మెయిన్ ఫీచర్

మానసిక రుగ్మతలపై యుద్ధం మాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మంచి ఆలోచన జీవితానే్న మార్చేస్తోంది. ప్రతి మనిషి తన జీవితంలో ఎదురయ్యే నిరాశ, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను అధిగమించి విజయపథంలో పయనించాలంటే ముందు వాటిపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అలా జయించాలనుకునేవారికి మా చేయూత ఎల్లవేళలా ఉంటుంది. ఒంటరితనం అనే బాధ నుంచి ఉపశమనం పొందాలనుకుంటే Live Love Laugh Foundation మీకు ఎల్లవేళలా అంఢగా నిలిచి సాంత్వన కలిగిస్తోంది. ఇది సాధారణ వేదిక. ఎవరైనా సహాయం పొందవచ్చు.
- దీపికా పదుకునే, ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు.
**
అందాలు ఆరబోసే దీపికా పదుకునే మానసికరుగ్మతలపై ఇంత విడమర్చి చెబుతుందేమిటని అనుకుంటున్నారా? అంతర్జాతీయ సెలబ్రిటీ అయిన దీపికాపదుకునే ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి మానసిక బలమే అసలైన ఆరోగ్యం అనే నినాదంతో సామాజిక చైతన్యానికి శ్రీకారం చుట్టింది. అందం, డబ్బు ఉండి కూడా చిన్న చిన్న మానసిక సమస్యలకే తానే ఇంతలా తల్లిడిల్లిపోతుంటే సమాజంలో మిగిలినవారి పరిస్థితి ఏమిటి? అని ఆలోచించింది.
ఈ ఆలోచనల నుంచి పుట్టిందే ఈ ఫౌండేషన్. మానసిక బలం మనిషిని విజయపథానికి చేర్చినట్లే.. ఆత్మన్యూనతతో బాధపడేవారు ఎంత మంచి ఆహారం తిన్నా అది శరీరానికి బలాన్ని ఇవ్వదు. మన భావోద్వేగాలే మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. కోపం, కుంగుబాటు, ఆందోళన, ఒంటరితనం వంటి మానసిక రుగ్మతలు మనిషి పతనానికి నాంది పలుకుతున్నాయి. వారు ప్రొఫెషనల్సే కావచ్చు, కాలేజీ అమ్మాయిలే కావచ్చు, సాధారణ గృహిణే కావచ్చు.
ఎవరికైనా ఈ ఫౌండేషన్ అవసరమైన సాయం అందిస్తోంది. జీవితం ఉల్లాసంగా.. ఉత్తేజభరితంగా సాగిపోవాలంటే మానసిక ఆరోగ్యమే అసలైన మందు అని గ్రహించిన దీపికా ప్రజలలో మానసిక ఆరోగ్యం పట్ల చైతన్యం తీసుకువచ్చేందుకు తన ఫౌండేషన్ ద్వారా విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. గత ఏడాది అక్టోబర్ నెల నుంచి ‘మళ్లీ అడగండి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మనజాతికి కావల్సింది ధీరత్వం అని ప్రజలు దీన్ని చెబితే తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారని దీపకా నిశ్చితాభిప్రాయం. దేశవ్యాప్తంగా ఈ ఫౌండేషన్‌కు మానసిక నిపుణులు ఉన్నారు. మీకు ఏ సమస్య ఎదురైనా..వెంటనై ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసిన ‘స్నేహ, సహాయ, ఆసార’ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్‌చేస్తేచాలు మిమ్మల్ని మనిషిగా తీర్చిదిద్ది సామాజిక జీవన స్రవంతిలోకి తీసుకువస్తోంది. పదిహేడేళ్ల యువతి నుంచి పండు ముదుసలి వరకు ఈ సహాయాన్ని పొందవచ్చు. అంతేకాదు కౌనె్సలింగ్, అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం నిర్థారించింది
మన దేశ ప్రజలు మానసికంగా అత్యంత అణగారినవారిగా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం నిర్థారించింది. పదిమందిలో ఒకరు నిరాశానిస్పృహాలతో జీవిస్తున్నారని నిర్థారించినట్లు దీపికా చెబుతూ.. ఇటువంటివారికి సరైన గైడెన్స్, మార్గనిర్ధేశంచేస్తే ఒత్తిడిని జయిస్తారని, ఫలితంగా మనదేశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన గణాంకాలలో మార్పు తీసుకురాగలమని ఆమె విశ్వాసం. మానసిక ఆరోగ్యంపై ప్రజలకు విడమర్చి చెప్పటానికి ఓర్పు, సహనంతో ఫౌండేషన్ సభ్యులు, నిపుణులు పనిచేస్తారని ఆమె వెల్లడించారు. సభ్యుల మాటలు కూడా మృధువుగా, సున్నితంగా ఉంటాయి. స్నేహితులనుగానీ, కుటుంబ సభ్యులను గానీ కలిసినపుడు ‘ఎలా ఉన్నారు’ అని ప్రేమగా అడిగితే చాలు వారి ఇచ్చే సమాధానాన్ని బట్టే వారు మానసికంగా సరిగా ఉన్నారో లేదో అని అర్థం చేసుకోవచ్చు.
జీవితానికి సరైన నిర్వచనం..
నేను కలిసిన ఎంతోమంది వ్యక్తుల భావోద్వేగాలను పరిశీలించిన తరువాత జీవితం చాలా సున్నితమైందని అర్థంచేసుకున్నట్లు, ఇలాంటి సున్నితమైన జీవితానికి అర్థాన్ని తెలియజేప్పే ఉద్దేశ్యంతోనే ఈ ఫౌండేషన్‌ను స్థాపించినట్లు దీపికా చెబుతారు. మనిషిని కుంగుబాటు నుంచి బయటకు తీసుకురావటానికి అవసరమైన చికిత్స చేయవచ్చని, అతనిని మానసికంగా దృఢంగా, కారుణ్య మార్గంలో నడిపించవచ్చనే విశ్వాసంతో ఫౌండేషన్ పనిచేస్తుందని అంటారు. డిప్రెషన్ మీద యుద్ధం చేయాలంటే ముందు తగిన సలహాలు ఇస్తే చాలని వాటిని ఆకళింపుచేసుకుని డిప్రెషన్ నుంచి బయటపడతారని దీపికా విశ్వాసం. ప్రతి మనిషి తనకు తానుగా డిప్రెషన్ నుంచి బయటపడటానికి ప్రయత్నించాలని, అలా సాధ్యంకాని వ్యక్తి కారణాలను, మూలాలను కనుగొని కౌన్సిలింగ్, అవసరమైతే నిపుణుల సలహాతో ట్రీట్‌మెంట్ తమ ఫౌండేషన్ అందజేస్తుందని చెబుతోంది. డిప్రెషన్‌కు గురైన వ్యక్తి చుట్టూ నెలకొన్న పరిస్థితులను కూడా తెలుసుకుని తగిన సలహాలతో పాటు ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా తీర్చిదిద్దుతామని వెల్లడించింది. సామాజిక జీవన విధానాలు, మన చుట్టూ ఉండేవారు మనకు మద్దతుగా ఉంటే తప్పకుండా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని దీపికా విశ్వాసం. ‘‘నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవటం నీకు పెద్ద కష్టం కాదు, మన ఆలోచన సక్రమంగా లేకపోతే వెంటనే అటువంటి ఆలోచనలను మనసు నుంచి తోసేస్తే ఉపశమనం పొందుతావు’’ అని దీపికా ఎంతో స్నేహాపూరితంగా చెబుతుంది. మానసిక ఆరోగ్యంపై దీపికా తపన గుర్తించిన ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు, హితులు, శ్రేయోభిలాక్షులు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.

మన దేశంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు గురించి చర్చించుకుంటాం. కాని కుంగుబాటు (డిఫ్రెషన్) గురించి అసలు మాట్లాడుకోం. ప్రతి మనిషికి విచారం, నిరాశ, నిస్పృహ కలగటం సహజం. ఈ సమస్యలను అధిగమించకపోతే అదే డిప్రెషన్‌కు దారితీసి జీవితాన్ని అంధకారం చేస్తాయి. మనదేశంలో 36శాతం మందికి పైగా తీవ్ర కుంగుబాటుకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం నిర్థారించింది. దీన్ని బయటపడాలంటే వ్యాయామమే దివ్యమైన ఔషధం. ప్రతిరోజూ అరగంటపాటు ఏ రకమైన వ్యాయామమైనా మనసుపై తీవ్ర ప్రభావం చూపి చురుకుగా పనిచేసేలా చేస్తోంది.