మెయిన్ ఫీచర్

రాజ్యాంగ రచనలో సేవలందించిన మహిళామణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పరిచేవారు సరిగా లేనప్పుడు, ఆ రాజ్యాంగం సరిగా ఉపయోగపడదు. అదేవిధంగా రాజ్యాంగం సరిగా లేకపోయినా దానిని అమలుపరిచేవాళ్లు సరైనవాళ్లు అయినప్పుడు అది దేశాభివృద్ధికి తోడ్పడుతుంది.
-డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
శతాబ్దాల పాటు పరాయి పాలనలో మగ్గిన భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి ఏడు దశాబ్దాలు దాటినా ప్రజాస్వామ్యదేశంగా మనుగడ సాగిస్తోందంటే అది మనం రాసుకున్న రాజ్యాంగ స్ఫూర్తిమంత్రం. మానవాళి చరిత్రలోనే ఇది మహత్తర విజయమే. ఈ విజయగీతికలో మేముసైతం అంటూ ఆనాటి రాజ్యాంగ రచనలో మహిళలు తమ సేవలు అందించారు. 389 మంది సభ్యులున్న రాజ్యాంగపరిషత్‌లో 15 మంది మహిళా ప్రజ్ఞావంతులను భాగస్వాములను చేశారు. వీరంతా స్వాతంత్ర సంగ్రామంలోనే సామాజికంగా తమ సేవలు అందించిన సేవాతత్పరులు. ఎవరు వస్తారో ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా మహిళలు తమ సమస్యలపై తామే గళమెత్తేలా స్వతంత్రంగా.. సాధికారిత దిశగా అడుగువేసేందుకు వీరు ఆనాడు రాజ్యాంగ పరిషత్‌లో చేసిన ప్రసంగాలే నిదర్శనం. వివక్షకు తావులేకుండా మహిళలు పాలనా రంగంలో పాదం మోపాలని ఆకాంక్షించారు. సామాజికంగా రక్షణ కల్పిస్తూ చట్టాలు అవసరమని నొక్కివక్కాణించారు. మహిళలను విద్యావంతులుగా తీర్చాదిద్దేలా రాజ్యంగ రూపకల్పన చేయటంలో వీరు అందించిన సేవలు నిరుపమానం. గత కొనే్నళ్ల నుంచి మహిళా సమస్యలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు, చట్టాలపై వాదోపవాదాలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆనాటి రాజ్యాంగంలో వీటిపై ఈ మహిళామణులు అందించిన నిరుపమాన సేవలను స్మరించుకోవటం మన బాధ్యత.

అమ్ము స్వామినాథన్
‘వ్యక్తి తన స్వేచ్ఛను దేశ ప్రయోజనాల కోసం వినియోగించాలి. దేశ స్వాతంత్య్రం ఎవరి ఇష్టం కోసమో, ఎవరి కోసమో వినియోగించరాదు’ అంటూ రాజ్యాంగ పరిషత్‌లో గళమెత్తారు. మహాత్ముని అడుగుజాడల్లో నడిచిన ఈ తరుణీమణి ఆనాటి స్వాతంత్రోద్యమ కాలంలో సామాజిక సేవకురాలిగా, రాజకీయవేత్తగానూ పనిచేశారు. రాజ్యాంగం చాలా స్థూలంగా, ప్రతిఒక్కరూ అర్థం చేసుకునే రీతిలో ఉండాలని అభిలషించారు. రాజ్యాంగం మహిళలకు ప్రసాదించిన సమాన హక్కులపై అమ్ముకుట్టి స్వామినాథన్ ఎన్నో సందర్భాలో ప్రశంసించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే రాజ్యాంగం సక్రమంగా అమలుచేయటం వల్లనే సాధ్యమని ఆమె విశ్వసించారు. రాజ్యాంగం మహిళలకు ప్రసాదించిన సమాన హక్కులపై అమ్ముకుట్టి స్వామినాథన్ ఎన్నో సందర్భాలో ప్రశంసించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే రాజ్యాంగం సక్రమంగా అమలుచేయటం వల్లనే సాధ్యమని ఆమె విశ్వసించారు. ‘వ్యక్తి తన స్వేచ్ఛను దేశ ప్రయోజనాల కోసం వినియోగించాలి. దేశ స్వాతంత్య్రం ఎవరి ఇష్టం కోసమో, ఎవరి కోసమో వినియోగించరాదు
అన్నీ మాస్కెరీన్
ఈ రాజ్యాంగం రాబోయే తరాల కోసం అని అంటారు అన్నీ మాస్కెరీన్. కేరళకు చెందిన ఈ స్వాతంత్య్ర సమరయోధురాలు ఉత్తేజకరంగా ప్రసంగాలు చేసేవారు. ట్రామెన్కోర్ స్టేట్ కాంగ్రెస్‌లో తొలి మహిళ. జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఈమె చేసే ప్రసంగాల వల్ల ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తిన సందర్భాల్లో బ్రిటిషు సైనికలు హడలిపోయేవారు. స్వతంత్ర భారతదేశంలో కేరళ నుంచి ఎన్నికైన తొలి పార్లమెంటు సభ్యురాలు. 1951 సాధారణ ఎన్నికల్లో గెలిచారు. కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని మాస్కెరీన్ విశ్వసించారు.
బేగం అజీజ్ రసూల్
రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళ. చట్టాల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉంది. పలు దేశాల రాజ్యాంగాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. స్విస్ రాజ్యాంగానికి ఈమె మద్దతు పలికారు. కామనె్వల్తు దేశాలలో భారతదేశం సభ్యదేశంగా ఉండాలని ఆకాంక్షించారు. దేవనగరి లిపిలో మంచి పట్టు ఉంది. రాజ్యాంగంలో ప్రాధమిక హక్కులకు ఉన్న పరిమితులపై ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాధమిక హక్కులు, నిర్దేశిక సూత్రలు రాజ్యాంగం ఆత్మవంటివి అని భావించేవారు. రాజ్యాంగం ఏ ఒక్క పార్టీ, గ్రూపుకో అనుకూలంగా ఉండరాదని భావించారు. రాజ్యాంగ పరిషత్‌లో ఆమెది ఒక బలమైన గొంతుక. రసూల్ చేసిన ప్రసంగాలు, ఆలోచనలు, దీర్ఘకాలిక దృష్టి, ఆశావాదం తదితర అంశాలు అనేక సందర్భాల్లో వెల్లడయ్యాయి. స్వాతంత్య్రానంతరం అనేక పదవులలో ఆమె కొనసాగారు. వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. భారత మహిళా హాకీ సమాఖ్య అధ్యక్షురాలిగా 20 ఏళ్లపాటు పనిచేశారు. ఆమె చేసిన సామాజిక సేవకుగాను పద్మశ్రీ అవార్డు వరించింది.
ద్రాక్షాయణి వేలాయుధన్
రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న దళిత మహిళ. దేశంలోనే గ్రాడ్యూయేషన్ చేసిన తొలి దళిత మహిళ కూడా. అస్పసృశ్యతను తీవ్రంగా వ్యతిరేకించారు. స్వతంత్ర దేశంలో కులవివక్షత అనే జాఢ్యానికి తావు వుండరాదని విశ్వసించారు. వివక్షతకు తావులేకపోతే ఇక దళితులకు రిజర్వేషన్లు ఎందుకు అని వాదించారు. దళితులకు సాంఘిక హోదా ఇవ్వటంలో బ్రిటిషు ప్రభుత్వం చేసిందేమి లేదని ఆనాటి స్వతంత్ర సంగ్రామంలో ఎలుగెత్తిచాటారు. బ్రిటిషు చట్టాలు చప్రాసీలను తయారుచేయటానికే ఉపయోగపడ్డాయని చాటిచెప్పారు. ఫెడరల్ స్ఫూర్తి ఉండాలని ఆకాంక్షించారు.
దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్
అతి పిన్న వయసులో స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ధీరవనిత. న్యాయ వ్యవస్థ స్వచ్ఛగా పనిచేయాలని ఆకాంక్షించారు.న్యాయమూర్తులు, గవర్నర్ల నియామకానికి సంబంధించిన విషయాలను రాజ్యాంగంలో పొందుపరచటంలో కీలక భూమిక పోషించారు. పిల్లలు, మహిళల సంరక్షణకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలని భావించారు. జాతీయ భాషపై చర్చ జరిగేలా ఒత్తిడి తీసుకువచ్చారు. లోకసభ సభ్యురాలిగా పనిచేశారు. ప్లానింగ్ కమిషన్‌లో పనిచేశారు. పాల్ జి.హాఫ్మాన్, నెహ్రు లిటరసీ అవార్డు, యునెస్కో అవార్డును సొంతం చేసుకున్నారు. పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు.
హన్సామెహతా
స్వాతంత్య్ర సమరయోధురాలు. జైలుకు కూడా వెళ్లారు. విద్యావతి. పలు సంస్థల్లో పనిచేశారు. అనేక ఇంగ్లీషు పుస్తకాలను గుజరాతీలోకి అనువదించారు. మహిళకు రిజర్వేషన్లు లేకుండా సమానత్వం, సాభ్రాతత్వం కావాలని ఆకాంక్షించారు. మధ్యపానం, అవినీతి తదితర అంశాలకు సంబంధించిన చట్టాలపై ఎన్నో ప్రతిపాదనలు చేశారు. మానవ హక్కుల కమిషన్‌కు వైస్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. హన్సామెహతాను కూడా పద్మవిభూషణ్ వరించింది.
పూర్ణిమా బెనర్జీ..
ప్రభుత్వ పాఠశాలల్లో మతపరమైన వివక్ష అనేదానికి తావు ఉండకూడదని విశ్వసించారు. రాజ్యాంగంలో ప్రగతిశీల పన్ను వ్యవస్థకు, విద్యా ప్రణాళికకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని వాదించారు. చట్ట సభల్లో మహిళలకు చెందాల్సిన సీట్లు వారికే కేటాయించాలని కోరినవారిలో పూర్ణిమ బెనర్జీ ఒకరు. ఉన్నత స్థానాల్లో పనిచేసేవారికి సర్వీసు నిబంధనలు ఉండాల్సిన అవసరం ఉందని భావించారు.
రేణుకా రాయ్
పద్మభూషణ్ పురస్కారాన్ని పొందిన రేణుకారాయ్ కూడా మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అవసరం లేదని అన్నారు. విజయలక్ష్మి పండిట్ వలే మహిళలు తమ శక్తి సామర్థ్యాలు, ప్రతిభతో రాణించాలని ఆకాంక్షించారు. రిజర్వేషన్లు మేథస్సు, సామర్థ్యానికి అవమానకరమైనవని భావించారు.
సరోజనీ నాయుడు
జగమెరిగిన ఈ భారతకోకిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాజ్యాంగ పరిషత్‌కు కొంతమంది ముస్లిం సోదరులు రానందుకు ఆమె ఎంతోగానో బాధపడ్డారు. అనేక దేశాలు పర్యటించారు. రాజ్యాంగంలో జాతీయ జెండా ప్రాధాన్యతను పొందుపరచాలని ఆకాంక్షించారు.
విజయలక్ష్మి పండిట్
మైనార్టీల గురించి గళం విప్పిన వనిత. మన దేశంలో ఏ మైనర్టీ కూడా ఇతరుల సాయం కోసం ఎదురుచూడకుండా స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్రానంతరం కేబినెట్ స్థాయి పదవిని చేపట్టిన తొలి మహిళ. హక్కులతో పాటు బాధ్యతలు కూడా సమాన స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. ఈ దేశంలో వీచే స్వేచ్ఛావాయువులు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు. స్వాతంత్య్రానంతరం దౌత్య సేవలను అందించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. వీరితో పాటు సుచిత్రకృపలానీ, మాలతి చౌదరి, లీలారే, రాజకుమారి అమృతకౌర్ వంటివారు కూడా రాజ్యాంగ రచనలో తమ తోడ్పాటునందించారు.

-టి.ఆశాలత