మెయిన్ ఫీచర్

కాళ్లు లేకపోతేనేమి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు గొప్పగా బతికి, పదిమందికి దారి చూపించింది. నేడు దారిలేక, నడవలేక చతికిలపడిపోయింది. అర్థాంతరంగా విధి తన రెండు కాళ్ళనూ రైలు ప్రమాద రూపంలో లాక్కొనిపోయినా, మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేస్తోంది ఈ విజయ.
రాజమహేంద్రవరం దేవీచౌక్ నుంచి పేపరు మిల్లుకు వెళ్ళే రోడ్డులో విజయ మహిళా టైలరింగ్ షాపు నిత్యం దుస్తులు కుట్టించుకునేవారితో కళకళలాడుతుండేది. ఎందుకంటే అక్కడ కోటిపల్లి శేషుకుమారి (విజయ) అనే మహిళ రకరకాల దుస్తులను సరికొత్త డిజైన్లలో అతి తక్కువ ధరకు (జిల్లాలోనే) కుడుతుంది. ఆమె వద్ద ఒక్కసారి దుస్తులు కుట్టించుకున్నవారు మరోసారి తప్పక రావాల్సిందే. అంతటి పనితనం . కస్టమర్ల తాకిడికి తట్టుకోలేక ఆమే కొంతమంది పేదింటి అమ్మాయలకు శిక్షణ ఇచ్చి తమ వద్ద పనిచేయించుకుంటూ వారికి ఆర్థికంగా భరోసాను కల్పించేది. అందుకే ఆమె అందరికీ విజయమ్మ అయ్యింది. ఇది 2012 ఫిబ్రవరికి ముందు వరకు (ఆమె ప్రమాదానికి గురికాకముందు)...
ప్రస్తుతం ఆమె పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పదిమందికి దారి చూపించిన ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. ఈ విజయ దీనగాథ చదివి తీరాల్సిందే.. ఏం జరిగిందంటే...
ఆమె భర్త 2009లో క్యాన్సర్‌తో మరణించాడు. అప్పటికే అతడు విపరీతంగా అప్పులు చేసేశాడు. అవన్నీ తీర్చాలంటూ అప్పులవాళ్ళు ఆమెపై దండయాత్ర మొదలెట్టారు. వారికి నచ్చచెప్పి నెలకు కొంత ఇస్తానని ఒప్పందం చేసుకుని ఆ విధంగా అప్పులు తీర్చేందుకు సిద్ధమయ్యింది విజయ. ఒక్కో సమయంలో అప్పులవాళ్ళు ఒత్తిడి భరించలేక ఆత్మహత్యయత్నానికి సైతం సిద్ధపడింది. షాపులో పనిచేసేవారు గమనించడంతో ఆమె బతికి బట్టకట్టింది.
ఆ తర్వాత 2012లో ఒక్కగానొక్క కుమార్తెకు పెళ్లి చేసేందుకు నిశ్చయించుకుని ఓ సంబంధం కూడా కుదిర్చారు. ఫిబ్రవరి 14న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.
పెళ్లి పనులతో బిజీగా ఉండే ఆమెను ఒంటరితనం వేధిస్తున్నా ఆమె మంచితనం చూసి చాలామంది తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ ధైర్యంతోనే ఆమె పెళ్లి పనులు చకచకా మొదలుపెట్టింది.
విధి రైలు ప్రమాదం రూపంలో...
పెళ్లికి రెండు రోజుల ముందు రాజమహేంద్రవరం నుంచి శ్రీకాకుళం బయలుదేరింది. వైజాగ్‌లో రైలు దిగి, శ్రీకాకుళం వెళ్ళే రైలు ఎక్కేందుకు సిద్ధమైంది. జనం తోపులాటలో ఆమె రైలు కిందకు పడిపోయింది. అప్పు డే రైలు గ్రీన్ సిగ్నల్ పడడం తో ముందుకు కదిలింది. ఎవరో మహాత్ముడు ఈ విషయా న్ని గమనించి చైన్ లాగడంతో రైలు ఆగింది. కానీ అప్పటికే విజయ రెండు కాళ్లు చెరకు ముక్క ల్లా తెగిపడ్డాయి. రక్తం ఏరులై పారింది. ఆమె వద్ద ఉన్న బ్యాగ్లోని సెల్ ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించారు అక్కడి రైల్వే సిబ్బంది. బంధువులందరూ పెళ్లి వాయిదా వేసుకునేందుకు సిద్ధమై, అక్కడికి చేరుకున్నారు. నాకేం కాలేదు.. కాళ్లే కదా పోయాయి. ప్రాణం ఉంది కదా.. నా చిట్టి తల్లి పెళ్లి ఆపవద్దు.. అంటూ కన్నీటి పర్యంతమైంది. ఆమెను విశాఖపట్నంలోని జిజిహెచ్‌కు తరలించారు. అక్కడి వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆమెను అలాగే వదిలేశారు. మోకాళ్ళ పైవరకు కోల్పోయిన ఆమెకు ఎట్టకేలకు శస్తచ్రికిత్స చేశారు. ఆ తర్వాత బంధువుల సాయంతో రాజమహేంద్రవరం చేరుకుంది. నవ్వుతూ, సంతోషంగా బయలుదేరిన ఆమెను ఆ పరిస్థితిలో చూసినవారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. కాళ్ళు లేకపోయినా డిప్రెషన్‌కు గురికాకుండా మనోధైర్యంతో కొద్దిరోజులకు మళ్లీ షాపు తెరచింది. అయినా ఖాతాదారులు మాత్రం ఆంతంతమాత్రంగానే వచ్చేవారు. తనకు కాళ్ళు ఉన్నప్పు డు ఖాతాదారులకు దుస్తులు సకాలంలో అందించే అవకాశం ఉం డేది. డిజైన్లను కత్తిరించడం వర కు తాను ఓకే. కానీకుట్టాలంటే మాత్రం కాళ్ళు కావాల్సిందే. ఫలితంగా మరింత అప్పులపాలైంది. ఓ వైపు ఇంటి అద్దె, మరోవైపు షాపు అద్దె చెల్లించగా నెలకు తినడానికి కూడా చాలని పరిస్థితి ఎదురైంది. ఉండడానికి గూడులేదు, ఆదరించే వారు అంతకన్నా లేరు. ఒకప్పుడు బంధువులతో కళకళలాడే తన ఇల్లు ఇప్పుడు కనీసం పలకరించేవారు కూడా లేక బోసిపోవడంతో నిత్యం కుమిలిపోయేది. విధి విధించిన శిక్షకన్నా నా అనుకునేవాళ్లు తనను దూరం చేయడం తట్టుకోలేకపోయింది.
కన్నీళ్ళు ఇంకిపోయాయి
ఎన్ని బాధలు ఉన్నా ఎప్పుడూ సంతోషంగా ఉండేదాన్ని. నాకున్న పరిధిలో నలుగురికి సాయం చేసేదాన్ని. రైలు ప్రమాదం తర్వాత నా జీవితంలో చీకటి అలుముకుంది. నా గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. ఏడి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి. దాతల సాయం కోసం ఎదురచూస్తున్నాను. దయచేసి సాయం అందించి ఆదుకోండి.
- కోటిపల్లి విజయ
ప్రభుత్వ సాయం శూన్యం
రైలు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయిన విజయకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. కనీసం వికలాంగ పింఛను కూడా రావడంలేదంటే ఆమె పరిస్థితి ఎంత దారుణంగా వుందో చెప్పకనే చెప్పగలం. వీల్‌చైర్ సైతం ఆమె కొనుక్కున్నదే. అప్ప ట్లో ఆమెకు సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నేటికీ ఎలాంటి సాయం అందచేయలేదు. స్థానిక పజాప్రతినిధులు కూడా తమ వంతు సాయం అందిస్తామని హామీలు గుప్పించారు. అవి కూడా నీటిమీద రాతలుగానే మిగిలాయి. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా వాలిపోయి, వారికి సాయం చేసే విజయ నేడు దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ఎవరైనా దయగల దాతలు ముం దుకు వచ్చి సాయం చేయాలని ఆమె ప్రార్థిస్తోంది. ప్రాంతీయ భేదాలు లేకుండా సాయం చేసే దాతలు 9491165709 ఫోన్ నెంబర్‌లో విజయను సంప్రదించవచ్చు. -

నీలిమ సబ్బిశెట్టి