మెయిన్ ఫీచర్

మనసు గాయం మానేదెన్నడు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో రానురాను స్ర్తికి సంఘంలో విలువ, గౌరవం తగ్గి నీచస్థాయికి దిగజారుతోంది. పురుషాధిక్య సమాజంగా మన భారతదేశం ప్రపంచం మొత్తం ముద్ర వేయించుకుంది. ఎందుకంటే స్ర్తి పురుషులకంటే తక్కువ స్థాయి కలదని, చులకన భావంతో చూడడం వలన మన సామాజిక నిర్మాణం, సంస్కృతులు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, మహిళలపై ఆంక్షలు, సామాజిక దురాచారాలు, మూడ నమ్మకాలు, మహిళల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీయడమే కాకుండా, మహిళలను ప్రతి విషయంలో అణగదొక్కడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఒకపక్కన దేశాన్ని భారతమాతగా పిలుస్తునే మరోపక్క అదేస్ర్తిలపై మానభంగాలు, హత్యాచారాలు, దుర్మార్గాలు చేయడం లాంటివి మన భరత జాతిని భ్రష్టుపట్టిస్తున్నాయి. ముఖ్యంగా 19, 20 శతాబ్దాల్లో గృహహింసకు, బాల్య వివాహాలకు, స్ర్తి జాతిని బలి చేసారు. 20వ శతాబ్దం మొదటిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల పరిరక్షణ కోసం సమస్యల పరిష్కారం కోసం అనేకమంది మహిళలు ఉద్యమాలు చేసారు. ఇందులో ప్రత్యేకించి స్వచ్ఛంద సంస్థలు, స్ర్తిలకోసం రక్షణకోసం ఉద్యమాలు చేసాయి. దేశ జనాభాలో సగం ఉన్నటువంటి స్ర్తిలకు ఎలాంటి రంగంలోనూ హక్కులు, అవకాశాలు అందకపోవడం, ఎంత తెలివితేటలు వున్నా వంటింటికే పరిమితమవడం సహించలేకే మహిళలు తిరగబడడం జరిగింది. సమాజంలో మహిళల స్థితిగతులు, తెలివితేటలు మెరుగుపడనిదే దేశాభివృద్ధి సాధ్యం కాదని గుర్తించిన ప్రభుత్వాలు కూడ మహిళా సంక్షేమానికి పలు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయ.
ప్రస్తుతం భారతదేశంలోని మహిళలు కొంతకాలం కిందటి మాదిరిగా వున్నట్టుగా లేరు. ప్రతీ రంగంలోను ఎదుగుపోతున్నారు. అటు విద్యారంగం, రాజకీయ రంగం, క్రీడారంగం, అన్నింటికన్నా విద్యారంగంలో మగవారికన్నా స్ర్తిలే ఎక్కువగా రాణిస్తున్నారు. ఇలా దినదినాభివృద్ధి చెందుతూ స్ర్తిలు వంటింటికే పరిమితమవుతున్న ముద్రను రూపుమాపి మగవారితో సమానంగా ముందుకు సాగిపోతున్నారు. భారతదేశంలో మహిళలు అన్నిరంగాల్లో ముందంజలో వున్నప్పటికీ వారిపై వివక్ష తొలగిపోవడం లేదు. హక్కుల విషయంలోగానీ, ఉద్యోగాల్లో గానీ, ఆస్తుల పంపకాల్లో కానీ ఇప్పటికీ పురుషాధిక్యత చెల్లుబాటవుతోంది. భారత ప్రభుత్వం మహిళా సాధికారత గురించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. రాజకీయ పరంగా కూడా మహిళా సాధికారత కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ల బిల్లును తయారుచేసారు. కానీ ఇవన్నీ ఒక్కొక్కసారి ప్రణాళికలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవానికి అమలు అవుతున్నవి చాలా తక్కువ. ఇప్పటివరకు ఎంతో కొద్ది ప్రగతి, సాధికారత సాధించిన స్ర్తిలే వీటివల్ల లాభం పొందుతున్నారు. గ్రామీణ, అట్టడుగుస్థాయి స్ర్తిలకు దక్కుతున్నది శూన్యం. మహిళలపై పూర్వం మాదిరిగా పురుషాధిక్యత లేకున్నా కొంత రూపం మార్చుకుని అలాంటి ఆగడాలు సాగుతునే వున్నాయి.
ఇంకా ఎందరో మహిళలకు ఎంత శక్తి సామర్ధ్యాలున్నా తెలివితేటలున్నా పురుషులకంటే తక్కువ వేతనాలు పొందుతున్నారు. స్ర్తిలు శారీరకంగా బలవంతులు కారని, బలహీనులని చెప్పి వారికి అవకాశాలే ఇవ్వని రంగాలు కొన్ని. మయన్మార్ దేశంలో అయితే ప్రజాస్వామ్యయుతమైన ఎన్నికల్లో ఒక మహిళ ఉద్యమనాయకురాలుగా సుచీ గెలిచినా ఆమెకు అధికారం దక్కకుండా రెండు దశాబ్దాలకు పైగా ఆమెను గృహనిర్బంధంలో వుంచారంటే ఎంత ఘోరం? ఇటువంటి వివక్ష అయితే ఎక్కడా కనిపించకపోవచ్చు. కొన్నిరంగాల్లో స్ర్తిలు మగవారికంటే ఎక్కువ సమర్ధవంతంగా పనిచేస్తారని, అంకితభావంతో పనిచేస్తారని వాటిపై అధ్యయనాలు రుజువు కూడా చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో మొదటి స్థానంలో మహిళలే ఎక్కువగా వుంటున్నారు. ఇన్ని చట్టాలు, నిబంధనలు తెచ్చినా మనదేశంలో ర్యాగింగ్, మానభంగాలు, హత్యలు, అత్యాచారాలు మాత్రం ఇప్పటికీ జరగుతునే వున్నాయి. యుక్తవయసులో వున్న స్ర్తిలతోపాటు ముక్కుపచ్చలారని ఆడపిల్లలపై అరవై సంవత్సరాలు పైబడి వృద్ధాప్యంలో వున్నవారిపై కూడా అత్యాచారాలు చేస్తున్నారు కామపిశాచులు. ప్రతినిత్యం మనం చదివే దినపత్రికల్లో దేశంలోని ఏదో ఓ మూలన పసిపిల్లలపై, యుక్త వయసు బాలిలకపై, నడివయసుస్ర్తిలపై , వృద్ధులపై కూడా హత్యలు, అత్యాచారాలు జరిగినట్లు వార్తలు మనం చూస్తూనే వున్నాం. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా స్ర్తికి మాత్రం స్వేచ్ఛసమానత్వం ఇంకా రాలేదనే భావించాలి. బ్రిటిష్ వాళ్ల చేతుల్లో భారతదేశం ఒకప్పుడు ఎలావుందో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడ భారతదేశంలో స్ర్తి పాత్ర దాదాపుగా అదే మాదిరిగా వుంది.
మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, వివక్షపై అధ్యయనాలు జరిగేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రగతి సంబంధమైన మరియు విద్యా సంబంధమైన పరిశోధనలు జరిపి మహిళల శక్తి సామర్ధ్యాలు తెలివితేటలు వెలికి తీసి వారి అభివృద్ధికి తోడ్పాటునందించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మహిళా సాధికారత, అభివృద్ధిపై అధ్యయనం చేసి మూల్యాంకనం చేయాలి. రాజ్యాంగంలో స్ర్తి సంక్షేమం, అభివృద్ధికి, రక్షణకు గాను నిబంధనలు అమలును పర్యవేక్షించాలి. చట్టాలను పటిష్టం చేయాలి.

ప్రపంచంలో జనాభా ఎక్కువగావున్న దేశాలను గమనించినట్టయితే మనది రెండవ స్థానం. విస్తీర్ణంలో 2.4 శాతం కలిగివున్న భారత్‌లో జనాభా మాత్రం 17.85 శాతం అంటే 133 కోట్లు అన్నమాట. 2025 నాటికే చైనాను మించిపోతుందనడంలో సందేహం లేదు. ప్రపంచంలో సగటున వెయ్యిమంది పురుషులకు 944మంది స్ర్తిలే వున్నారు. పురుషులకన్నా స్ర్తిల జనాభా ఎక్కువవున్న రాష్ట్రం కేరళ. కేరళలో ఫ్రతి వెయ్యిమంది పురుషులకు 1084 మంది స్ర్తిలువున్నారు. ఆరేళ్లలోపు పిల్లల్లో 1962లో అది 976, 2001లో 927, 2011లో 914కి తగ్గిపోయింది. ఏడాదికి సగటున పుట్టిన నెలలోపే చనిపయే అమ్మాయిల సంఖ్య పదిలక్షలు. 5 సంవత్సరాలలోపు 21 లక్షలు. ఒకవైపు ఆడపిల్లలు ఇలా చనిపోతుంటే మరొక వైపు పుట్టకముందే చిదిమేస్తున్నారు. అత్యాచారాలవలన కొంతమంది చనిపోతున్నారు. ఇలాగే జరిగినట్టు అయితే కొంత కాలానికి ఆడవారి సంఖ్య విపరీతంగా తగ్గిపోయే ప్రమాదముంది. కనుక అత్యాచారాలను అరికట్టడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.

ప్రస్తుతం ప్రపంచమంతా అన్నిరంగాల్లో అతివేగంగా ముందుకు సాగిపోతోంది. ఇప్పటికైనా మహిళలపై అత్యాచారాల, పురుషాధిక్య ధోరణి మారితే తప్పేముంది? స్ర్తి పురుషులకు సమాన హక్కులు వుంటే ఒరిగేదేమిటి? ఇప్పుడిప్పుడే ఇటీవలి కాలంలో కొంత కొంత సమానత్వం వచ్చిన మార్పు కనిపిస్తుంది. ఇంకా సమూలమైన మార్పుకోసం కృషి చేయడం తక్షణ అవసరం. మహిళలు ఉద్యమాలు చేసేది మగవారికంటే అగ్రస్థానంలోవ ఉండాలని కాదు. సమానస్థాయి కోసమేనని గుర్తించాలి. ఇలా చేస్తే కనుక సమాజంలో స్ర్తి స్థానం మారుతుంది. సామాజిక, శారీరక అంశాల్లో స్ర్తిలకు,పురుషులకు తేడాలున్న చట్టం ముందు పార్లమెంటరీ వ్యవస్థ ముందు అందరు సమానమే. అందుకే అలాంటి కీలక వ్యవస్థలో మహిళల పాత్ర, వాటి నిర్ణయాత్మకకంగా వుండాలంటే సమాన స్థాయి, సమాన హక్కులు ప్రభుత్వం కల్పించాల్సిందే. మహిళా సాధికారత లభిస్తే సమాజమంతా లాభపడుతుంది. వారి వారి కుటుంబాలు, పిల్లలు, సమాజంలోని ప్రజలు ప్రయోజనాలను పొందుతారు. అన్నిరంగాల్లోను ఉత్పాదకత, చైతన్యం పెరుగుతుంది.

శ్రీనివాస్ పర్వతాల