తలెత్తడం, చర్మం సున్నితంగా మారడం, రంగు మారడం తదితర లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. దీనికి కారణం అంత్యభాగాలకు రక్తప్రవాహం సరిగ్గా లేకపోవటమే. రక్తప్రవాహం సరిగ్గా లేని కారణంగా ఆయా ప్రాంతాలు పాలిపోవటం క్రమంగా రంగు మారడం, సమస్యాత్మకంగా పరిణమించడం జరుగుతుంది.
గోళ్లు పెలుసుగా మారడం..
పెళుసైన గోర్లు అధికంగా పొడిబారి ఉంటాయి. క్రమంగా సులభంగా విరిగిపోయేతత్వాన్ని కలిగివుంటాయి. ఒక వ్యక్తి హైపోథైరాయిడిజం సమస్యను కలిగి ఉన్నప్పుడు, గోర్ల అంత్యభాగాలకు రక్త సరఫరా తగ్గడం మూలాన పోషకాలు సరిగ్గా అందని కారణాన రంగు మారడం, పెళుసుగా తయారవడం జరుగుతుంది. అంతేకాకుండా విరిగిపోవడం, తిరిగి పెరగకుండా సమతౌల్యాన్ని కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. అందవిహీనంగా కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా గోరు ఫలకం దెబ్బతిని, ఒక్కోసారి గాయాలు కూడా కనపడటం జరుగుతుంది.
చేతులు కాళ్ల అంత్య భాగాలకు ప్రధానంగా రక్తప్రవాహం లేని కారణంగా గోర్ల ఆరోగ్య క్షీణతకు దారితీస్తుంది. క్రమంగా గోర్లు ఫంగల్ ఇనె్ఫక్షన్లకు గురివడం జరుగుతుంది. ఈ రుగ్మతను ఓనికోలిసిస్ వలే సూచిస్తారు. ఈ వ్యాధి గోళ్లపై తీవ్ర ప్రభావాన్ని కలిగివుంటుంది. ఈ పరిస్థితి గోరుచుట్టు లేదా పెళుసుగా మారే తత్వాలను కలిగివున్న, హైపెర్కేరటోసిస్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గోర్లకు రక్తప్రవాహాన్ని తగ్గించి, జీవం పోయేలా చేస్తుంది కూడా. ఈ సమస్య గోరు ఫలకం పసుపు రంగులోకి మారడానికి కారణం అవుతుంది. క్రమంగా గోర్లు శిధిలాలవలే అందవిహీనంగా మారడమే కాకుండా ఆహారం తీసుకోవటంలో కూడా అసౌకర్యంగా పరిణమిస్తుంది.
పైన చెప్పిన లక్షణాలు కనిపించితే హైపో థైరాయిడిజంతో కూడిన సంకేతాలను కలిగి వున్న ఎడల, తక్షణమే వైద్యుని సంప్రదించడం మేలు. తద్వారా సరైన మందులు, చికిత్సను అందించవచ్చు. ఈ సమస్య నియంత్రణాస్థితిని కొనసాగించటం ముఖ్యం. పరిస్థితిని అనుసరించి, నోటి ద్వారా ప్రతిరోజూ టాబ్లెట్ల రూపంలో హార్మోనుల స్థాయిలను క్రమబద్దీకరించవలసిన అవసరం ఉంటుంది. ఈ మోతాదులు, రక్తపరీక్ష ద్వారా వైద్యునిచే నిర్థారిస్తారు. రక్తపరీక్షలు సమయానుసారం, వైద్యుని సూచనల మేరకు చేయిస్తూ ఉండాలి. అవసరానికి మించి వాడటం హైపర్ థైరాయిడిజం సమస్యకు దారితీయవచ్చు. క్రమంగా అధిక రక్తపోటు, జీవక్రియలు అతివేగం, జీర్ణ సంబంధ సమస్యలు, హార్మోనుల అసమతౌల్యం వంటి తీవ్ర సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పైన చెప్పిన సంకతాలు ఏమాత్రం కనిపించినా.. నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవటం మంచిది.హైపోథైరాయిడిజంతో బాధపడేవారు, నిరంతరం అలసట నిస్సత్తువతో ఉన్నట్లు భావించటం చాలా సాధారణం. అయితే మీరు కూడా ఈ కోవకు చెందినవారు అయితే, మీ శక్తిని పునరుజ్జీవింపజేయడానికి పలు మార్గాలు ఉన్నాయి.
సంపూర్ణ ఆహార సప్లిమెంట్లు
ధైరాయిడ్ పనితీరు సక్రమంగా లేకపోయినా లేదా హైపోధైరాయిడిజానికి గురైనా మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం కీలకం. మీరు తీసుకునే ఆహారానికి ఎంతో డబ్బు పెట్టినా అందులో పోషకాలు ఉండకపోవచ్చు. సంపూర్ణ ఆహార సప్లిమెంట్లు, మీ ఆహారంలో లోపించిన పోషకాలు, విటమిన్లను అందించటం ద్వారా మీకు సహాయపడుతుంది. ఈ లోపాలను గుర్తించడానికి, ఒకసారి రక్త పరీక్షను చేసి చూడాలి.
అలసట అధికంగా ఉండటం..
మీ శరీరంలోని మూత్రపిండాలపై ఉండే, అడ్రినల్ గ్రంథులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను అధికమించటంలో మీకు సహాయం చేస్తాయి. అవి కార్టిసోల్, ఆడ్రినలిన్ విడుదల అవుతుంది. ప్రస్తుతం గజిబిజి జీవితం కారణంగా, అడ్రినల్ గ్రంధులు పనిచేయక, నిష్పలంగా మారిపోయేలా చేస్తుంది.
సరిగ్గా నిద్ర పట్టకపోవటం..
సరిగ్గా నిద్రపట్టకపోవటం అనేది హైపోథైరాయిడిజంతో బాధపడేవారికి సర్వసాధారణంగా మారుతుంది. ప్రతిరాత్రి తప్పనిసరిగా ఎనిమిది గంటల పాటు నిద్ర పోయేటట్టు చూసుకోవాలి. దీనిని ఒక అలవాటుగా మార్చుకోవటానికి ప్రయత్నించండి. వీలైతే నేలమీద నిద్రిస్తే ఎంతో మంచిది.
కార్బోహైడ్రెట్లు కలిగిన ఆహారం తీసుకుంటే ఉపయుక్తం
మీ రక్తంలో చెక్కర స్థాయిని సమతుల్యంగా ఉండేట్లు చూసుకోవాలి. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన కార్బోహైడ్రేట్లను తీసుకోవటం వల్ల ప్యాంక్రియాస్ సాధారణం కన్నా ఎక్కువ మోతాదులో ఇన్సులిన్‌ను స్రవిస్తాయి. ఇది హైపోగ్లైసీమియాకు దారితీసి, క్రమంగా టైప్ 2 మధుమేహంను కలుగుజేస్తుంది. అటువంటి సమయంలో కీటోజనిక్ ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర అసమతుల్యతను పరిష్కరించుకోవచ్చు.
వ్యాయామాలు తప్పనిసరి..
వ్యాయమం ద్వారా థైరాయిడ్‌ను అదుపులో ఉంచవచ్చు. కెటబాలిక్ చర్యకు వ్యతిరేక ఫలితమిస్తోంది. యోగా, తాయ్ చి వంటి వ్యాయామ పద్ధతులు, అనబాలిక్ వ్యాయామం రూపాలుగా చెప్పవచ్చు. కెటబాలిక్ వ్యాయామం వల్ల కండరాల నొప్పి, శరీరం ఒత్తిడి అలసటను కలిగించవు.
విటమిన్ బి12 ఎంతో మంచిది..
విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఆరోగ్యకరంగా, క్రియాశీలకంగా ఉండటానికి అవసరమైన శక్తి ఉత్పత్తిలో సహాయపడుతుంది. హషిమోటో వంటి థైరాయిడ్ సంబంధిత పరిస్థితులు బి12 లోపం వల్ల కలుగుతాయి. అలసటతో, బలహీనమైన అనుభూతి చెందే అవకాశం కూడా ఉంటుంది.
ఐరన్ తీసుకోవటం మరిచిపోవద్దు
ఐరన్‌ను ఉపయోగించి మన శరీరంలో ఉత్పత్తి చేయబడే ఒక ప్రోటీన్, రక్త కణాల ద్వారా శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను బట్వాడా చేయటానిక సహాయపడుతుంది. మీ రక్తంలో ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు మీరు చాలా నీరసంగా ఉంటారు. శరీరానికి బలహీనంగా అనిపించటంతో పాటుగా చికాకుగా, ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు భావించటం గమనించవచ్చు. ఐరన్ అధిగమించటానికి బీట్‌రూట్‌ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మేలు. *