మెయిన్ ఫీచర్

తొలి అడుగు.. భవితకు ముందడుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపటి పౌరుడు ఉత్తముడిగా వెలుగొంది, దేశ భవిష్యత్‌కు పునాది కావాలంటే అక్షర స్వీకారం తప్పనిసరి. ఇది జీవితానికి తొలి పునాదిగా చెప్పాలి. చదువు, సంస్కారం, క్రమశిక్షణ, సత్ప్రవర్తన వంటి సద్గుణాల కలయికే విద్య.
పిల్లలకు విద్యాబుద్ధులు పెంపొందించడంలోనూ, క్రమశిక్షణ, వ్యక్తిత్వ నిర్మాణం, అభివృద్ధి, ఆరోగ్యం కాపాడుకోవడం తదితర విషయాల్లో తల్లిపైనే నైతిక బాధ్యత ఉంది. ఈ సంగతిని వేద శాస్త్రంలో కూడా పేర్కొని ఉన్నారు. అంటే, అక్షరాభ్యాసం మొదలుకొని, సమాజంలో ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దేవరకూ తల్లిదే సంపూర్ణ బాధ్యత అన్నమాట! ఇలా తల్లి బోధనలో పెరిగినవారు ఎందరో మన చరిత్రలో నిలిచిపోయారు. శివాజీ, స్వామి వివేకానంద వంటి మహనీయులు తల్లి నేర్పిన పాఠాలను వినే తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు.
పాఠశాల ఎంపికలో జాగ్రత్తలు
ధనార్జనే ధ్యేయంగా వర్తమానంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పాఠశాలల్లో ఉత్తమ విద్యాలయాన్ని ఎంపిక చేసుకోవటం కొంచెం కష్టమే. పాఠశాలలోని ర్యాంకులను కాకుండా అక్కడి సిబ్బంది, పూర్వపు విద్యార్థుల నడవడిక, బోధనలో ఏమైన మెళకువలు ఉంటున్నాయా? పిల్లలకు నైతిక విలువలు బోధిస్తున్నారా? ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా? విద్యతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్నారా? ఇంకా మాతృభాషకు పెద్దపీట వేస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించాలి.
శిశువాటిక
శిశువులకు స్వీయ అనుభూతిని కలిగించే స్థానం శిశువాటిక. కాబట్టి దీనిని నిర్వహిస్తున్నారా? లేదా? చూసుకోవాలి. ఉదాహరణకు శిశువాటికలో- వ్యక్తి దైనందిన జీవన విధానం వివరించే చిత్రాలు, వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసే భావన చిత్రాలు ఉండాలి. ప్రకృతికి సంబంధించినవి అంటే మొక్కలు, వృక్షాలు, పూలు, పండ్లు, ప్రాణులు, పక్షులు, కీటకాలు మొదలైనవి. కొన్ని పాఠశాలల్లో పేరుకే శిశువాటిక కార్యక్రమం ఉంటుంది. కానీ, అక్కడ అన్నీ పాశ్చాత్య సంస్కృతితోనే మొదలవుతాయి. ఇవి మనకెందుకు? మనకు కావాల్సింది భారతీయత! వృద్ధులయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పడవేసే వ్యక్తిత్వం పిల్లల దగ్గరకు చేరనీయొద్దు.
అభిప్రాయాలు స్వీకరించండి
అంతేకాదండోయ్.. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగువారి అభిప్రాయాలు స్వీకరించడంలో తప్పులేదు. అయితే చివరి నిర్ణయం మాత్రం పిల్ల/పిల్లాడి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మీరే తీసుకోవాల్సి వుంటుంది. నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొత్తగా స్కూలు పెట్టేవాడు చుట్టమై ఉంటాడు. వాడి మాట కాదనలేకో మొహమాటానికో ఆ పాఠశాలకు పంపిస్తారు. తీరా విద్యాసంవత్సరం సగం అయ్యేసరికి ప్రభుత్వ అధికారులు దాడులు.. పేపర్లో ప్రకటనలు! పలానా పాఠశాలకు అసలు ప్రభుత్వ గుర్తింపే లేదని అప్పుడు తెలుస్తుంది. అప్పటికే కట్టేసిన ఫీజులు, టైం వృథాఅవుతుంది. దీంతో మానసిక వ్యథ. పండగ పర్వదినాల్లో షాపింగ్ చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అటువంటిది పిల్లలే సంపదైనప్పుడు, వారికోసమే బతుకుతున్నప్పుడు మరెంతో జాగరూకతతో మెలగాల్సిన సమయం ఇది.
ఇక.. పిల్లలకు కావాల్సిన ధన సాయాన్ని కుటుంబ యజమాని/ తండ్రి అందిస్తూ వారి బంగారు భవిష్యత్‌కు తోడ్పడుతుంటాడు. అలాగే, కుటుంబ బాగోగులు చూస్తూ ఓ పర్యవేక్షకునిగా తన బాధ్యతను నిర్వర్తించగలుగుతుంటాడు. ఈ సమయంలో ఇంటి వ్యవహారం అంతా చూడలేడు. ఇది భా రంగా మారుతుంది. ఈ దృష్ట్యా ఇల్లా లే ఇంటి క్షేమానికి కొంగు బిగించాలి. భూదేవి అంత టి భారాన్ని మో యాలి.
ఆచార్య దేవోభవ
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే ఆర్యోక్తి ఉండనే ఉన్నది. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు అంతటి స్థానం ఉన్నది. వర్తమానంలో దైవంలాంటి గురువు స్థానంలో నకిలీ గురువులు తయారైపోతున్నారు. వీరంతా అసలు గురువులుగా చెలామణి అవుతూ ఆ స్థానానికి కళంకం తెస్తున్నారు. ఈ ప్రమాదం దృష్ట్యా ఉత్తమ ఉపాధ్యాయులు ఏఏ పాఠశాలల్లో ఉన్నారో తెలుసుకోవడం బాధ్యతగా గుర్తెరగాలి. అక్షరజ్ఞానం ఉన్నా లేకపోయినా స్ర్తికి ‘మాతృమూర్తి’అనే బిరుదు శాశ్వతం. ఆమెలోగల పవిత్ర ప్రేమయే ఆమెకు సర్వదా శ్రీరామరక్ష. అందుకే ఆమె క్షమాదేవి. ఆమె దీవెన పిల్లలకు వజ్రాయుధం. ఇందుకు తండ్రి నిరంతరం తోడుగా ఉంటాడు. ఇలా ఇరువురు సమానంగా పిల్లల అభ్యున్నతికి పాటుపడితే ఆ ఇల్లు అన్నివిధాలా సౌభాగ్యవంతంగా, ఇతరులకు ఆదర్శంగా నిలిచిపోతుంది. దేశ ప్రగతికి పునాది రాయి అవుతుంది.

‘పది మంది’ ఉపాధ్యాయులు ఒక వంశాచార్యునికి సమానం. పది మంది వంశాచార్యులు ఒక తండ్రికి సమానం. అటువంటి నూరుగురు పితాచార్యులు ఒక మాతృమూర్తికి సమానం.

‘అక్షరం’ అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి, వెలుగు అనే జ్ఞానాన్ని ప్రసాదించేది. బ్రహ్మ స్వరూపం కూడా. అక్షరాభ్యాసం అనేది భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ఒక భాగం. ఫిబ్రవరి ఒకటో తేదీన శ్రీపంచమి. మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమిగా వ్యవహరిస్తారు. ఈరోజున విద్యాధి దేవతైన శ్రీ సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ విశిష్ట పర్వదినంలో అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారుల్లో గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ధారణశక్తి, మేధాశక్తి పెంపొంది, విద్యావంతులుగా తయారవుతారు.

-కల్యాణి