మెయిన్ ఫీచర్

పేపర్‌తో అందంగా ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేపర్ చదివేసి పక్కన పడేస్తాం. కాదేది కవితకు అనర్హం అన్నట్లు పాత పేపర్‌తో కూడా క్రిస్మస్ సందర్భంగా అందంగా ముస్తాబు చేయవచ్చు. చిన్న కుండీలో ఒక గట్టి కర్ర ముక్కను తీసుకోండి. దానికి అందంగా రోల్ చేసిన పేపర్‌ను కోన్ ఆకారంలో కత్తిరించి అతికించండి. ఇది క్రిస్మస్ చెట్టు ఆకారంలో వస్తుంది. పేపర్ చెట్టుపైన దేవదూత లేదా క్రిస్మస్ స్టార్‌ను అందంగా అమర్చండి. ఇక మీ ఇంట్లో వెలుగులు నిండిపోతాయి. అలాగే మరో సాధారణ పేపర్ క్రిస్మస్ చెట్టును కూడా అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. పేపర్‌ను స్కేర్ ఆకారంలో పెద్దవిగానూ, చిన్నవిగానూ కత్తిరించి అమర్చకుంటే క్రిస్మస్ ట్రీ ఆకారంలో వస్తుంది. తరువాత పైన స్టార్‌ను ఏర్పాటుచేసుకోండి. దీనిని ఒక ప్లేటులో ఎక్కడైనా అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. రోలింగ్ పేపర్‌ను వృత్తాకారంలో కట్ చేసి అందమైన స్టార్‌ను సులభంగా తయారుచేసుకోవచ్చు. వీటిని రిబ్బన్‌తో వేలాడదీసుకోవచ్చు. ఇంటి గుమ్మం ముందు అందంగా వేలాడుదీసుకోవటానికి కార్డ్‌బోర్డ్‌ను ఆకుల ఆకారంలో చక్కగా కట్ చేసుకుని పచ్టటి పెయంట్ వేయిండి. అలాగే మిగిలిన వాటికి బంగారు లేదా ఎరుపు రంగులు వేస్తే ఇంటికి వచ్చిన ఆతిథులను ఆత్మీయంగా పలుకరిస్తుంది.