మెయిన్ ఫీచర్

బహుదూరపు బాటసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతని జేబులో ఒక్క రూపాయి లేదు. అయినా దేశాన్ని చుట్టిరావాలనే సంకల్పం గుండెనిండా ఉంది. ఉప్పొంగే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలనుకున్నాడు. సమాజంలో విభిన్న ప్రాంతాలను, సంస్కృతులను చూసి రావాలనుకున్నాడు. ఆ అనుభవాలతో జీవితాన్ని, నడత ఉత్తమంగా ఉండేలా నేర్చుకోవాలని బయలుదేరాడు. అతడే ఢిల్లీకి చెందిన రవీందర్ సింగ్. 29 ఏళ్ల ఈ లాయర్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఈ వయసులో కొందరికి షాపింగ్ చేయాలని, వ్యాయామం చేయాలని ముచ్చటపడతారు. కాని రవీందర్ సింగ్‌కి దేశంలోని ఇష్టమైన ప్రదేశాలను చుట్టి రావడం అంటే ఇష్టం. ఇందులో లభించే సంతోషం మరెందులోనూ దొరకదని అనుకున్నాడు. ఈ అభిలాష అతనికి చిన్నప్పటి నుంచి ఉండేది. జేబులో డబ్బు లేకుండా దేశాన్ని చుట్టి రావటం అసాధ్యం. మనసులో సంకల్పం ఉంటే సాధ్యంకానిదంటూ ఏదీ లేదని నిశ్చయించుకుని సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. నడుచుకుంటూనే దేశాన్ని చుట్టి రావాలని భావించాడు. కొత్త ప్రదేశాలకు వెళ్లి సరికొత్త అనుభూతులను మూటగట్టుకోవాలనే కోరికతో పంజాబ్ నుంచి తన ఒంటరి ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. దేశమంతా తిరిగి చివరకు పంజాబ్‌లోనే తన నడకను ముగుస్తానని శపథం బూనాడు. ఇప్పటివరకు అలా 550 రోజుల్లో 5వేల కిలోమీటర్ల దూరం నడిచి ఔరా అనిపించాడు.

నడక అంటే ఎందుకు ఇష్టం?
చిన్నప్పటి నుంచి నడక అంటే రవీందర్‌కు ఇష్టం. తండ్రి లేడు. ఏ పనికోసమైనా తల్లి ఎంతదూరమైనా నడచివెళ్లడం గమనించాడు. జోరున వర్షం కురుస్తున్నా అతని తల్లి ఆమె నడిచే వెళ్లేది. ఇదే అలవాటు అతనికీ వచ్చింది. ఒక్క ఏడాదిలో దేశంమంతా నడుచుకుంటూ పర్యటించాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇందుకోసం కొంత మంది స్నేహితులు సాయపడ్డారు. తల్లి మాత్రం ఒకింత బాధపడింది. ఆడపిల్లయితే బాగుండేది పెళ్లి చేసి పంపేసేదాన్ని అని అనుకున్నది. కాని అతని నిర్ణయానికి ఎదురు చెప్పలేదు. స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ మహాత్ముడు నిర్వహించిన దండి యాత్రను స్ఫూర్తిగా చేసుకుని తన యాత్రకు శ్రీకారం చుట్టాడు.
మధుర జ్ఞాపకాలు
తొలిరోజు ప్రయాణాన్ని దండి మార్చ్ జరిగిన ప్రాంతం నుంచి ఆరంభించాలని భావించి సబర్మతి ఆశ్రమానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ చారిత్రాత్మక గ్రామానికి చేరుకున్నాడు. నడవటం వల్ల కలిగిన అలసటతో పాటు కాళ్లు బొబ్బలెక్కి రవీందర్ సింగ్ ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో అతని భుజం మీద ఓ చేయి పడింది. అతని గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి నీకు ఆ గ్రామ సర్పంచ్ సాయం చేస్తాడని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టాడు. ఆ రోజు ఉండటానికి వసతి చూపించాడు. కాళ్లకు రాసుకోవటానికి మందు ఇచ్చాడు. ఇలాంటి మనసున్న వ్యక్తులెందరో అతని ప్రయాణంలో తారసపడి సాయం అందిస్తున్నారు. అలాంటి వారిని ఆ భగవంతుడే తారసపడేలా చేస్తాడనే అతని నమ్మకం. ఆ నమ్మకం, విశ్వాసంతోనే రవీందర్ సింగ్ తన విజ్ఞాన యాత్రకు సంకల్పించాడు.
తల్లి అడ్డుచెప్పలేదు..
ఈ వయస్సులో ఏ యువకుడైన సౌకర్యవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతాడు. కాని రవీందర్ సింగ్ ఎంచుకున్న మార్గానికి అతని తల్లి అడ్డుచెప్పలేకపోయింది. ఎందుకంటే తాను గనుక ఈ యాత్రను ఆపితే కొడుకు సంతోషంగా ఉండలేడని గ్రహించి అంగీకరించింది. ఆడపిల్ల అయితే బాగుండేది అని కూడా బావించిందని, సహజంగా ఈ హింసాత్మక ప్రపంచంలో ప్రతి తల్లి ఇలా భయపడటం సహజమని రవీందర్ అంటాడు. రేపు అన్నం ఎలా దొరుకుతుంది.
ఎక్కడ నిద్ర పోవాలి అనే బాధ, భయం లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతూ అద్భుతమైన జీవిత పాఠాలను మూటగట్టుకుంటున్నాడు రవీందర్ సింగ్. పంజాబ్ నుంచి ఆరంభమైన ఈ యాత్ర పంజాబ్‌లోనే ముగించాలని ఆశయంతో ఉన్నాడు. తన తదుపరి నడక యాత్ర నేపాల్ నుంచి భూటాన్ వరకు చేయాలనే సంకల్పంతో ఉన్నాడు.
*

చిత్రాలు..ఉత్తరాఖండ్‌లో ప్రయాణిస్తున్న రవీందర్ సింగ్
* రాజస్థాన్‌లోని ఓ కోటను సందర్శించిన రవీందర్ సింగ్