మెయిన్ ఫీచర్

పాతికేళ్ల ప్రాయం.. పగ్గాలు వేయాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసు రెండు పదులు దాటిందంటే కేరింతలు..తుళ్లింతలతో కాలం గడిపెయ్యాలని తహతహలాడటం సహజం.జోరుగా..హుషారుగా.. సాహసంతో సాగిపోవాలని కలలుకనే యువప్రాయంలోనే ఆచితూచీ అడుగేస్తేనే యువత నడకా నడతా కుదురుకోవు. వినోదాల్లో మునిగితేలడటమే యువోత్సాహమనుకోవడం, శక్తియుక్తులను చేతులారా నేలపాలు చేసుకోవడమే అని పెద్దలు తేల్చిచెప్పారు. పైపైకి ఎగిరినప్పుడే దేనికైనా గుర్తింపు.. దిగజారినప్పుడు కాదు అనే సూక్తిని ఆచరణలోపెడుతూ ఆచీతూచీ అడుగు వేయాలని నిపుణులు చెబుతున్నారు. సంతోషాన్ని సొంతం చేసుకునేందుకు సాగరాన్ని సైతం ఈదేసేందుకు తహతహలాడటంలో వెనుకంజ వేయనక్కర్లేదు కాని నిదానంగా జీవన ప్రయాణం సాగిస్తూ.. శారీరక దారుఢ్యంతో ఎవరికివారే శక్తికేంద్రంగా తయారుకావాలి. అనుకున్న లక్ష్యాలను సొంతం చేసుకునేందుకు జీవన ప్రయాణం సాగించాలి. జీవితం హాయిగా...సాఫీగా సాగిపోవాలంటే కనీసం పదంటే పది విషయాలను మదిలో పదిలపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.
ప్రయాణాల జోష్
పాతికేళ్ల వయసులో ప్రయాణాలేమిటి? హాయిగా నెట్టింట్లో కూర్చొని సరదాగా కాలం గడిపేయవచ్చు అనుకోవద్దు. కుటుంబ సభ్యులతోగానీ, స్నేహితులతోగానీ కలిసి సరదాగా ప్రయాణాలు చేస్తేనే మంచిది. అందరం ఒకటే అనే భావనను మదినిండా నింపుకుని ఎక్కడకైనా వెళ్లండి అక్కడ నెలకొన్న విభిన్న సంస్కృతులు, ప్రజల జీవనశైలి గురించి తెలుసుకోవచ్చు. ఇతర సంస్కృతులను చూడటం, వారి ఆచారాలను గమనించటం వల్ల చక్కటి సామాజిక స్పృహ అలవడుతోంది.
పొదుపు జీవితానికి మలుపు
చదువుకునే వయసులోనే యువత జల్సాలకు అలవాటుపడి వారి ఖర్చులు పద్దులు పెంచేసుకుంటున్నారు.డిగ్రీ అయిపోగానే యువత కొలువు కోసం తొలి ప్రాధాన్యం ఇస్తేనే మంచిది. ఉద్యోగం లేకపోతే భవిష్యత్తులో ఏకాకిగా మిగలాల్సి వస్తుందని భావిస్తోంది. ఇటీవల జరిపిన సర్వేలో 25శాతం యువత ఉద్యోగం కావాలని కోరుకుంటుంది. 19శాతం మంది మాత్రమే సొంతం వ్యాపారం చేయాలని భావిస్తోంది. మరో ఏడు శాతం యువత ప్రైవేటు రంగంలోనైనా ఉద్యోగం చేస్తే చాలు జీవితం ధన్యమైనేట్లే భావిస్తున్నట్లు వెల్లడైంది. 25ఏళ్లు వయసురాగానే సంపాదనకే తొలి ప్రాధాన్యం ఇస్తోంది. సంపాదనతో ఎంతో కొంత స్వేచ్ఛ లభిస్తోంది. అమ్మాయిలతో జత కడుతున్నారు. వారి మెప్పు కోసం సినిమాలు, షికార్లు, పబ్బ్‌లు, పార్కులు..ఇలా ఖర్చుల పద్దు పెరిగిపోతుంది. దీంతో సంపాదిస్తున్నామనే ధీమాతో వచ్చిన జీతాన్ని ఖర్చుచేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. కాని ఈ సమయంలో రేపటి భవిష్యత్తుకు కొంత వెనుకోసుకోవటం మంచిది. సేవింగ్స్ రూపంలో భద్రం చేసుకోవటానికి అలవాటుగా చేసుకోవాలి. స్టాక్‌మార్కెట్లలోనూ, ప్రాపర్టీ కొనుగోలు కోసం, ఉన్నత విద్యకు ఉపయోగపడేందుకు, కారు కొనుగోలుచేయటం తదితర వాటిని సమకూర్చుకోవటానికి ఈ పొదుపే అక్కరకు వస్తుంది. ఈ వయసులో సంపాదించుకున్నదంతా షికార్లకు, సరదాలకు ఖర్చుచేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నవారవుతారు. కొంత వేనుకేసుకుంటే భవిష్యత్తుకు భరోసాను మీకుమీరే కల్పించుకున్నవారవుతారు.
ఏకాంత జీవితం ఆలోచనలకు పదును
యువత ఎంతోకొంత సమయాన్ని ఏకాంతంగా గడిపేందుకు ఇష్టపడుతోంది. రోజూ ఎంతో కొంతసేపు ఎవరితో వారు మాట్లాడుకోవడమంటే అద్భుత వ్యక్తిని కలుసుకున్నట్లే అని స్వామి వివేకానంద చెప్పిన మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతోంది.
చుట్టూ నలుగుర్ని పోగేసుకుంటేనే హీరో అయిపోతాం అనే అనుకుంటే పొరపాటే. కాస్తంత ఏకాంత జీవితం గడిపితే జీవితం విలువను తెలుసుకోగలుగుతారు.మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఏకాంతమే ఏకైక అనే్వషణ. ఇది భావిజీవితానికి మరింతగా ఉపకరిస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రులను వదలి ఉన్నత చదువుల కోసం విదేశాలకో, ఇతర ప్రాంతాలకో వెళ్లాల్సి వచ్చినపుడు మీకు ఎలాంటి మానసిక ఇబ్బందులు లేకుండా హాయిగా గడపటానికి ఉపకరిస్తోంది. మీరు ఎక్కడికైతే వెళతారో అక్కడ ఓ చిన్ని ప్రపంచాన్ని నిర్మించుకుంటే మరీ మంచిది.
సీరియస్‌గా తీసుకుంటేనే సాధించే సత్తా
ఈ వయసులో ఒక్కొక్క మైలురాయిని అధిగమించేందుకు యువత ప్రయత్నించాలి. అడివిలో ఆడుకోవాలని ఉవ్విళ్లూరవచ్చు. ఆకాశాన్ని అందుకోవాలని తహతహలాడవచ్చు. వీటన్నింటికంటే ముందు జీవితాన్ని సీరియస్‌గా తీసుకుంటే ఏమి సాధించాలనుకుంటారో అవగహనకు వస్తారు. అపుడు ఒక్కొక్క మైలురాయిని అధిగమించేందుకు ప్రయత్నాలు ఆరంభిస్తారు. వాటి కోసం కన్న కలలను సాకారం చేసుకోగలరు.
సామాజిక సేవకు కొంత సమయం..
చాటింగ్‌లతో కాలం వృథాచేయకుండాఈ వయసులో ఏదైనా మంచి పని చేయాలనే ఆలోచనలను మనసులోకి రానిస్తేమరింత మంచిది. సమాజానికి సేవ చేయాలనుకుంటే ఎన్నో పనులు ఉన్నాయి. వినూత్న సేవలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయి. తోటి స్నేహితులను కలుపుకుని సరదాగా..అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవటంతో పాటు స్వచ్ఛంద సేవకు సమాయత్తమవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మీరే ఎదైనా ఎన్జీఓ సంస్థను ఏర్పాటుచేసుకోవచ్చు. లేదా స్వచ్ఛంద సంస్థల్లో వలంటీర్‌గా పనిచేయవచ్చు. అనాథలు, వృద్ధుల కోసం కాస్తంత సమయాన్ని కేటాయిస్తే మీలో దయాగుణం అలవడుతోంది.
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం..
శారీరకధారుడ్యంతోనే ఏపనైనా సాధించగలం. స్వామి వివేకానంద అన్నట్లు ఉక్కునరాలు.. ఇనుమ కండరాలు కలిగిన యువత దేనినైనా సాధించగలదు అంటారు. భగవద్గీత చదవటానికన్నా.. బాస్కెట్‌బాల్ అడమని ఆనాడే ఆయన పిలుపునిచ్చారు.యవ్వనం తొణకిసలాడే ఈ ప్రాయంలో ఉసూరుమంటూ ఉంటే కన్నవారికే కాదు స్నేహితులకు సైతం దూరం అవుతారు. అందుకే కాస్తంత ఫిట్‌నెస్ కోసం మీ సమయాన్ని కేటాయిస్తే శారీరక ఆరోగ్యం సమకూరుతుంది. శారీరక ఆకృతికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇపుడు మీరు చేసే వ్యాయామం 50-60 సంవత్సరాలపుడు అది ఎంతోగానో ఉపకరిస్తోంది.
పెంపుడు జంతువుల పట్ల మమకారం
పెంపుడు జంతువులను పెంచాలనే కోరికను మనసులో నింపుకోండి. మీరు పెంపుడు జంతువుల పట్ల చూపే మమకారం అది మీ జీవితాన్ని సైతం ప్రేమించేలా ప్రేరణ కలిగిస్తుందని ఇటీవల జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది.
జీవితమే ఛాలెంజ్
జీవితాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నవారే పైకిరాగలరు. ఏ తరానకి ఆ తరం కొత్త కొత్త ఆశలు, ఆలోచనలతో ముందుకు సాగుతుంటుంది. కొత్తదనం కోసం వెంపర్లాడేవారు సాహసంతో ముందడుగు వేయగలరు. అలాంటి ఉపాధి అవకాశాలు నేడు బోలెడున్నాయి. వాటిని అందిపుచ్చుకోవటమే తరువాయి. స్కూబా డైవింగ్ లాంటివాటిల్లో శిక్షణ తీసుకుంటే వినోద, పర్యాటక రంగంలో అవకాశాలు సంపాదించవచ్చు. ఇలాంటి ఉపాధి అవకాశాలకు ప్రయత్నించటం నేడు యువతకు ఎంతో మంచిది.ఇవన్నీ జీవితంలో ఆచరణలో పెడితే ధీరులై ఎదుగుతారు.. సమస్యలు,సవాళ్లను అధిగమిస్తారు. మరి ప్రయత్నించండ

-టి.ఆశాలత