మెయిన్ ఫీచర్

పండుగ ఒక్కటే... ఆచారాలు విభిన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమావాస్య చీకట్లను చీల్చుకుంటూ ఆశాజ్యోతివలే అరుదెంచే దీపావళిని ఉత్తర భారతంలో అయిదు రోజుల పండుగగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో మూడు రోజుల పాటు జరుపుతారు. పండుగ ఒకటైనా విభిన్న ఆచారాల సమ్మేళనమే ఈ వెలుగుల
దీపావళి.
* పశ్చిమ భారతంలో జైనులూ, వ్యాపారస్థులూ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజస్తారు. బంగారం కానీ వెండికానీ ఏమీ లేకపోతే పాత సామగ్రి కానీ కొనడం శుభప్రదం అని భావిస్తారు.
* బీహార్‌లోనూ, ఉత్తర భారతదేశంలోనూ దేవ వైద్యుడైన ‘్ధన్వంతరి’ గౌరవార్థం ధన్‌తేరస్ జరుపుతారు. ధన్వంతరి పూజ పరిశుద్ధతకీ, ఆరోగ్యానికి మంచిదని వారి నమ్మకం.
* పూర్వం దీపావళిని పంటల పండుగ అని కూడా అనేవారు. జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో నవంబర్‌నాటికి వ్యవసాయదారులూ, వర్తకులూ పాత బాకీలు చెల్లించి ఖాతా పుస్తకాలలోని లెక్కలన్నీంటినీ సరిచూసుకునేవారు. వీరు కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభమైనట్లు భావిస్తారు. చాలా మంది ఎక్కౌంట్ పుస్తకాలకు, నేడు ల్యాప్‌టాప్స్‌కు సైతం పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలను వారు ‘చోప్డాపూజన్’ అని వ్యవహరిస్తారు. ఆరోజు వ్యాపారులు, వ్యవసాయదారులు లక్ష్మీదేవిని, గణేశుడికి వైభవంగా పూజలు చేస్తారు.
* పురాణ గాథల ఆధారంగా సీతా రామ లక్ష్మణులు వనవాసాన్ని ముగించుకుని అయోధ్యకు తిరిగివచ్చిన రోజు కాబట్టి అయోధ్యవాసులు తమ తమ ఇళ్లను దీపాలతో అలంకరించారు కాబట్టి ఉత్తర భారతవాసులు ఆరోజు ఇంటిని దీపాలతో అలంకరిస్తారు.
* క్షీరసముద్ర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఆ పాలసముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి దేశంలోని పలు ప్రాంతాలలో ఆ రోజు లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానిస్తూ.. ఇంటిని శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించి ఆహ్వానం పలుకుతారు.
* జైనులు తమ ప్రభువు మహావీర్ పరినిర్వాణం చెందిన దినంగా పరిగణించి ఆరోజు దీపాలు వెలిగించటంతో పాటు శారదాపూజ (జమా ఖర్చుల పుస్తకాలను పూజించటం), లక్ష్మీపూజ కూడా చేస్తారు.
* బలిచక్రవర్తిని, ఆయన భార్య వింధ్యావళితో సహా కొన్ని ప్రాంతాలలో పూజిస్తారు.
* ఉత్తర భారతదేశంలో గోవూలనూ, ఎద్దులనూ పూజిస్తారు. వైష్ణవులు గోవర్థన పర్వతాన్ని పూజించటం, అన్నకూట ఉత్సవాన్ని జరుపుతారు. అన్నపురాశితో కొండలా చేసి పూజించటానే్న ‘అన్నకూటం’ అని అంటారు.
* బ్రహ్మాండ పురాణంలో ‘‘యమధర్మరాజును ఆయన సోదరి యమున తన ఇంటికి విందుకు ఆహ్వానించింది’’ అని ఉన్నందున ఆరోజు సోదరి ఇంట భోజనం చేసి, ఆమెకు బహుమతలు ఇచ్చే సంప్రదాయం కూడా ఈ పండుగనాడు చేస్తారు.
* సిక్కులు తమ ఆరవ గురువు హరగోవింద్‌జీ జైలు నుంచి విముక్తుడైన సందర్భంగా దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటారు. స్వర్ణదేవాలయం దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది.
* గ్రామీణ ప్రాంతాలలో ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి బంధువులను, లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు.
* చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళినాడు టపాసులు కాల్చి ప్రజలు ఆనందోత్సాహాలను వెల్లడిస్తారు.
* దీపావళినాడు ప్రతి ఇంటిలో తీపివిందు జరుగుతుంది. రకరకాల స్వీట్లు తయారుచేస్తారు. మిఠాయికి ఈ రోజు విపరీతమైన డిమాండ్. డ్రైఫ్రూట్స్‌తో చేసిన స్వీట్లు, తీపి కజ్జికాయలు, లడ్డూలు, బ్రెడ్‌తో చేసే స్వీట్లు, గులాబ్ జామ్, ఖీర్, జిలేబీ వంటకాలు చేస్తారు.

-ఆశాలత