మెయిన్ ఫీచర్

దేవుడిచ్చిన అమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటినిండా కార్లు..
తండ్రి పెద్ద ఉద్యోగి..
డబ్బుకు కొదువలేదు..
కానీ... స్కూలుకు నడిచేవెళ్లాలి..
నాన్న చేసిన అలవాటది..
తనకూ అదే ఇష్టం...
అది చిన్నప్పటి మాట..
అంత పద్ధతిగా పెరిగిన శుక్లాబోస్ పెద్దయ్యాక ఊరికే ఉంటారా?
చిన్నప్పుడే మొదలైన పరివర్తన...‘పరిక్రమ’కు దారితీసింది..
తనలా ఉన్నతవిద్యను మురికివాడల పిల్లలకూ అందించాలన్న తపన ఆమెను మానవతామూర్తిగా మార్చేసింది. ఎంతలా అంటే దాదాపు 1300 పేదల పిల్లలకు ఇప్పుడు ఆమె తల్లి, గరువులా అన్నమాట. అదెలా జరిగిందో చూద్దాం.
***
బెంగళూరు జయనగర్‌లో ఉన్న ‘పరిక్రమ ఫౌండేషన్’లోనికి అడుగుపెడితే అక్కడ తరగతి గదుల్లో పిల్లలు చాలా బిజీగా కనిపిస్తారు. సైన్స్ పాఠాలు వల్లెవేస్తూ.. లెక్కల చిక్కులు విప్పుతుంటారు. కొందరు సంగీతం, నృత్యం

నేర్చుకుంటూ కనిపిస్తారు. అక్కడ ఏ చిన్నారిని చూసిన ఏదో ఒక పనిలో హడావిడిగానే ఉంటారు. వీరంతా మురికివాడల నుంచి వచ్చిన పేదల పిల్లలు. అక్కడున్న వీరికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్య పరీక్షలు అందించే సదుపాయం ఉంది. అమ్మానాన్న చెంత లేరనే బెంగ ఆ చిన్నారుల్లో ఏ కోశానా ఉండదు. మమతానురాగాలను అందించే చల్లని నేస్తం తమ చెంత ఉందని ఆ చిన్నారులు భావిస్తారు. ఆ నేస్తమే శుక్లాబోస్. ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు.
మానవతామూర్తి శుక్లాబోస్
పేద పిల్లలకు నాణ్యమైన చదువులు చెప్పిస్తున్న మానవతామూర్తి శుక్లాబోస్. విలువలు పాటించే ఓ పెద్ద ప్రభుత్వ ఉద్యోగికి పుట్టిన గారాలపట్టి. ఇంటి పోర్టికోలోప్రభుత్వం ఇచ్చిన పెద్దకార్లు ఆరున్నా వాటిని శుక్లాబోస్ తండ్రి ఆఫీసు పనులకే ఉపయోగించేవాడు. ఆ కార్లలో ఏనాడూ తన బిడ్డను స్కూలు పంపలేదు. ఆరు కిలోమీటర్లు దూరమైనా శుక్లాబోస్ నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేది. అలా తండ్రి నుంచి అబ్బిన మానవతా విలువలు ఆమెను ఓ మానవతామూర్తిగా తీర్చిదిద్దాయి. దీనికితోడు సేవా మూర్తి మదర్‌థెరిస్సాతో పనిచేయటం, ఆమె అందించిన ప్రేరణ శుక్లాబోస్‌ను సేవామార్గంలోకి నడిపించింది. మురికివాడల పిల్లలకు తల్లిగా మార్చివేసింది. ఓరోజు మదర్ థెరిస్సాను కలిసే అవకాశం శుక్లాబోస్‌కు వచ్చింది. ఆమెను కలిసినపుడు ఆ మాతృమూర్తి పలికిన మాటలు ఆమెను ఆలోచింపజేశాయి. ‘‘మూసి ఉంచిన గది కిటికీ తలుపులను ఎల్లప్పు డూ తెరిచి ఉంచు. ఎప్పుడైనా అవకాశం రావచ్చు’’ అని చెప్పిన మదర్ మాటలు నిజం చేస్తూ శుక్లాబోస్ 17 ఏళ్లకే పీజీ పూర్తిచేసి యుక్త వయసు నుంచే ఎన్నో సేవాసంస్థల్లో పనిచేసింది. ప్రాథమిక హక్కుగా పరిఢవిల్లుతున్న కనీస విద్య మురికివాడల్లోని పిల్లలకు ఎందుకు అందివ్వకూడదు అని భావించింది. వివిధ సేవా సంస్థల్లో సంపాదించిన అనుభవంతో ‘పరిక్రమ హ్యుమనిటీ ఫౌండేషన్’ను స్థాపించింది. అప్పటికీ ఆమె వయసు 26 సంవత్సరాలు. కాళ్లదాకా వచ్చిన కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదని తన సర్వస్వాన్ని ఆ నిరుపేదల పిల్లల కోసం ధారపోసిన ఆదర్శవంతురాలు. విలాసవంతమైన జీవితాన్ని వదలి మురికివాడల్లోకి మారిపోవడమేమిటని ఎగతాళి చేసి నా పట్టించుకోలేదు. కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కుమార్తె ఆమె సేవానిరతిని కాదనలేదు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఎవరేమి అనుకుంటే తనకేమిటి అనుకుంది. మురికివాడల పిల్లలకు మమతానురాగాలు పంచిపెడుతోంది.
చిన్న స్కూలుతో ఆరంభం...
బెంగళూరులోని రాజేంద్రనగర్‌లో ఓ చిన్న స్కూలుతో తన ఫౌండేషన్ సేవల ను ఆరంభించింది. అపుడు ఆ స్కూ లులో 165మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఆ స్కూలును నడపటానికి తన సొంత ఆస్తిని ఆమ్మేసింది. చాలా డబ్బు ఖర్చుచేసింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా తన ఆశయం నుంచి పక్కకు మళ్లలేదు. గతంలో వివిధ సేవాసంస్థల్లో పనిచేసిన అనుభవం ఈ ఫౌండేషన్ నడపటానికి వ్యూహాలుగా మలుచుకుంది. ఎంతో శ్రమకోర్చి ఈ ఫౌండేషన్‌ను నేడు 1300 మంది పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించే స్థాయికి చేర్చగలిగింది. ప్రస్తుతం జయానగర్, సహకారనగర్, కోరమంగళ, నందిని లేఅవుట్ ప్రాం తాల్లో ఈ ఫౌండేషన్ తరపున స్కూళ్లను ఏర్పాటు చేసి సేవలందిస్తోంది. కిండర్‌గార్డెన్ నుంచి 12 స్టాండర్డ్ వరకు విద్యనందిస్తారు. ఆ తరువాత ఇక్కడ చదువు ముగిసిన తరువాత స్కాలర్‌షిప్పులు అందిస్తూ ఉన్నత చదువులు చదివేందుకు సాయం చేస్తోంది. వారికి ఉద్యోగాల్లో స్థిరపడేవరకు ఫౌండేషన్ వెన్నంటే ఉంటుంది.
శుక్లాబోస్ నిస్వార్థ సేవానిరతిని గుర్తించిన ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ పరిక్రమ ఫౌండేషన్ కార్యక్రమాలకు తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఐఐఎం బెంగళూరువారు ఈ ఫౌండేషన్ సేవలపై ఒక పాఠ్యాంశంగా చేర్చాయంటే ఆ సంస్థ గొప్పదనమేమిటో తెలుస్తుంది.