మెయిన్ ఫీచర్

ఆ రెస్టారెంట్‌కు తొంభై ఏళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రెస్టారెంట్‌లో దోశ తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లే. ప్రపంచంలో ఎక్కడా లభించని ఘుమఘుమలాడే దోశ అక్కడ లభిస్తోంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఇడ్లీలు.. మెరిసే వెండి గ్లాసులోకమ్మటి కాఫీ.. ఇలా ఒకటేమిటి ఏది తిన్నా..తాగినా అమ్మచేతి వంట కమ్మగా తిన్నట్లే. ఐటీ నగరంగా ప్రసిద్ధిచెందిన బెంగుళూరులోని పురాతన రెస్టారెంట్ మల్లావి టిఫిన్ రూమ్స్ (ఎంటీఆర్) పేరు ఎంతో సుపరిచితం. తొంభై రెండేళ్ల చరిత్ర ఉన్న ఈ రెస్టారెంట్‌కు స్టూడెంట్స్‌గా వచ్చి ఇక్కడ భోంచేసినవాళ్లే తదనంతరం మనవళ్లు మనవరాళ్లను ఎత్తుకుని వచ్చి ఇంటిల్లిపాదీ భోంచేసి వెళ్లేవారెందరో..? ఒక్కసారి ఈ రెస్టారెంట్‌లో అడుగుపెట్టినవారు ఇక్కడ భోంచేసిన తరువాత మళ్లీ రాకుండా ఉండలేరు. రుచిగా..శుచిగా ఉండే ఘుమఘుమలాడే ఆహారపదార్థాలు రా..రమ్మని ఆహ్వానిస్తుంటాయి. 1924లో ఏర్పాటుచేసిన ఈ రెస్టారెంట్‌కు 40 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారు క్రమం తప్పకుండా కాఫీ తాగటానికి వస్తుంటారు. కాఫీని వెండి గ్లాసులో ఇస్తారు.
మహిళలు సైతం అధిక సంఖ్యలో...
ఈ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలు మూడవ జనరేషన్ వచ్చేసరికి హేమమాలిని మియాల్ అనే మహిళ చేతికి వచ్చాయి. ఈమె హయాంలో ఈ రెస్టారెంట్ రెండు ఫ్లోర్స్‌తో ఒకేసారి 150 మంది కూర్చొని తినేలా విస్తరించింది. మహిళలు సైతం ఎక్కువ మంది వచ్చి ఇక్కడ భోంచేస్తారు. రోజుకు రెండువేల మంది భోంచేస్తారని, వీకెండ్స్‌లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని రెస్టారెంట్ యజమాని హేమమాలిని చెబుతున్నారు. గృహిణులు సైతం ఇక్కడ వంటకాలను ఇష్టపడతారు. వంటగది చాలా పరిశుభ్రంగా ఉంటుందని, ఆహారపదార్థాలు చాలా రుచిగా ఉంటాయని సంగీతాజైన్ అనే గృహిణి అంటా రు. కొంతమంది మహిళలు క్రమంతప్పకుండా వచ్చి తినివెళతారు. బెంగళూరు నగరానికి వచ్చానంటే తప్పకుండా ఈ రెస్టారెంట్‌కు రాకుండా ఉండనని సుశీలాజైన్ అంటారు.
ఆహా ఏమీ రుచి
సెట్ భోజనం రూ.240లు ఉంటుంది. ఇందులో బలవర్థకమైన క్యారెట్, బీట్‌రూట్ వంటలు, ఫ్రైడ్ బ్రెడ్, పప్పుచారు, రైస్‌లోకి అవసరమైన వివిధ రకాల వంటకాలు, స్వీట్స్, ఫ్రూట్స్, ఐస్‌క్రీమ్‌తో పాటు కమ్మటి ద్రాక్షారసం వడ్డిస్తారు.
ముచ్చటగా ముగ్గురన్నదమ్ములతో..
1924లో ఉడిపి జిల్లాలోని టినీ గ్రామంలో మియా బ్రదర్స్ అయి న పరమేశ్వర, గణప్పయ్య, యజ్ఞనారాయణ అనే సోదరులు ఇంట్లో తయారుచేసిన ఇడ్లీ, వడ, దోశ, కాఫీ తయారుచేసుకుని బెంగళూరు నగరానికి తీసుకువచ్చి అమ్ముకునేవారు. ఆరోజులో వారి చేతి వం టకాలు రుచిగా ఉండటంతో చాలామంది వచ్చి భోంచేసేవారు. కస్టమర్లు విపరీతంగా వస్తుండటంతో వీరు ఓ చిన్న రెస్టారెంట్‌ను ప్రారంభించారు. తదనంతరం 1960 లాల్‌బాగ్‌కు మార్చారు. ఇపుడు ఈ రెస్టారెంట్ శాఖలు పదమూడుకు విస్తరించాయి. ఇందులో తొమ్మిది బెంగళూరులోనూ, ఒకటి ఉడిపిలోనూ, మిగిలిన మూడు విదేశాల్లో ఉన్నాయి. వంటవాళ్లు సైతం తమ సొంత ఇంట్లో పనిచేస్తున్నట్లు భావిస్తారు. దాదాపు 35 ఏళ్ల నుంచి పనిచేసేవారు కూడా ఉన్నారు. ఇలా ఈ రెస్టారెంట్ ఎన్నో ఏళ్ల నుంచి కమ్మటి భోజనాన్ని అందిస్తూ కస్టమర్ల అభిమానాన్ని సంపాదించుకుంది.
**
స్టూడెంట్‌గా ఉన్నప్పటి
నుంచి వస్తున్నాను..

63 సంవత్సరాల రంగస్వామి బెంగళూరు చదువుకోవటానికి వచ్చినపుటి నుంచి ఈ రెస్టారెంట్‌లో భోంచేసేవాడు. ఇపుడు ఆయన మనవళ్లు, మనవరాళ్లను కూడా తీసుకువచ్చి ఇక్కడ భోజనం పెట్టిస్తాడు. మా కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ భోజనం అంటే ఎంతో ఇష్టం అని చెబుతాడు. రేఖాజైన్ అనే మహిళ చిన్నప్పటి నుంచి ఇక్కడే భోంచేస్తుంది. ఇలా ఎంతోమంది ఈ రెస్టారెంట్ రుచిని ఏళ్లతరబడి నుంచి ఆస్వాదిస్తూనే ఉంటారు.
***