మెయిన్ ఫీచర్

మీ రోగాలు మీ చేతుల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరికైనా సామాజిక బాధ్యత అవసరం అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. కానీ నేటి ఆధునిక యుగంలో సుఖాలకు అర్రులు చాచే వారికి అసలు సామాజిక బాధ్యత అంటేనే తెలీదు. తెలిసినా ఎందుకో అశ్రద్ధ..నిర్లక్ష్య వైఖరి! ఇటువంటి వారి వలనే నేడు భారతదేశాన్ని అనే క జాడ్యాలు,ప్రధానంగా వ్యాధుల భూతాలు పీడిస్తున్నాయి.
అశ్రద్ధపరులు వ్యాధులను తమ పరిసరాలనుంచే పరోక్షంగా ఉత్ప త్తి చేస్తుంటారు. ఖాళీ స్థలాల్లో ఇంట్లోని చెత్తనంతా వేస్తూ ఆ ప్రాంతాన్నంతా దుర్గంధభరితంగా తయారు చేస్తుంటారు. చెత్తకుండీలు కంటికి కనిపిస్తున్నా బద్ధకం ఆవహించి, ఆ చెత్త డబ్బా వరకు వెళ్లకుండా ఇంటినుంచే చెత్తను జబ్బల బలంతో విసురుతుంటారు. ఆ చెత్త వేలాడుతున్న కరెంటు వైర్ల మీద వాలొచ్చు. లేదా సమీపంలో వున్న ఖాళీ స్థలాల్లో లేదా రోడ్డుమీదనైనా పడొచ్చు. దీని వల్ల పురుగులు, ఈగలు, దోమలు వృద్ధిచెంది అవి మనల్నే రోగాలు పాలుచేస్తుంటాయ. సామాజిక బాధ్యతను ఎరిగిన నూటికి పది శాతం మంది మాత్రమే చెత్తను డబ్బాల్లో వేస్తున్నారు.
పరిసరాలను అపరిశుభ్రం చేయటం వల్ల రోగాలు ముంచుకొస్తాయని ఘోషించినా వీరు మారరు. చివరకు వీరికి ఆ రోగాలు సోకినా సరే. ఇటువంటి వారు వంటింట్లో సామగ్రి కోసం బజారుకు వెళ్లే ముందు సంచి పట్టుకుపోరు. ఆ దుకాణం వారు ఇచ్చే ప్లాస్టిక్ సంచి వినియోగిస్తారు.
ఈ ప్లాస్టిక్ సంచులు వినియోగం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే కనీస అవగాహన ఉంటే అలాంటి సంచులను విని యోగించం. ఆ దుకాణం వారు ఇవ్వబోయే ప్లాస్టిక్ సంచి భూమిపై పడవేస్తే అది అంత త్వరగా భూమిలో కలవదు. కొనే్నళ్లు పడుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కొక్కసారి ఈ ప్లాస్టిక్ సంచులను ఆవులను తింటున్నాయ. వాటి పాలనే తాగి మనం రోగాలు కొనితెచ్చుకుంటున్నాం. ఇవన్నీ వీరి మెదడుకు ఎక్కవు. పర్యావరణంపై కనీస బాధ్యత ఉన్నవారు ఇటువంటి పనులు మరోసారి చేయరు. పైగా వీటి వల్ల ఎన్నో రోగాలను మన చేతలతో మనమే తెచ్చుకుంటున్నాం. బాధ్యత ఉన్నా ఇటువంటి పనులు మరోసారి చేయకూడదు.
కొంతమంది బహిరంగ ప్రదేశాల్లో పొగతాగుతూ ఇతరులను ఇబ్బందులకు, రోగాలకు గురి చేస్తుంటారు. ఇలాంటి పొగ పీల్చటం వల్లే క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాల పాలవుతున్నాం. ప్రకృతి మనకు ప్రసాదించిన స్వచ్ఛమైన నీటిని సైతం కలుషితం చేస్తూ తోటివారిని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాం.
వ్యర్థపదార్థాలను చెరువులలో పడేసి కలుషితం చేయటం వల్ల చేపలతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు రోగాల పాలవుతున్నారు. కాబట్టి ఇంటి నుంచే పరిసరాల పరిశుభ్రత పాటించటం సామాజిక బాధ్యతగా భావిస్తే సమాజం పచ్చగా పదికాలలపాటు మనుగడ సాగిస్తుంది.
పసితనం నుంచే నేర్పించాలి
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ర్యాంకులు తేవాలని చదువువైపే వత్తిడి చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు, సేవా కార్యక్రమాలవైపు వెళ్లేలా ప్రోత్సహించాలి. అదేవిధంగా సామాజిక పరిస్థితులపై కనీస అవగాహన వుండేలా చేయాలి. సామాజిక బాధ్యత నేర్పించాలి. ఇంటికి వార్తాపత్రికలు, ఆధ్యాత్మిక పత్రికలు తెప్పించుకోవాలి. మొదటి రెండు మూడురోజులు వాటిని చూడని పిల్లలు మూడోరోజునుంచి ఆ పుస్తకాల రెప్పలను తిరగేసేందుకు ప్రయత్నిస్తారు. తర్వాత రెప్పలు వాల్చకుండా చదువుతూ సమాజపు, దేశం, ప్రపంచం స్థితిగతులు తెలుసుకుంటారు. ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేయడం అలవాటు చేసుకుంటారు.

- జి.కల్యాణి