మెయిన్ ఫీచర్

కథాకేళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథలు చెబుతూ బంగారు భవిష్యత్తుకు బాటలు అంతర్జాతీయ కథకుల సదస్సుకు ఆహ్వానం అందుకున్న హైదరాబాద్ యువతి

ఆమెను చూస్తే చాలు పిల్లలు కేరింతలు కొడతారు. నోట్లో నుంచి వచ్చే ముత్యాల్లాంటి మాటలకు మంత్రముగ్ధులవుతారు. పెద్దవాళ్లు సైతం పోయిందనుకున్న తమ బాల్యం కళ్ల ముందు కదులుతున్నట్లు భావిస్తారు. ఆమే కథలు చెప్పే దీపాకిరణ్. కథలు చెప్పటం ఓ కళ. మనసులకు హత్తుకునేలా, సాహిత్య పరిమళాల్ని వెదజల్లేలా విభిన్న కథలను పరిచయం చేస్తూ.. అందులో వారిని మమేకం అయ్యేలా చేస్తోంది.

లోకజ్ఞానం అవసరమే..

చదువుల పేరుతో పిల్లల్ని నాలుగు గోడల మధ్యనే బందీ చేసేస్తున్నాం. పిల్లల మానసిక వికాసానికి చదువుతో పాటు కథలు చెబితే చురుగ్గా ఉంటారు. పిల్లలందరూ ఆడుతూ పాడుతూ బాల్యాన్ని ఆస్వాదించేలా చేసేందుకు దీపా కిరణ్ స్టోరీ టెల్లర్ అవతారమెత్తింది. పిల్లల్నే ప్రపంచంగా చేసుకుంది. పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగించేలా అన్ని కథా వస్తువులను ఆకళింపు చేసుకునేలా ఆమె నేర్పిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని పిల్లల కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని తల్లిదండ్రులు, స్కూలు టీచర్లు సైతం ప్రశంసిస్తున్నారు.
స్టోరీ ఆర్ట్స్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు..
కథలు చెప్పే కళను మరింత విస్తత్రం చేసేందుకు, పిల్లల మానసిక వికాసానికి తనవంతు ప్రయత్నం చేయాలంటే ఓ సంస్థ అవసరమని భావించి దీపాకిరణ్ హైదరాబాద్‌లో స్టోరీ ఆర్ట్స్ ఇండియా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ తరపున ఆమె పిల్లల్లో కథల పట్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశ సంసృతి, మహానీయుల జీవితగాథలను వివరిస్తోంది. ప్రకృతి పాఠాలను సైతం కథల రూపంలో బోధిస్తోంది. భక్తి మార్గంలో పయనించి తమ జీవితాలను సార్థకం చేసుకున్న మీరా, కబీర్‌ల వంటి మహనీయుల జీవితగాథలను చెబుతోంది. ఈ ఫౌండేషన్ తరపున ఆమె చేసిన కృషి వల్ల అంతర్జాతీయ కథకుల సదస్సుకు వెళ్లగలిగారు. దీపాకిరణ్ కథలు చెప్పే కళను చూసి నగరంలో చాలామంది తాము కూడా కథలు చెబుతామని ముందుకు వస్తున్నారు. ఇది మంచి పరిణామం అని చెబుతూ.. పిల్లల భవిష్యత్తు బంగారం వలే మెరుగులు దిద్దవచ్చని అంటోంది.
సదస్సులో పాల్గొనటం అద్భుతం..
ఎడెన్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ స్టోరీ టెల్లింగ్ ఫెస్టివల్‌లో పాల్గొనటం ఎంతో అద్భుతంగా ఉందని ఆమె చెబుతుంది. మనదేశం తరపున దీపాకిరణ్ ఒక్కరే పాల్గొనే అవకాశం దక్కింది. పాశ్చాత్య దేశాలకు చెందిన యంగ్ స్టోరీ టెల్లర్స్‌ను కలుసుకునే అవకాశం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేసింది.
ఈ సదస్సుకు స్కాట్‌లాండ్, న్యూజిలాండ్, కెన్యా, స్వీడన్ తదితర దేశాల నుంచి రావటం జరిగింది. నార్వే, స్కాట్‌లాండ్ దేశాలలో కథకులలో ఎక్కువ మంది తమ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా కథలు చెబుతారని దీపాకిరణ్ వెల్లడిస్తోంది.
ఈ సదస్సులో చివరి రెండు రోజులు దీపాకిరణ్ మాట్లాడే అవకాశాన్ని దక్కించుకుంది. చిన్నారుల మెదళ్లకు పదునుపెడుతూ.. వారిలో విజ్ఞానం పట్ల జిజ్ఞాస కాంతులు వెలుగిస్తోంది దీపా కిరణ్.

పిల్లలే నా ప్రపంచం. కథలు చెప్పే కళను చూసి నగరంలో చాలామంది తాము కూడా కథలు చెబుతామని ముందుకు వస్తున్నారు. ఇది మంచి పరిణామం అని చెబుతూ.. పిల్లల భవిష్యత్తు బంగారం వలే మెరుగులు దిద్దవచ్చు.
-దీపా కిరణ్

-టి.ఆశాలత