మెయిన్ ఫీచర్

క్యాన్సర్‌పై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నికితాశర్మ రెండు పదులుదాటిన యువతి. ఆకట్టుకునే అందమైన రూపం. సహజంగా ఈ వయసులో ఉండే అమ్మాయిలు స్నేహితులతో సినిమాలు, షికార్లు అని తిరుగుతారు. ఈ మిస్ ఇండియా బ్యూటీ కూడా గడుసు అమ్మాయే. తనలోని చలాకీని తోటివారికి చేతనైన సాయం అందించాలనే మంచి మనసు ఉన్న గడసరి. అందుకే ‘సిల్వర్ లైనింగ్స్’ అనే అసోసియేషన్‌ను ఏర్పాటుచేసి క్యాన్సర్‌పై చైతన్యం తీసుకువచ్చేందుకు నడుం బిగించింది. ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ మహమ్మారి నిర్మూలనకు తాను చేసేది చిరు ప్రయత్నం అని చెబుతోంది.
ఎంతోమందిని కోల్పోయాను..
నికితాశర్మ హైస్కూల్‌లో చదువుకునేటపుడు క్యాన్సర్ బారిన పడిన ఎంతోమంది తెలిసినవారిని కోల్పోయింది. చనిపోయినవారి తాలుకా జ్ఞాపకాల నుంచి తేరుకోవటానికి చాలా కష్టపడింది. అందుకే దీనిపై ఏదైనా చేయాలని పదహారేళ్ల వయసులోనే నిశ్చయించుకుంది. ఆమె తీసుకున్న చిరు చొరవే ఎందరో మనసులు దోచుకుని నేడు అవార్డులను సైతం సొంతం చేసుకునే పెద్దస్థాయికి ఎదిగింది. ఇటీవలనే ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కాన్‌క్లేవ్ (ఐడబ్ల్యూఇసి) ప్రదానం చేసే ‘యంగ్ ఉమెన్ అచీవర్స్’ అవార్డు సొంతం చేసుకుంది.
మిస్ ఇండియా పోటీల్లో..
బెంగళూరులో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో నికితాశర్మ పాల్గొన్నది. ఫైనల్ వరకు వెళ్లిన ఈమె ఫిట్‌నెస్ పాఠాలు వల్లివేస్తుంది. జిమ్‌లో చేసే కసరత్తుల వల్ల రెండేళ్లలోనే దాదాపు 30 కిలోలు బరువు తగ్గిపోయి ఆశ్చర్యపరచింది. మోడలింగ్ అంటే ఎంతో ఇష్టం. ర్యాంప్ మీద నడవాలని తహతహలాడుతోంది. రోటిన్ జీవితం నుంచి బయటపడాలంటే ఇలాంటి వ్యాపకాలు ఉండటం మంచిదంటుంది.
క్యాన్సర్‌పై చైతన్య కార్యక్రమాలు
క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మైక్రోబయోలజీ చదువుతున్న ఈ యువతి దీనిపై పరిశోధనలు చేస్తానని చెబుతోంది. అసోసియేషన్ తరపున శిబిరాలు నిర్వహిస్తూ.. వలంటీర్లను సమీకరించి వర్క్‌షాపులు, సదస్సులు నిర్వహిస్తోంది. అంతేకాదు క్యాన్సర్ బాధితులు వద్దకు వెళ్లి వారికి మానసిక స్థయిర్యాన్ని కలిగించేందుకు కృషి చేస్తుంది. సోషల్‌మీడియాలో నికితాశర్మ క్యాన్సర్‌పై ఉన్న తన ఆలోచనలను పంచుకుంటుంది. దీనికి స్పందన కూడా బాగానే ఉంది. రాబోయే కాలంలో ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటుచేసి తన సేవా ప్రవృత్తిని విస్తత్రం చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
*
ఎంగ్ ఉమెన్ అచీవర్స్ అవార్డు వచ్చినందుకు సంతోషంతో పాటు ఉత్తేజాన్ని ఇచ్చింది. గ్లామర్, ఫ్యాషన్ రంగాల్లో ప్రవేశించాను. సినిమా రంగంలోకి కూడా అడుగుపెడతాను. మైక్రోబయోలజీ విద్యార్థిని కాబట్టి క్యాన్సర్‌పై పరిశోధన చేస్తు వారికి మరింత సేవ చేసే కార్యక్రమాలను విస్తత్రం చేస్తాను.
-నికితాశర్మ