మెయిన్ ఫీచర్

సమ్మోహనం.. ఆమె గానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తికి భావం తోడైతే ఆ భజనామృతం భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడిస్తుంది. ఖాయల్, జానపదం, టప్పా వంటి శాస్ర్తియ సంగీతంతో దాదాపు దశాబ్దకాలంగా సమ్మోహితులను చేసిన సంగీత దిగ్గజం డాక్టర్ గిరిజాదేవి. మీరాబాయి భజనలు పాడితే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే పసిబాలుడిగా పరవశించి ఆమె ఒడిన చేరి ఆటలాడుకున్న అనుభూతి మనకు కలుగుతుంది. డాక్టర్ గిరిజాదేవి కూడా గొంతెత్తి తుమ్రి స్టయిల్‌లో కీర్తన ఆలపిస్తే మన పురాణ పురుషులు మనముందు సాక్షాత్కరించినట్టే ఉంటుంది. భక్తితత్వాన్ని గుండెల నిండా నింపుకుని తుమ్రి క్వీన్‌గా విరాజిల్లిన ఆమెను అప్పాజీ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. భారతీయ శాస్ర్తియ సంగీత స్వరఝురి గిరిజాదేవి. సురదాస్, మీరాభాయి వంటి భక్తుల భజనల నుంచి వారసత్వంగా వచ్చిన తుమ్రికి శాస్ర్తియతను జోడించి సేవలందించారు. సుదీర్ఘమైన ఆమె సంగీత ప్రయాణంలో తుమ్రి ప్రాణపదంగా నిలిచింది.

అది 1952వ సంవత్సరం. ఢిల్లీలోని భారతీయ కళాకేంద్రం వారు ఓ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది గంట ప్రోగామ్ మాత్రమే. భారత ఉపరాష్టప్రతి డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ వంటి విద్వాంసులతో పాటు డాక్టర్ గిరిజాదేవి ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆమెకు కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఇచ్చారు. ఆ వేదికపై ఆమె తుమ్రి, టప్పా కచ్చేరీని కేవలం 18 నిమిషాలు నిర్వహించి పక్కకు వైదొలిగారు. ఆమె స్టేజీ దిగి వెళుతుండగా.. అకాడమీ సెక్రటరీ నిర్మలాజోషి పరుగెత్తుకుంటూ వచ్చి మీ ప్రోగ్రామ్‌ను కొనసాగించమని ఉప రాష్టప్రతి కోరుతున్నారు అని అన్నారు. ఆయన స్పందనను చూసి ఆ సమయంలో డాక్టర్ గిరిజాదేవికి నోట మాటరాలేదు. మరో 45 నిమిషాల పాటు ఆమె తుమ్రి ప్రోగ్రామ్‌ను కొనసాగించారు.

****

బీహార్‌లో దుర్గాపూజలు వేడుకగా నిర్వహిస్తారు. దర్బంగాలో మ్యూజిక్ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ గిరిజాదేవి ప్రోగ్రామ్ సాయంత్రం నాలుగు గంటలకు. వేదికమీదకు ఆమె వచ్చేసరికి అక్కడ ఒక్కరు కూడా లేరు. ఇద్దరు మాత్రం బీడీలు కాల్చుకుంటున్నారు. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. పక్కనే శివాలయంలో భక్తులు పూజలు చేస్తున్నారు. ఏదిఏమైతేకాని అని వేదిక మీద కూర్చుని కళ్లు మూసుకుని ఆ పరమశివుని స్తుతిస్తూ భజన పాడటం ఆరంభించారు. అలా కొన్ని నిమిషాలు పాడిన తరువాత కళ్లు తెరిచి చూస్తే సభాప్రాంగణం నిండా జనమే. అందరూ భక్తితో ఆమె భజనలను తన్మయులై వింటున్నారు. అలా ఆ భజనామృతం కొన్ని గంటలు పాటు కొనసాగినా జనం కదలకుండా కూర్చుండిపోయారు. ప్రోగ్రామ్ అయిపోయిన తరువాత ఓ వృద్ధుడు వచ్చి.. నీ భజనలతో మా ముందుకు ఆ పరమశివుడ్ని రప్పించావు. నా వద్ద ఇది మాత్రం ఉంది అంటూ ఓ మట్టి కడవ ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ వృద్ధుడి మాటలు ఆమెను హృదయాన్ని తాకాయి. ఆ కడవను ఆమె భద్రంగా దాచుకున్నారు.
వయసు కళాకారుడి ప్రతిభను అడ్డుకోలేదని చాటి చెప్పిన ఈ ఎనిమిది పదుల తుమ్రీ కళాతపస్విని 2010 నుంచి ఓ కచ్చేరీ సందర్భంగా పాడుతూ.. అకస్మాత్తుగా ఈ రోజు నుంచి ప్రజావేదికలపై పాడను అని ప్రకటించి గానప్రియులను నివ్వెరపోయేలా చేశారు. భర్త చనిపోయినపుడు అందరి వలే ఈ సాధ్వి కూడా విపరీతమైన బాధకు గురయ్యారు. ‘‘ఆయన పోవటం నా హృదయాన్ని ముక్కలు చేసింది’’ ఆని వాపోయారు. బనారస్ తన సంగీత వృక్షానికి వేర్లు ఏర్పడ్డా .. కోల్‌కతా తనను అక్కున చేర్చుకుందని అంటారు. 1975లో కోల్‌కతా వచ్చాను. అప్పటి నుంచి అదే నా సంగీత ప్రస్థానానికి జీవనగరంగా మారిందని చెబుతారు. డాక్టర్ గిరిజాదేవిది చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పవచ్చు. ఎందుకంటే అందమైన పిల్లల బొమ్మలను ఎన్నింటినో ఆమె సేకరించారు. ఆమె ఇంటికి వెళితే ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు చెందిన బొమ్మలు ఎన్నో దర్శనమిస్తాయి. పూలంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎన్నో రంగు రంగుల పూల బొకేలను సేకరించేవారు. సంగీతం నేర్చుకోవటానికి వచ్చే చిన్నారులకు ఆమె ఒక్కొక్కసారి చక్కగా వండి పెట్టేవారు.

జీవిత విశేషాలు..

సంగీత కళను పెంచి పోషించే శ్రీరామదాసు రాజ్ అనే జమిందారీ కుటుంబంలో బనారస్‌లో 1929లో జన్మించారు. ఐదేళ్ల వయసు నుంచే ఆమె సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. తొలినాళ్లలో ఆమె సార్జు ప్రసాద్ మిశ్రా వద్ద సంగీత శిక్షణ తీసుకున్నారు. తదనంతరం ఆమె సంగీత గురువు శ్రీచంద్ర మిశ్రా. ఆమె తొలి సంగీత ప్రదర్శన ఆలిండియా రేడియోలో 1949లో ఇచ్చారు. ఢిల్లీలో భారత ఉపరాష్టప్రతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ఇచ్చిన సంగీత ప్రదర్శన తరువాత ఆమె జీవితంలో వెనుదిరిగి చూడలేదు. భర్త పెద్ద వ్యాపారవేత్త. సంగీతం నేర్చుకున్నప్పటికీ వంశ కట్టుబాట్లు వల్ల ఆమె ప్రజల ముందు ఏనాడు గళం విప్పలేదు. 1951లో బీహార్‌లో ఆమె తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తరువాత నుంచి ఆమె ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. ఖాయల్, భారతీయ జానపదం, టప్పా సంగీతంలో ఆమె ఎన్నో భజనలు పాడారు.

వరించిన అవార్డులు..

డాక్టర్ గిరిజాదేవి అందించిన సంగీత సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. అలాగే సంగీత నాటక అకాడమీ అవార్డు, ఫెలోషిప్ వరించాయి. ఇంకా సంగీత సమ్మాన్ వంటి పురస్కారాలు సైతం ఆమె అందుకున్నారు. ప్రపంచానికి ఊపిరినందించే భక్తితత్వం ఉన్నంతవరకు ఈ సంగీత దిగ్గజం భారతీయుల హృదయాల్లో సుస్థిర స్థానంలో ఉంటారు.

ఢిల్లీలో భారత ఉపరాష్టప్రతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుటి ఇచ్చిన సంగీత ప్రదర్శన తరువాత ఆమె జీవితంలో వెనుదిరిగి చూడలేదు. భర్త పెద్ద వ్యాపారవేత్త. సంగీతం నేర్చుకున్నప్పటికీ వంశ కట్టుబాట్లు వల్ల ఆమె ప్రజల ముందు ఏనాడు గళం విప్పలేదు. 1951లో బీహార్‌లో ఆమె తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తరువాత నుంచి ఆమె ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. ఖాయల్, భారతీయ జానపదం, టప్పా సంగీతంలో ఆమె ఎన్నో భజనలు పాడారు.

డాక్టర్ గిరిజాదేవిది చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పవచ్చు. ఎందుకంటే అందమైన పిల్లల బొమ్మలను ఎన్నింటినో ఆమె సేకరించారు. ఆమె ఇంటికి వెళితే ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు చెందిన బొమ్మలు ఎన్నో దర్శనమిస్తాయి. పూలన్న ఆమెకు ఎంతో ఇష్టం. ఎన్నో రంగు రంగుల పూల బొకేలను సేకరిస్తారు. సంగీతం నేర్చుకోవటానికి వచ్చే చిన్నారులకు ఆమె ఒక్కొక్కసారి చక్కగా వండి పెడతారు.

-టి.ఆశాలత