మెయిన్ ఫీచర్

చిన్నారులు.. చిరుదివ్వెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్యం ఓ అద్భుత వరం. మనిషి జీవితంలో బాల్యం ఎంతో ముఖ్యమైనది. ఒక వ్యక్తిబాల్యం ఏ విధంగా గడిచిందో అనే అంశంమీద ఆధారపడి ఆ వ్యక్తి జీవితం రూపుదిద్దుకుంటుంది. బాల్యం గుర్తుకు వస్తే చాలు భారమైన వయసు తేలికవుతుందంటారు. జీవితంలో ఒక్కసారైనా బాల్యాన్ని తలచుకోని మనిషి ఉండడు. హాయిగా బతికేందుకు బాలల్లో ప్రతి ఒక్కరికీ హక్కుంది. ఆ హక్కును తాను పరిరక్షిస్తూ మరెవ్వరూ కాలరాయకుండా చూస్తూ ముందుకు సాగినప్పుడే అది ప్రజా ప్రభుత్వమవుతుంది.. నేటి బాలలే రేపటి పౌరులనే స్పృహ ఆచరణలో కన్పించాలి. పిల్లలకూ ఆలోచించుకునే శక్తి ఉంది, విశే్లషించుకునే సామర్థ్యం ఉంటుంది. మంచీ చెడులు బేరీజు వేసుకోగల విచక్షణ ఉంటుంది అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. పిల్లలతో మాట్లాడే ముందు మనకే అన్నీ తెలుసునన్న అహాన్ని వదిలేసుకోవాలి. అయితే పిల్లల సంక్షేమం కోసం ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంపొందించే మరో శుభ దినమే ఐక్యరాజ్యసమితి పాటించే ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. ప్రతి ఏడాది నవంబర్ 20వ తేదీ ప్రపంచ బాలల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇదే నెలలో నవంబర్ 19 బాలల అత్యాచార నిర్మూలన దినోత్సవం (చైల్డ్ అబ్యూజ్ ప్రివెన్షన్ డే) కూడా జరుపుకోవడం ఈ వారం మరింత ప్రత్యేకత సంతరించుకుంది.

ఇంట్లో, పాఠశాలల్లో, ఇతర చోట్ల అనేకమంది బాలలు హింస, దారిదోపిడీ, వేధింపుల వంటి రకరకాల అకృత్యాల బారిన ఇంకనూ పడుతున్నారు. అందుకే వారి హక్కుల గురించి, వారు పడుతున్న ఆవేదనను గురించి చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 20న ‘ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని’ జరుపుకుంటారు. 1954 డిసెంబర్ 14న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1856 నుంచి ప్రపంచ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహించాలని అన్ని దేశాలకు సూచించింది. 1959 నవంబర్ 20న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల ప్రకటనను ఆమోదించింది. 1989 నవంబర్ 20న బాలల హక్కుల కనె్వన్షన్‌ను ఆమోదించింది. 2030 నాటికి సాధించాల్సిన 17 లక్ష్యాలలో బాలల రక్షణ, విద్యకు సంబందించినవి ముఖ్యమైనవి. పిల్లల రక్షణకు సంబంధించి బాలల ఆరోగ్యాన్ని పోషకాహార నిర్మూలనకు 2016-17లో 1766.24 కోట్లు కేటాయించింది. కాని జన్మించిన 1000 మంది శిశువుల్లో నేటికి 72 మంది మరణిస్తున్నారు. ఇది బాలలు జన్మించే హక్కుకు వ్యతిరేకం. ఇంకనూ నిరక్షరాస్యత, స్ర్తి పురుష అసమానత, కుల వివక్ష కొనసాగుతున్నాయి. ఎస్‌సి, ఎస్‌టిలలో అక్షరాస్యత ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. మహబూబ్‌నగర్, నల్లగొండ, అదిలామాద్, నిజామాబాద్, మెదక్‌లలో స్ర్తి పురుషులు అధికంగా ఉన్నది.

మీ వీధిలోగానీ, మీ పక్కంటిలోగానీ పిల్లలు భద్రంగా ఉన్నారా? అంటే నమ్మలేని విషయాలు బయటపడతాయి. ఇటీవల పిల్లల భద్రతపై జరిపిన సర్వేలో 53శాతం మంది పిల్లలు వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడైంది. పిల్లలపై వేధింపుల కేసులు అధికంగా ఉత్తరప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలలో నమోదవుతున్నాయి. నమోదుకాని కేసులు ఎన్నో ఉన్నాయి.
ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు శారీరక వేధింపులకు గురవుతున్నారు.
ప్రతి రోజూ ఎనిమిది కేసులు నమోదవుతున్నాయి.
అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లిదండ్రులే పిల్లలను వేధించటం శోచనీయం.
వేధింపులకు గురవుతున్నవారిలో మగపిల్లలు 72శాతం, బాలికలు 65శాతం మంది ఉన్నారు.
పిల్లలపై జరిగే వేధింపులలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా.. ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది.
దేశ జనాభాలో 40శాతం మంది పిల్లలే ఉన్నారు.

ప్రపంచంలోని శిశు మరణాల్లో 20 శాతం భారత్‌లోనే సంభవిస్తున్నాయి. పిల్లలు మాయం కావడం, పిల్లల అమ్మకం, పిల్లలపై దాడులు, హింస మొదలైనవి మరియు నేటికి బాల్య వివాహాలు కొనసాగడం శోచనీయం. సంపూర్ణ అక్షరాస్యత గల కేరళ రాష్ట్రంలో బాల్యవివాహాలు జరుగుతుండడం అధైర్యాన్ని కలిగిస్తాయి.
‘‘పిల్లలు పుట్టడానికి, ఆ తర్వాత వారికి తగిన వనరులు, సేవలు అందించి వారి పెరుగుదలకు అన్ని విధాలా తోడ్పడడం, వారి భౌతిక, మానసిక, సామాజిక అభివృద్ధికి సహాయపడటం, దేశంలోని వివిధ ప్రాంతాల బాలల మధ్య అసమానతలు లేకుండా అభివృద్ధి చెందడానికి సహాయమందించడం మన విధానమని 1974 జాతీయ బాలల విధానం పేర్కొంది. తిండి, బట్టలు, విశ్రాంతి, శారీరక, మానసిక వికాస ప్రక్రియ, రక్షణ, సాంస్కృతిక వాతావరణం భవిష్య జీవితంపై గాఢ ముద్ర వేస్తాయి. భారత రాజ్యాంగం కూడా బాలల హక్కుల గురించి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ బాలల హక్కుల గురించి ప్రతిపాదనలు రూపొందించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమితి ఈ ప్రతిపాదనలను 1989 నవంబర్ 20న ఆమోదించింది. ప్రతిపాదిత 54 హక్కులు ఎన్నో విషయాలను తెలియజేసింది. గర్భస్థ పిండం ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యకు దిగజారే విష సంస్కృతి ఇంకా నడుస్తోంది.

ఈ జాతికి నిజమైన సంపద పిల్లలే. ఇలాంటి భావితరానికి సరైన మార్గనిర్దేశం చేయకపోతే మనం బాధ్యతాయుతమైన పాత్ర పోషించనట్టే. అంతర్జాతీయ బాలల దినాన్ని జరుపుకోవాలని ప్రపంచ మహిళా సమాఖ్య 1948 సంవత్సరం జూన్ 1న నిర్ణయించింది. నాటినుండి సుమారు వంద దేశాలకు పైగా ఈ తేదీన బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అయితే కొన్ని దేశాల్లో బాలల దినోత్సవానికి కొన్ని ప్రత్యేక రోజులున్నాయి. ఉదాహరణకు మన దేశంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. జపాన్ మే 5న, దక్షిణ కొరియా మే 5న, పోలాండ్ జూన్ 1న, శ్రీలంక అక్టోబర్ 1న బాలల దినోత్సవంగా ప్రకటించుకున్నాయి. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి సమాజంలో బాలలు కూడా మానవ హక్కులు సమానంగా అనుభవించడానికి ఐక్యరాజ్యసమితి నవంబర్ 20, 1989లో 54 హక్కులను ప్రపంచ బాలలకు అందజేసింది.
ఈ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని మన దేశంలో పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1992 డిసెంబర్ 11న ఆమోదించింది. ఈ హక్కులు 18 ఏళ్ళలోపు బాలలందరికీ వర్తిస్తుంది. 54 హక్కులను ఐక్యరాజ్యసమితి నాలుగు భాగాలుగా విభజించింది. అందులో ఒకటి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు, ఆరోగ్యవంతమైన బాలలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది కనుక అందరికీ ఆమోదయోగ్యమైంది.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక మానవ హక్కులు, బాలల హక్కులు గురించి ఆలోచన ప్రారంభమైంది. బాలల విద్యావికాసం, సామాజిక రక్షణలకే ఏ ప్రభుత్వమైనా పెద్ద పీట వేయాలి. వివిధ దేశాల్లో పిల్లలను చట్టపరంగా ‘మైనర్’ అని నిర్వచిస్తారు. దళ ష్యశ్పళశఆజ్యశ యశ ఆ్దళ జదఆఒ యఛి ఆ్దళ ష్దజజూ నిర్వచనం ప్రకారం 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న మానవుల్ని పిల్లలుగా భావిస్తారు. బాలల హక్కుల్ని ప్రాథమిక హక్కుగా చేసినప్పటికీ వారి హక్కులు కాపాడ్డం అనేది ఆచరణ సాధ్యంకాని పనిగా కన్పిస్తుంది. బాల కార్మిక చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారిపోయింది. 18 సంవత్సరాలలోపు చేసే వివాహాల్ని బాల్య వివాహాలు అంటారు. కాని బాల్యవివాహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 18 ఏళ్ళ వయసులోపు బాల బాలికలు 33 మిలియన్లమంది పనిచేస్తున్నారు. ప్రతి 11మంది బాలల్లో కనీసం ఒకరు బాల కార్మిక వ్యవస్థలో ఉండడం గమనార్హం. ప్రపంచం మొత్తం మీద అత్యధిక బాల కార్మికులున్న దేశం మనది. ప్రపంచ వ్యాప్తంగా 5-17 ఏళ్ళ మధ్య వయసుగల 215 మిలియన్ల మంది బాలలు పనిచేస్తున్నారు. అందులో 115 మిలియన్ల మంది ఆరోగ్యానికి భంగం కలిగించి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు (2012లో స్టేట్ ఆఫ్ చిల్డ్రన్స్ రిపోర్టు ప్రకారం). గతంలో యూనిసెఫ్ వెల్లడించిన నివేదిక ప్రకరాం ప్రాథమిక పాఠశాలలోని పాతిక కోట్లమంది పిల్లలకు కనీస సౌకర్యలు కొరత ఉంది. ఏడు లక్షల అంగన్‌వాడి కేంద్రాలకు భవనాలు లేవని తెలిపింది. కొన్ని దేశాలు బాలల హక్కులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. నార్వే, స్వీడన్ దేశాలలో వీధి బాలలు అరుదుగా కనిపిస్తారట. అమెరికాలో బాల నేరస్థుల సంస్కరణశాలలు వారి ఉపాధి, చదువులపట్ల శ్రద్ధ వహిస్తాయి. శిక్ష కంటే మార్పు తేవడం వైపే అక్కడి ప్రభుత్వాలు చూపు సారిస్తుంది. దుబాయి వంటి గల్ఫ్ దేశాల్లో ఉచిత నిర్బంధ విద్య కారణంగా బాల కార్మిక సమస్య కనిపించదు. పిల్లలు ఎంతో అమూల్యమైన వారు. దేశ భవిష్యత్తుకు పిల్లలెవరూ హింసకు గురికారాదు. తెలుగు రాష్ట్రాల్లో 74 శాతం బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలంటే చిత్తశుద్ధితో చట్టాలన్నింటిని పటిష్టంగా అమలుచేయాలి. ‘సమగ్ర బాలల రక్షణ పథకం’ కింద బాల్య వివాహాలు, బాల కార్మిక సమస్య, హెచ్‌ఐవి పిల్లలు, అనాథ బాలలు, బాలల అక్రమ రవాణా, వీధి బాలలపై దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. నిజానికి పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడానికి, పరస్పర అవగాహన పెంచుకోవడానికి, ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ బాలల హక్కుల దినోత్సవానికి రూపకల్పన చేసింది. బాలల కోసం 1946లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ‘యూనిసెఫ్’ను స్థాపించింది. మానవతా దృక్పథంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ బాలల హక్కులను పరిరక్షించడంలో, వారి పురోభివృద్ధి రక్షణ విషయాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినందుకు 1965లో ‘నోబెల్’ బహుమతి పొందింది. పిల్లలు చదువుకోవడం వారి ప్రాథమిక హక్కు. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందరికీ అందివ్వాలి. కానీ ఇటీవల మళ్లీ డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలంటున్నారు. ఇది 2010లో అమలులో వచ్చి విద్యా హక్కును కలిగిస్తున్నది.
బాలలకు సంబంధించిన
కొన్ని హక్కులు
సంపూర్ణ ఆరోగ్యం, నాణ్యమైన ఉచిత విద్య పొందే హక్కు
ఆడుకునే హక్కు, వినోదం పొందే హక్కు
పరిశుభ్రమైన త్రాగునీరు పొందే హక్కు
పోషకాహారం పొందే హక్కు
గౌరవాన్ని పొందే హక్కు
స్వేచ్ఛగా ఆలోచించే హక్కు
పిల్లల్ని దోచుకునే పెద్దలున్నచోట చిన్నారులకు హక్కులుండటం తప్పనిసరి. బాలల అక్రమ రవాణా వంటి సమస్యలు తీర్చాలి. అపుడే బాలల దినోత్సవ - బాలల హక్కుల దినోత్సవానికి సార్థకత.

- కె.రామ్మోహన్‌రావు