మెయిన్ ఫీచర్

క్యూట్ క్యూట్ క్విల్లింగ్ డాల్స్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనికిరానివాటితో పనికొచ్చే వస్తువులు సాధారణ గృహిణి చేతిలో కళాకృతులు
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏమీ వుండదు. కానీ మనమే వాటిని చెత్త పాల్జేస్తుంటాం. మనలోని సృజనాత్మకతకు పదునుపెడితే పనికిరాని వస్తువులను సైతం పనికొచ్చే వస్తువులుగా మలచవచ్చు. ఇలాంటి కోవకు చెందినవారే శారదామణి. సాధారణ గృహిణి. అయితేనేమి తాను సృష్టించిన కళాఖండాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. ప్రకాశం జిల్లా పామూరులో పుట్టిన శారదామణి పెళ్లయిన తరువాత ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా తనలో దాగివున్న కళకు పదునుపెట్టింది. పనికిరాని వస్తువులతో అద్భుత కళాకృతులు తయారుచేస్తున్నారు. ఖాళీ వాటర్ బాటిల్స్, రాళ్లు, కొబ్బరి చిప్పలు, సీసా మూతలు, కొయ్యపొట్టు తదితర పనికిరాని వ్యర్థ పదార్ధాలతో సుమారు మూడు వేలకు పైగా విభిన్న రకాల బొమ్మలు తయారుచేసి ఆరు అంతర్జాతీయ బహుమతులను పొందిన శారదామణి విశ్రాంత సమయాన్ని కళాకృతుల తయారీకి కేటాయిస్తున్నారు. 1979 జనవరి 10వ తేదీన ప్రకాశం జిల్లా పామూరు గ్రామంలో రమాదేవి, సుబ్బారావు దంపతులకు జన్మించిన శారదామణి బికామ్ (కంప్యూటర్స్) పూర్తి చేసి ప్రస్తుతం కొత్త కళాఖండాలను సృష్టించాలని నిత్య అనే్వషణలో ఉన్నారు. ఈమె భర్త విద్యావేత్త, పాబోలు వెంకట సుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతోనే తాను అద్భుతాలను సాధించగలుగుతున్నానని చెప్పారు. భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌తోపాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సాధించింది. మహిళాలోకానికి వనె్న తెచ్చే స్ర్తిమూర్తిగా అనేక సత్కారాలు పొందారు.
మహిళలకు, చిన్నారులకు ఈ కళను నేర్పిస్తూ ప్రాచుర్యం తెస్తోంది. ప్రస్తుత నవ నాగరిక సమాజంలో యువతీ యువకులకు అందమైన జ్యూయలరీని కూడా తయారు చేస్తున్నారు. చెవిదిద్దులు, కమ్మలు, ముక్కుపుడకలు చాలా ఆకర్షణీయంగా వున్నాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం తనకు తెలియకుండానే వరించిందని ఆమె చెప్పారు. కృషి వుంటే మనుషులు ఋషులవుతారని ఒక మహాకవి తన పాటలో వ్రాసినట్టు శారదామణి కృషి అంతర్జాతీయ ఖ్యాతి చెందిందని నాట్యాచార్యులు కళాదీప్తి నృత్య కళాశాల నిర్వాహకులు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. తాను చేస్తున్న కళా కృతుల గుంచి వివరణ ఇస్తూ ఒక బొమ్మ పూర్తి ఆకారం పొందడానికి మూడురోజుల పడుతుందని శారదామణి చెప్పారు. తాను చెయ్యాలనుకున్న బొమ్మ ఆకారాన్ని ఊహించుకున్న తరువాత తన దగ్గర వున్న వ్యర్థ పదార్ధాన్ని బొమ్మరూపంలో మరల్చడానికి చాలా ఏకాగ్రత్త వుండాలని అందుకే పిల్లల్ని స్కూలుకు పంపిన తరువాత భర్త ఆఫీసుకు వెళ్లిన తరువాత విశ్రమించే సమయంలో తాను చెయ్యాలనుకున్న కళాకృతి గురించి ఆలోచించి దానిని ఏవిధంగా మరల్చాలో ప్లాన్ తయారు చేసుకుంటానని ఆ తరువాత తన ఆలోచనలకు రూపం కల్పిస్తానని ఆమె చెప్పారు. సాయంత్రం నాలుగు గంటలు దాటగానే పిల్లలు స్కూలునుండి రావడంతో గృహిణిగా తన బాధ్యతలను తాను నిర్వహిస్తుంటానని ఆమె చెప్పారు. ఏవిషయంలోనూ రాజీపడకుండా తన కుటుంబ సభ్యులందరికీ తన బాధ్యత నిర్వహిస్తూ కళాకృతుల తయారీలో తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. ఈ కళాకృతుల తయారీలో క్విల్లింగ్ డాల్స్‌ను ఖండాంతరాలకు వ్యాపింపచేస్తూ ప్రపంచం గర్వించదగ్గ అద్భుత రికార్డు సృష్టించి తాను మహిళాలోకానికి ఆదర్శంగా నిలవాలనేదే జీవితాశయమని శారదామణి అన్నారు.

-మురళీధర్