మెయిన్ ఫీచర్

మనసున్న డిజైనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న యువ డిజైనర్ ఆమె. యుక్త వయసులో ఉండే డిజైనర్లు ఎంతవరకూ తమ కెరీర్, సంపాదన గురించే ఆలోచిస్తుంటారు. ముంబయికి చెందిన మహెకా మిర్పూరి మాత్రం తన కెరీర్‌ను క్యాన్సర్ బాధితుల కోసం బాసటగా చేయాలని భావించింది. ఇందుకోసం 2.33కోట్ల రూపాయల నిధితో వైద్య సహాయం అందిస్తోంది.
పెళ్లి దుస్తులే ఫ్యాషన్ డిజైనర్‌ను చేశాయి
ఫ్యాషన్ రంగంలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న మహెక తొలి రోజుల్లో పేరున్న డిజైనర్ కాదు. తన పెళ్లికి తానే డిజైన్ చేసుకున్న దుస్తులు ఆనాడు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అంతేకాదు సరకొత్త డిజైనర్‌గా తనను తాను తీర్చిదిద్దుకోవటానికి ఆ దుస్తులే తోడ్పాటునందించాయంటారు. దీంతో ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెకు గుర్తిం పు, రెండు చేతులా ఆర్జించే అవకాశాలు వచ్చాయి. అవకాశాలను అం దిపుచ్చుకుంటున్న ఆమె దుస్తుల డిజైన్లలో కొత్త ఆవిష్కరణలు చేస్తూ దూసుకుపోయింది. ఆమె రూపొందించిన ‘బర్డ్ బ్లౌజ్’ ఓ సంచలనం. ఇరవై ఏళ్ల క్రితం సొంత దుకాణం పెట్టుకున్నా ఒక్క కస్టమర్ కూడా రాకుండానే కాలం గడిపిన ఆమె నేడు క్షణం తీరిక లేకుం డా పనిచేస్తోంది. ఆ పని పరుల శ్రయోస్సు కోసం చేస్తుండటంతో అందులోనే ఆనందాన్ని పొందుతుంది.
స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు
హైదరాబాద్‌లో నివశించే ఆమె అక్క భర్త, తండ్రి కూడా క్యాన్సర్‌తో ఒకే ఏడాది మరణించారు. ఈ మరణాలు ఆమెను కదిలించాయి. ప్రాణాలను హరిస్తున్న పొగాకు వాడకం, తద్వారా వస్తున్న క్యాన్సర్ బాధితుల కోసం తన కెరీర్ ద్వారా ఏదైనా చేయాలని భావించింది. ఆలోచన రావటమే తరువాయి తన స్నేహితులను, డిజైనింగ్ రంగంలో సెలబ్రిటీలతో తనకున్న పరిచయాలతో ప్రతి ఏడా ది ఫ్యాషన్ షోలను ఏర్పాటుచేయటం ప్రారంభించింది. 2013లో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి టాటా మెమోరియల్ ఆసుపత్రికి వెళ్లి డైరెక్టర్‌ను కలిసింది. అక్కడ చికిత్స తీసుకుంటున్న హెడ్,నెక్ క్యాన్సర్ పేషెంట్లకు తన ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాది తాను డిజైన్ చేసిన దుస్తులను, ఆభరణాలను వేలం వేయ గా వచ్చిన డబ్బుతో సేవా కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. తొలి ఏడాది ఆమె డిజైన్ చేసిన దుస్తులతో ప్రముఖ బాలీవుడ్ తార మనీషా కొయిరాల ర్యాంప్‌పై వాక్ చేశారు. ఆ తరువాత కునాల్ కపూర్, సోహ అలీఖాన్, వివేక్ ఒబెరా య్, అనిల్ కపూర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృత ఫడ్నవిస్ వంటి ప్రముఖులు ర్యాంప్‌పై నడిచారు. ఇలాంటి సెలబ్రిటీల సహకారంతో సమకూరిన 2.33కోట్ల నగదుతో ఇపుడు క్యాన్సర్ పేషెంట్లకు ఉచితంగా పూర్తిస్థాయిలో వైద్యాన్ని అందిస్తూ వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తోంది. ప్రజలలో పొగాకు తాగటం అనేది సామాన్య బలహీనత. కాని ఇదే వారి ప్రాణాలను హరిస్తుందని, ఈ పొగాకు వాడకం వల్ల కలుగుతున్న అనర్థాలపై సామాన్యులలో చైతన్యం తీసుకువస్తూ, దీనివల్ల క్యాన్సర్ బారిన పడుతున్న పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది.

చిత్రం..మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృత ఫడ్నవిస్‌తో..