మెయిన్ ఫీచర్

చెత్త తిండి.. అదే ఇష్టమండీ!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మార్గదర్శకాలు జారీచేసినా ఫలితం శూన్యం
* ఏటా 20 శాతం పెరుగుతున్న అమ్మకాలు
* రూ. లక్ష కోట్ల బిజినెస్

నమ్మలేని నిజాలు..

జంక్‌ఫుడ్ ఎక్కువగా తినేవారిలో మెదడులోని రసాయనాలు మార్పు చెందుతాయి. దాంతో డిప్రెషన్, ఆతురత సంబంధ లక్షణాలకు దారితీస్తుంది.
ఇవి శరీరానికి హాని చేసి, కడుపులో అల్సర్లు కలుగచేస్తాయి. జంక్‌ఫుడ్ తినే పిల్లల్లో చిన్నప్పుడు వారికిచ్చిన వాక్సిన్ పవర్ తగ్గి వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. యుక్తవయసు వచ్చేసరికి కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
మత్తు మాదకద్రవ్యాలు, సిగరెట్లు, పాన్‌పరాగ్‌లు ఆరోగ్యాన్ని కుళ్లబొడిచినట్టే జంక్‌ఫుడ్ కూడా హెల్త్‌ని దెబ్బతీస్తుంది. షుగర్, గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు అది కారణమవుతుంది.
ఫాస్ట్ ఫుడ్ కారణంగా తలెత్తే ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయించుకోడానికి భారతదేశ జాతీయాదాయంలో ఏటా దాదాపు రెండువేల కోట్లకుపైగా నష్టపోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్త అంచనా వేసింది.
జంక్ ప్రభావంతో నిద్రలేమి, గర్భస్రావం, పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. వాటితోపాటే క్యాన్సర్, మొదలైన రోగాల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనం తాగే శీతల పానీయాలలో కెఫిన్, పాస్ఫరిటిక్ ఆసిడ్ మొదలైన రసాయనాలు అధిక మోతాదులో వుంటాయి.
మంచినీళ్ల ప్రాయంగా శీతల పానీయాలు తీసుకుంటే ప్రమాదం అంటున్నారు. ఎక్కువ నిల్వవున్న పచ్చళ్లు తీసుకుంటే ఇటు చిన్నపిల్లలకు, గర్భిణీలకు చాలా ప్రమాదం.

భారతీయుల్లో 90 శాతం మందికి జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసు... కానీ.. అవి తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. హెల్త్ఫీడ్ వండుకోవడానికి బద్దకించినవాళ్లకు జంక్‌ఫుడ్ నిత్యావసరంగా మారిందని.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. పాత రోజుల్లో కేవలం ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే ఆరగించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తి విరుద్ధం. బిజీ లైఫ్‌లో నిద్రాహారాలకు మనిషి అవసరమైన సమయం కేటాయించడంలేదు. ఇంగ్లీషులో జంక్ అంటే చెత్త లేదా పనికిరాని కుప్ప అని అర్థం. రోడ్లమీద, మురికికాల్వల పక్కన, బాగా మరగకాచిన నూనెతో వండిన పదార్థాలను తిని రోగాల బారిన పడుతున్నారు. స్నాక్స్ పేరుతో నూడిల్స్, పానీపూరి, బేకరీ ఐటమ్స్ ఆరగించే సమయంలో నోటికి ఎంతో రుచికరంగా వున్నప్పటికీ.. ఒబెసిటీ, దీర్ఘకాలిక వ్యాధులొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఈ తరహా ఫుడ్స్ ఆరగించడంవల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గడానికి, అధిక బరువు పెరగడానికి, పెద్దల్లో పొట్ట సైజు పెరగడానికి ప్రధాన కారణం.
జంక్ ఫుడ్, శరీరానికి కావలసిన పోషకాలు వుండవు. కానీ కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాల వంటి హానికరమైనవాటితో చేసి వుంటాయి. వీటిలో శరీరానికి కావాల్సిన ఎలాంటి పోషకాలు వుండవు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారిలో పోషకాలు అందించబడవు, అందువలన వారు త్వరగా అలసటకు గురవుతుంటారు.
2008లో అమెరికాలో తిండి పదార్థాలపై కేలరీ లేబుల్స్ వేసిన తర్వాత కేలరీలు అధికంగా వున్న జంక్ ఫుడ్‌కు గిరాకీ తగ్గింది. దీని ప్రభావం అతి కొద్దిపాటిదే అయినప్పటికీ బాగుందని న్యూయార్క్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్లు తెలుపుతున్నారు. అమెరికాలో ఊబకాయాలు పెద్దవారిలో, పిల్లల్లోను ఎన్నడూ లేనంతగా వుంటున్నాయి. ప్రస్తుత గణాంకాల మేరకు పెద్దవారిలో ప్రతి మూడోవారు, పిల్లలు, టీనేజర్లలో 17 శాతం వరకు లావుగానే వుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్స్‌కు- అధిక కేలరీలు తీసుకోవడంలో వున్న సంబంధాన్ని అనేక అధ్యయనాలు రుజువు చేసాయి.
పిల్లలు పిజ్జా, బర్గర్ తదితర జంక్‌ఫుడ్‌లపై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. పిల్లలు ఇంతగా ఈ తరహా తిండికి అలవాటు పడటానికి సోషల్ మీడియా కూడా కారణమని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది. జంక్‌ఫుడ్‌కు సంబంధించి ఫేస్‌బుక్ తదితర సోషల్ సైట్లలో మార్కెటింగ్ ఎక్కువగా వుంటుందని దీంతో వీటిపై పిల్లలు అమితాసక్తి చూపుతున్నారని సర్వే తెలిపింది. జంక్‌ఫుడ్, శీతల పానీయాలకు సంబంధించిన ఫేస్‌బుక్ పేజీలను టీనేజ్ పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తున్నట్లు తేలింది. జంక్‌ఫుడ్ నుండి మనకు లభించేవి వంద శాతం అనవసరపు కొవ్వులు. సాధారణంగా జంక్‌ఫుడ్‌లో ఎక్కువగా వాడే పదార్థాలు జంతు సంబంధిత నూనెలు, కొవ్వులు అధిక మోతాదులో సోడియం బేకింగ్ సోడా, నిమ్మ ఉప్పు వాటికి తోడు రోడ్డుమీద దుమ్ము తోడవుతుంది. ఇవి శరీరానికి హాని చేసి, కడుపులో అల్సర్లు కలుగచేస్తాయి. జంక్‌ఫుడ్ తినే పిల్లల్లో చిన్నప్పుడు వారికిచ్చిన వాక్సిన్ పవర్ తగ్గి వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. యుక్తవయసు వచ్చేసరికి కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. చిన్న వయసులోనే గ్యాస్ సమస్య వస్తుంది. చిన్న పిల్లలకు జంక్‌ఫుడ్ అలవాటు చేయకూడదు. ఎక్కువ ఫ్రూట్ సలాడ్స్ చేసి ఇవ్వండి. ఏ పనిపట్లా ఆసక్తి లేకపోవడం, జీవించడమే వృధా అనిపించడం.. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు. ఆధునిక జీవితంలోకి అత్యంత వేగంగా వచ్చి చేరిన టెక్నాలజీలాగే, అంతే వేగంగా పెరుగుతున్న మానసిక సమస్య డిప్రెషన్. మారుతున్న జీవనశైలి, ఒత్తిళ్లు దీనికి ప్రధాన కారణం. మారిన జీవన శైలిలోనే వున్న జంక్‌ఫుడ్ మరింత డిప్రెషన్‌ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. హోటల్ ఫుడ్, జంక్‌ఫుడ్ వంటివాటికి అలవాటుపడితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటుంటే అనారోగ్యం బారిన పడకుండా తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. డెన్మార్క్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ నేపథ్యంలో ఓ నిర్ణయం తీసుకుంది. జంక్‌ఫుడ్ తినేవారిపై ఫ్యాట్ ట్యాక్స్ పేరుతో పన్ను విధిస్తూ 2011లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే డెన్మార్క్ తదితర ఐరోపా దేశాల్లో పంచదారతో తయారుచేసిన చాక్లెట్లు, బర్గర్లు ఇతర శీతల పానీయాలపై ట్యాక్స్‌వల్ల ఉత్పత్తులు అమాంతంగా పెరగడంతో వినియోగదాలు పరిమితంగా వాడుతున్నారు.

మీకు తెలుసా?

స్కూళ్లలో జంక్‌ఫుడ్ అమ్మడం, అందుబాటులో వుంచడాన్ని నియంత్రిస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందుబాటులో వుండేలా చూడాలని, పాఠశాల ప్రాంగణానికి 50 మీటర్ల పరిధిలో వరకూ అత్యధిక కొవ్వు, షుగర్ విలువలున్న ఆహార పదార్థాలు అమ్మకుండా నియంత్రించాలని ఆదేశించింది. స్కూల్ కాంపౌండ్లలో క్యాంటిన్ పాలసీని, స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటుచేసి అనారోగ్యకరమైన ఆహార అలవాట్లవల్ల తలెత్తే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ తెలిపింది.

జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం

పిజ్జాలు, బర్గర్లు తింటున్నారంటే చాలు మీరు యువకులైనా, మధ్య వయస్సువారైనా కావచ్చు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదముందని కాలిఫోర్నియలోని శాండియాగో విశ్వవిద్యాలయం పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జంక్‌ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం ద్వారా వ్యక్తుల్లో జ్ఞాపక శక్తి దెబ్బతింటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన డా. బీట్రిస్ గొలోంబ్ తెలిపారు. జంక్‌ఫుడ్ అధికంగా తినే సుమారు వెయ్యిమంది ఆరోగ్యవంతులపై ఈ మేరకు పరిశోధన నిర్వహించారు. వారి జ్ఞాపక శక్తికి పరీక్ష పెడితే అధ్వాన్నమైన ఫలితాలు వచ్చాయట. దీనిపై గొలోంబ్ వివరిస్తూ, జంక్‌ఫుడ్‌లో వుండే ప్రో ఆక్సిడెంట్లు కణశక్తికి వ్యతిరేకంగా పని చేస్తాయని తెలిపారు. దేహ ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మెదడు పనితీరు మందగిస్తుందన్నారు. క్రమేణా జ్ఞాపకశక్తి తరిగిపోతుందని పేర్కొన్నారు.ఈ ఆహారాల్లో వుండే కొవ్వులు, వాటిని తినడంవలనే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. డొపమైస్ ఉత్పత్తి, ఆలోచనలను, పాజిటివ్ థింకింగ్‌కు ప్రోత్సహించే ముఖ్యమైన రసాయనాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా డోపమైస్ చురుకుదనం, మెమరీ తగ్గిపోవడానికి సపోర్టు చేస్తుంది.

-తరిగొప్పుల విఎల్లెన్‌మూర్తి