మెయిన్ ఫీచర్

ఆడవారికి అండ ప్యాడ్‌మాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడపిల్లకు నీడలా వెంటాడే నెలసరి బాధ. ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపాలనుకున్నాడు అరుణాచలం మురుగునాథ్. ఇందుకోసం ఇరవై ఏళ్ల నుంచి అరుపెరగకుండా శ్రమిస్తున్నాడు. అవసరమైతే ఎద్దుల బండిలో ప్రయాణిస్తాడు. గాడిదలు, ఎద్దులు మీద సైతం వెళతాడు. తాను చేరాలనుకున్న మారుమూల గ్రామానికి వెళ్లటానికి ఇలాంటి కష్టాన్ని ఎంతైనా భరిస్తాడు. మనసులో దృఢంగా నాటుకున్న అతని ప్రయత్నం గ్రామీణ మహిళ హితం. అందుకే నేడు అతని ప్రయత్నానికి ఎదురైన ఆటంకాలన్నీ చెల్లాచెదురయ్యాయి. విజయతీరానికి చేర్చాయి. అతని ప్రయత్నం ఇపుడు పది లక్షల మంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించింది. ఆడపిల్లలకు ఎదురయ్యే ఈ సమస్యకు ఆరోగ్యకరమైన పరిష్కారం చూపుతూ వారి చేత ‘మురుగా’ ‘ప్యాడ్‌మెన్’ అని నోరారా ఆప్యాయంగా పిలిపించుకునే అరుణాచలం వారికి మనసున్న వెన్నలాంటి అన్న. అందుకే అనేక రాష్ట్రాల్లో విస్తరిస్తున్న అతని సేవకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని సైతం ఇచ్చి వెన్నుతట్టింది.
మనదేశం అభివృద్ధిచెందలేదంటే అరుణాచలం మరుగునాథం ఒప్పుకోడు. ముంబయి, కోల్‌కతా, ఢిల్లీలో ఎక్కడ చూసినా ఆరంచెల రోడ్లు విస్తరించాయి. కాని గ్రామాల్లో మాత్రం సరైన రోడ్లు లేవు. మెయిన్‌రోడ్డుకు చేరాలంటే రెండుగంటలు ప్రయాణించాల్సిందే. ఇలాంటి గ్రామాల్లో నివశించే ఎంతో మంది తల్లులు నెలసరి వల్ల సోకే ఇన్‌ఫెక్షన్లతో అనారోగ్యం పాలవుతున్నారు. వేలాది మంది క్యాన్సర్ వంటి భయంకరమైన ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించేవారు కరువయ్యారు. అందుకే తక్కువ ఖర్చుతో నాపికిన్స్ తయారుచేసుకుని మెషిన్‌ను కనిపెట్టి దానిని గ్రామీణ మహిళలకు అందించటమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. లాభాల కోసం ఈ మెషిన్‌ను అందిస్తే అందరి వలే ఇతను కూడా వ్యాపారవేత్తగా మారేవాడు. కాని మురుగునాథం సామాజిక వ్యాపారవేత్త. చదువురాని మహిళ లేదా కొంతమంది మహిళలు గ్రూపుగా ఏర్పాటై ఈ మెషిన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్యాడ్స్ తయారుచేసి తక్కువ ధరకు అమ్ముకోవచ్చు.
దేశవ్యాప్తంగా 4,500 మెషిన్లు ఏర్పాటు
మురుగునాథం ఆర్గనైజేషన్ కింద దాదాపు 4,500 శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే సంస్థలు పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఈ మెషిన్ కావాలని చిన్న మెస్సెజ్ పెడితే చాలు ఎంతదూరమైనా.. రహదారి సౌకర్యం లేకపోయినా పంపిస్తాడు. తొలుత మురుగునాథం ఈ మెషిన్‌ను మహిళలు వెనుకబడిన బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ మహిళలు అందించాడు. ఇలా మహిళలకు తక్కువ ధరకు ఈ మెషిన్‌ను అందించటం వల్ల ప్యాడ్స్‌ను తయారుచేసుకుని ఆయా ప్రాంతాల్లో మహిళలు ఒకరికొకరు బంగాళాదుంపలు, టామాటాలు ఇచ్చుకున్నట్లు ఈ ప్యాడ్స్‌ను కేవలం రూ.1.50 నుంచి రూ.2.50 పైసలకే అందజేస్తున్నారు. ఈ ప్యాడ్స్ తయారీలో ఎలాంటి కెమికల్స్ ఉపయోగించరు. వీటిని ఉపయోగించటం వల్ల మహిళలకు ఎలాంటి మూత్ర సంబంధమైన మొండి వ్యాధులు సైతం రావు. ఫలితంగా గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడరు. ఈ ప్యాడ్స్‌కు ఎలాంటి బ్రాండ్ లేదు. అలాగే ఎలాంటి పేరున్న సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడార్‌గా పెట్టుకుని వాణిజ్య ప్రకటనలు ఉండవు. మహిళలు తాము తయారుచేసుకున్న ప్యాడ్స్‌కు తామే పేర్లు పెట్టుకుంటారు. వారు పెట్టుకునే పేర్లు ‘సురక్ష, సఖి’ వంటి పేర్లు పెట్టుకుని అందజేస్తుంటారు. ఇప్పటి వరకు పది లక్షల మంది మహిళలకు చేరువైన ఈ నాపికిన్స్ తయారీ మెషిన్ భవిష్యత్తులో వందశాతం శానిటరీ నాపికిన్స్ ఉపయోగించే గ్రామీణ ప్రాంతాలను తయారుచేయటమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది.
అదే గొప్ప బహుమతి
ఇరవై ఏళ్లుగా అతివలు, ఆడపిల్లల ఆరోగ్యం కోసం అలుపెరుగకుండా కృషిచేస్తున్న అరుణాచలానికి ఓ గ్రామీణ ప్రాంతంలో సంభవించిన చైతన్యం తనకు గొప్ప బహుమతి అని చెబుతాడు. ఉత్తరాఖండ్‌లోని గుజ్జార్ కమ్యూనిటీ నివశించే ఓ కొండ ప్రాంతానికి ఎన్నో వ్యయప్రయాసలకు గురై మెషిన్‌ను తీసుకువెళ్లాడు. అక్కడ ఏ ఆడపిల్ల కూడా అసలు స్కూలుకే వెళ్లదు. అలాంటి ప్రాంతానికి వెళ్లి ఈ నాపికిన్స్ గురించి వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చాడు. వారు ఈ మెషిన్‌ను ఏర్పాటుచేసుకుని ప్యాడ్స్ ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ గ్రామ చైతన్యం తనకు జీవితంలో లభించిన గొప్ప బహుమతి అని చెబుతాడు అరుణాచలం మురుగునాథం.