మెయిన్ ఫీచర్

వేస‘వినోదం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో భానుడి కిరణాలను ముద్దాడాలనుకుంటున్నారా? ఆకాశాన్నంటే ఎత్తయిన దేవదారు వృక్షాల మధ్య..కొండాకోనల్లో జలజలపారే సెలయేళ్ల సవ్వడి వింటూ..పచ్చని లోయలు.. యాపిల్ తోటల మధ్య వేసవి వినోదాన్ని సొంతం చేసుకోవాలంటే
చల్ల చల్లని కాశ్మీర్‌ను చుట్టేయటానికి సిద్ధమవ్వండి.

ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్
20 లక్షల పూలు ఒక్కచోట విరబూసిన ప్రాంతంలోకి అడుగుపెడితే ఏమనిపిస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టామనే భ్రాంతి కలుగుతుంది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సుకు సమీపంలో ఉండే ఈ ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌లో అటువంటి భ్రాంతే కలుగుతుంది. దాదాపు 46 రకాల తులిప్ పూలు పసుపు, ఎరుపు, ఊదా, ఆరంజ్ రంగుల్లో కనువిందుచేస్తుంటాయి. పర్యాటకుల కోసం ఈ గార్డెన్‌ను ఇటీవలనే తెరిచారు. మొగల్ మహారాజులు ఈ అందాల పూలను కాశ్మీర్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఈ పూలకు సంబంధించిన ఉత్సవం 15 రోజుల పాటు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. 30 హెక్టార్లలో విస్తరించిన తులిప్ ఉద్యానవనాన్ని వీక్షించటానికి రెండు కళ్లు చాలవు. గత ఏడాది 1.75 లక్షల మంది పర్యాటకులు ఈ తులిప్ గార్డెన్‌ను సందర్శించారు. దాదాపు 58 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సారి మూడు లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనావేస్తున్నారు. ఇటీవలనే ఇక్కడ వర్షాలు కురిసినప్పటికీ వాతావరణం ఆహ్లాదంగానే ఉన్నట్లు ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. ఈ తులిప్ పర్యాటకులను తన్మయులను చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
దాల్‌లో షికారు..మధురానుభూతి
చలికాలంలో గడ్డకట్టుకుపోయే ఈ సరస్సు వేసవికాలంలో నిర్మలమైన నీటి తో స్వాగతం పలుకుతుంది. చు ట్టూ ఎత్తయిన పర్వతాల మధ్య స్వచ్ఛం గా, నిశ్చలంగా ఉం డే సరస్సులో షికా రు చేయాలంటే గం టకు రూ.400 లు చెల్లించాలి. ఇక్కడ బోటు నడిపే కార్మికునికి ఈ వేసవి కాలంలో ఎంతలేదన్నా రోజుకు రెండు వేల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ సరస్సులో లిల్లీ పూలు, కలువ పూలు నిండి ఉంటాయి. సరస్సు మధ్యలో చిన్న ద్వీపం కూడా ఉంది. దాల్ సరస్సుతో పాటు శ్రీనగర్‌కు 28 కిలోమీటర్ల దూరంలో మానసబాల్ అనే సరస్సు కూడా చూడవచ్చు. ఈ శ్రీనగర్‌లోనే ఆదిశంకరుల దేవాలయం, జామా మసీదులు ఉన్నాయి.
ట్రెక్కింగ్ ప్రియులకు అడ్డా
కాశ్మీర్ అనేగానే ట్రెక్కింగ్ ప్రియులకు అడ్డా. శ్రీనగర్‌కు 89 కిలోమీటర్ల దూరంలో ఉండే పిర్ పంజాల్, 434 కిలోమీటర్ల దూరంలో ఉండే లెహ్ లఢక్‌లో ట్రెక్కింగ్ ప్రియులకు కావల్సినంత కాలక్షేపం దొరుకుతుంది. అంతేకాదు రాక్ క్లైంబింగ్, వౌంటేన్ బైకింగ్ కూడా ఇక్కడ చేయవచ్చు. ముఖ్యంగా లెహ్ లఢక్ చుట్టూ ఎత్తయిన పర్వశ్రేణులు కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలోనే ప్రశాంత చిత్తాన్ని కలిగించే ఎన్నో బౌద్ధారామాలు, బౌద్ధమఠాలు కూడా ఉన్నాయి. రాజోరి అనే ట్రెక్కింగ్ కేంద్రం కూడా ఉంది. అలాగే శ్రీనగర్‌కు 52 కిలోమీటర్ల దూరంలో ఉండే గుల్‌మార్గ్ కూడా ట్రెక్కింగ్, వౌంటేన్ బైకింగ్‌కు చేయవచ్చు. గుల్‌మార్గ్‌లోనూ సరస్సులకు కొదవలేదు.
చారిత్రక ఆనవాళ్లు అనేకం..
కాశ్మీర్‌లో ఈనాటికీ చారిత్రక ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి. ఇక్కడ నెలకొన్న ఆలయాలు ఆధ్యాత్మికంగా పర్యాటకులను జాగృతం చేస్తుంటాయి. ముఖ్యంగా జమ్మూ ఎయిర్‌పోర్టుకు 75 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉదంపూర్‌లో ఎత్తయిన గిరులు..దేవదారు వృక్షాలు దర్శనిమిస్తాయి. ఈ ప్రాంతం నాలుగు నదుల మధ్య ఉంది. ముఖ్యంగా ఇక్కడ భూగర్భంలో దేవిక అనే నది ప్రవహిస్తుంటుంది. రాజా ఉదంసింగ్ పేరిట వెలసిన ఈ నగరంలోని కోటపై చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ప్రసిద్ధిచెందిన శ్రీమాత వైష్ణవి దేవాలయం త్రికుట పర్వతశ్రేణుల్లో దాదాపు 5,300 కిలోమీటర్ల ఎత్తులో నెలకొంది.
కుంకుమ పూలతోటలు
కాశ్మీర్‌లోని పుల్వామాలో కుంకుమ పూలతోటలు దర్శనమిస్తాయి. శ్రీనగర్‌కు దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో ఏటవాలుగా పరుచుకున్న కొండలపై కుంకుమ పూలతోటలు దర్శనమిస్తాయి.
ప్రకృతికి ఆలవాలమైన ప్రదేశాలెన్నో..
పచ్చటి ప్రకృతి పరుచుకున్న ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో నోన్‌మార్గ్ ఒకటి. ఇక్కడ కూడా విశాలమైన పూదోటలు కనిపిస్తుంటాయి. దీన్ని అమర్‌నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్‌గా పేర్కొంటారు. పహల్గామ్, దోడా వంటి పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. చారిత్రక ప్రదేశంగా పేరొందిన రాజౌరీలో కూడా ఎన్నో విశేషాలు కనిపిస్తుంటాయి.
పర్యాటకులను పెంచుకునే వ్యూహాలు
శ్రీనగర్‌కు ఆనుకుని చూడదగ్గ ప్రదేశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడే పర్యాటకులు ఎక్కువగా విడిది చేస్తుంటారు. దాదాపు ప్రతిఏటా 35,000 మంది బస చేస్తున్నట్లు అధికారుల అంచనా. వేసవిలోనే రాష్ట్ర పర్యాట శాఖకు అత్యధిక ఆదాయం సమకూరుతుంది. గత ఏడాది 55శాతం ఆదాయం పర్యాటక శాఖ ద్వారా సమకూరింది. ఈఏడాది ఈ ఆదాయాన్ని 80శాతానికి పెంచుకోవాలని అధికారులు సమాయత్తమయ్యారు. దేశవ్యాప్తంగా ముంబయి, చెన్నై, రాజ్‌పూర్ రోచి, లక్నో వంటి రోడ్‌షోలు సైతం నిర్వహించారు. ఎక్కువగా మలేసియా నుంచి పర్యాటకులు వస్తుంటారు. అలాగే 30-40శాతం మంది విదేశీ పర్యాటకులు ఉంటారు.
విడిది ప్రాంతాలు..
కాశ్మీర్‌లో హోంస్టే విడిది ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపు 600 ఇళ్లు పర్యాటకుల కోసమే రాష్టవ్య్రాప్తంగా ఉన్నాయి. చాలామంది తమ ఇళ్లను బస చేసుకోవటానికి ఇస్తుంటారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో హోంస్టేయింగ్‌నే సురక్షితంగా పర్యాటకులు భావిస్తుంటారు.
*

ఆశ్యర్యపోయాను..
ఓ రోజు ఉదయ మే ఇంటి నుంచి బయటకు వచ్చాను. రోడ్డు మీద ఎన్నో కార్లు పార్క్ చేసి ఉన్నాయి. చాలామంది పర్యాటకులు ఆ కార్లలోనే నిద్రపోతున్నారు. అంతేకాదు పేవ్‌మెంట్స్ మీద సైతం పర్యాటకులు నిద్రిస్తున్నారు. ఆ దృశ్యా న్ని చూసి ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచి నాకు న్న ఆరు గదుల ఇం టిని విడిది కేంద్రంగా మార్చేశాను. ఒక్క గదిలో మా కుటుంబ సభ్యులంతా ఉంటారు. మిగిలిన నాలుగు గదులు పర్యాటకులు బస చేయటానికి ఇచ్చేస్తాం. వేసవిలోనే ఎక్కువగా ఆదాయం వస్తుందని అంటాడు గులామ్ మహ్మద్. శ్రీనగర్ సిటీకి సమీపంలో ఉండే కోహన్‌కహన్ ప్రాంతంలో గు లామ్ మహ్మద్ ఉంటాడు. ఇక్కడే రోడ్డు పక్కనే ఎన్నో రెస్టారెంట్లు ఉన్నా యి. కాబట్టి వసతితో పాటు ఆహారానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
*
చిన్ననాటి కల నెరవేరింది..
జీవితంలో ఒక్కసారైనా కాశ్మీర్‌ను సందర్శించాలని కలలుకనేదాన్ని. అది ఈనాటికీ నెరవేరింది. తొలుత కొద్దిగా భయపడ్డాను. మిలిటెంట్ల దాడులు గురించి వింటున్నాం. కాని ఇక్కడకు వచ్చిన తరువాత ఆ భయం లేదు. శ్రీనగర్ చాలా అందమైన ప్రాంతం. పూలవనాలతో మనసంతా ఆనందంతో నిండిపోయిందని మీటాశర్మ అంటున్నారు. పాట్నా నుంచి వచ్చిన ఈమె వెంట తల్లి, కుమార్తె ఉన్నారు.