మెయిన్ ఫీచర్

సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందుడిందు బరమేశ్వరుడెవ్వడు మూల కారణం
బెవ్వడనాదిమధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్
ఈ లోకం ఎవని వల్ల పుడుతుందో, ఎవనితో కలసి ఉంటుందో ఎవని లోపల లయం పొందుతుందో ఎవడు పరమాత్ముతో ఎవడు ఈ విశ్వానికి మూలకారణమో ఎవడు పుట్టడం, గిట్టడం, పెరగడమూ లేకుండా ఉంటాడో ఎవడు అన్నీ తానేయై ఉంటాడో అటువంటి ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు కోరుతాను అన్న గజేంద్రుడిలాగే మనమూ భగవంతుని శరణు కోరాలి. అసలా భగవంతుని గురించి తెలుసుకోవాలంటే గురువు కావాలి. గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు కదా. గురువుఅనే కాగాడపట్టుకుని వెతికితే ఫెంజీకటికావల ఉన్న దివ్యమైన భవ్యమైన వెలుగు మనకు కనిపిస్తుంది. ఆ కాగాడానే రమణ మహర్షి...
‘‘్భగవత్ప్రేను ఎల్లలు లేనిది. పరిపూర్ణమైనది. కాగా, జ్ఞానేంద్రియాలుగా పేరు పెట్టుకున్న ఇంద్రియాలందించేది మాత్రమే జ్ఞానంకాదు. అది అందుకోలేనిది, అతీతమైనది, అంతర్భోధాత్మకమైన ఆత్మబోధే అసలైన జ్ఞానం’’ కనుక రమణ మహర్షులు ఇలా చెప్పారు. మనిషి ఏ దేశం వాడైనా, ఏ మతంవాడైనా, ఆస్తికుడైనా, నాస్తికుడైనా వారికి ‘నేను ’ అనే భావన ఉంటుంది. నేను నేను అనడం అహంభావానికి మారుపేరు అంటారందరూ. కాని, అది అంత తప్పేమీ . కాని, నేను అనేది ఆ పేరు, ఊరూ శరీరానికి సంబంధించింది. దీనిని వదులుకొని అదే ‘నేను’ను పట్టుకుని మూలందాకా వెళ్లండి. అసలు విషయం తెలస్తుంది- రమణ మహర్షి. అలా అలా వెళ్ళగా ‘నేను’ పోయి ‘తాను’ దర్శనమిస్తుంది. ఆ ‘తాను’ అంతరాత్మ. అది తెలుసుకోవడానికి ఆత్మవిచారణ చేయాలి. శ్రీరమణుల ముఖ్యమైన ఉపదేశం ఇదే. ఇంద్రియాలకతీతమైనది ఒకటి ఉంది. అదికంటికి కనిపించదు. అది పట్టుకోవడానికి ఆత్మవిచారణమే సాధనం. ఆ సాధనతో దానిని సాధించవచ్చు. అపుడు గజేంద్రుని రక్షించిన పరమేశ్వరుడు మనకూ కనిపిస్తాడు. ‘స్వయం తీర్ణః పరాన్ తారయతి’-అని పూర్వులు అన్నారు. తాను తరించిన వాడు ఇతరులను తరింపచేయగలడని అర్ధం. కనుక భగవంతుడిని తను చూస్తే ఇతరులకూ చూపించగలరు.