మెయిన్ ఫీచర్

ఏంటీ మళ్లీ అమ్మాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శక్తి, వీరత, ధైర్యం, ఓర్పు, సహనం, జాలి, దయ వంటి గొప్ప విలక్షణ లక్షణాలన్నీ కలబోస్తే మహిళ అవుతుంది. పవిత్రమైన భారత పురాణాలు, ఇతిహాసాల్లో చరిత్ర, జానపదం, సాంఘిక పుస్తకాల్లో కూడా భారతదేశం ఎల్లప్పుడూ మహిళలను పూజించింది, గౌరవించింది. పురాణాలలో ఎందరు స్ర్తిలు యుద్ధాలు చేయలేదు? పార్వతీదేవిని శరణుకోరిన వెంటనే దుష్టశక్తులను ఓడించటానికి అత్యంత శక్తివంతమైన దుర్గ అవతారమెత్తి, మహిషాసుర దుర్మార్గాన్ని తుడిచిపెట్టింది. మొత్తం మానవజాతికి అభయం ప్రసాదించింది. దశరథ చక్రవర్తి మువ్వురు భార్యలలో ఒకరైన రాణి కైక నైపుణ్యంగల యోధురాలు, తెలివైన సలహాదారు. సత్యభామా అనే పేరు విన్నప్పుడు మన మనస్సుకి ఏం జ్ఞప్తికొస్తుంది? దీపావళి టపాకాయలు కాదు, దుష్ట వినాశనం, నరకాసుర వధ. అర్జునుడు భార్యలలో ఒకరైన చిత్రాంగద, పురాతన మణిపూర్ రాజ్యం యువరాణి, ఆమె మణిపూర్ సైన్యాధిపతి. ఇలా పురాణాలు వీరనారీమణుల ప్రాముఖ్యతను వివరించాయి. ఇప్పుడు కార్పొరేట్‌సంస్థలు, బహుళజాతి కంపెనీలు, మానవ వనరుల విభాగాలు అదేదో కొత్తగా ‘డివెర్సిటీ అండ్ ఇంక్లూషన్’ అని కొత్త రాగాన్నందుకున్నాయి. ప్రముఖ హిందూ ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతం ఎప్పుడో వైవిధ్యం ప్రాముఖ్యతను మనకి శిఖండి పరిచయం ద్వారా చేయడం విశేషం కదూ?

ఇనే్నళ్ల తరువాత కొత్త్భారతదేశం మహిళల పటిమ, సంభావ్యత గుర్తించింది అసమతుల్యతను పరిష్కరిస్తోంది, నెమ్మదిగా అయితేనేమి. ఈనాటి మహిళలు పురుషులకు అన్ని విషయాలలో సమానంగా వుంటున్నారు. చదువులలో, ఉద్యోగ, వ్యాపార రంగాలలోనే కాకుండా భారతదేశ అంతర్గత మరియు బాహ్య భద్రతలో శిఖర స్థాయిలోని ఉద్యోగాలు చేరుకోవడానికి విజయవంతం అవుతున్నారు. ఇటీవల జరిగిన మహిళల అభివృద్ధి, పరిణామాలు బట్టి మహిళలు తమ అభిరుచి, సామీప్యత, పట్టుదల, వివేకంతో యావత్ ప్రపంచం గర్వపడేలా చేస్తున్నారు.
భారత తొలి పూర్తి సమయ మహిళా రక్షణ మంత్రిగా శ్రీమతి నిర్మలా సీతారామన్ నియామకం హర్షణీయం, సంతోషకరమైనది,గర్వకారణమైనది. ఇటువంటి సానుకూల వార్తలు భారతదేశం మహిళలపట్ల గౌరవం, మహిళా సాధికారతకిచ్చే ప్రాముఖ్యతను చాటిచెప్పేయి. ఒకప్పుడు వంటింటి కుందేళ్లుగా అభివర్ణించిన మహిళలను ఇటీవల కాలంలో భారతదేశంలో మహిళలు మాతృభూమిని కాపాడే, రక్షించే పాత్రల్లో ఏమి అడ్డంకులు లేకుండా నియమిస్తున్నారు. గత ఏడాది ఇస్రోలో రాకెట్ మహిళల శాస్తవ్రేత్తలు మార్స్ చుట్టూ కక్ష్యలో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. గత సంవత్సరం, భారత దళాలు, మహిళలను కొడా యుద్ధంలోకి అనుమతించాయి. మహిళా యుద్ధ విమాన పైలట్లను నియమించాయి. అంధురాలైన అమ్మాయిని ఇండియన్ ఫారిన్ సర్వీస్ చేర్చుకొంది. దశాబ్దాల క్రితమే నాసా స్పేస్ షటిల్ కార్యక్రమం కోసం మన భారత సంతతకి చెందిన వనితలు కల్పనా చావ్లా మరియు సునీతా విలియమ్స్‌ను ఎంపిక చేసింది. పునీత అరోరా, పద్మావతి బందోపాధ్యాయలు సైన్యం, నౌకాదళంలో అత్యధిక ర్యాంకులను ధరించారు.
వీరనారుల గాథలెన్నో మన చరిత్ర పదే పదే ఏకరువు పెట్టింది. బాధలలో వున్న సిండ్రిల్లా లాంటి సుందరుల గూర్చి అనేక జానపద కథలు, నీతి కథలు, కామిక్స్, బాలల పుస్తకాలు చదివాం. వెండితెరకి కూడా ఎక్కించారు. దురదృష్టవశాత్తు, ఎక్కువ సినిమాలు భారతీయ చరిత్ర మహిళలను ఖరీదైన పట్టువస్త్రాలను, నగలను ధరించిన పట్టపురాణుల ప్రేమ వ్యవహారంగా చూపించారు. రాజరికం ఐశ్వర్యం, రాజవైభవము లేదా పేదరికం, బానిసత్వం మరియు అబలగా చూపేవి. అయితే, రాజరికపు సంతతిలో అందరు మహిళలు మెరిసే పట్టు దుస్తులను, నగ నగలాడే బంగారు ఆభరణాలు ధరించలేదు.
భారతదేశం స్వాతంత్య్రానికి మునుపు, కొంతమంది మహిళా యోధురాళ్ళు తమ ధైర్యం, సాహసం తెలివితేటలుతో సైనిక వ్యూహాలను పన్ని యుద్ధాలు చేసి తమ రాజ్యాల రాత మార్చినవారుగా చరిత్రకెక్కారు. వారు వారి వంశ వారసత్వంగా రాజకీయ చతురత, శక్తి సామర్థ్యం పొంది కత్తి చేతబట్టేరు.
యుద్ధ్భూమిలో అలనాటి వీరవనితల శౌర్యం, పరాక్రమాన్ని ప్రదర్శించి పోరాడినవారి గురించి చదవని భారతీయులు అరుదుగా వుంటారు. ఝాన్సీరాణి, ఢిల్లీకి చెందిన రజియా సుల్తాన్, బీజాపూర్ నుంచి చాంద్ బీబీ, కాకతీయ రాజ వంశానికి చెందిన రాణి రుద్రమదేవి, గోండ్ రాజ్యంలోని రాణి దుర్గావతి, అవధ రాజ్యంలో బేగం హజ్రత్ మహల్, పంజాబ్ ప్రాంతపు బీబీ సాహిబ్ కౌర్ మరియు మాయాభాగో- వీళ్లందరూ స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి, సార్వభౌమ రాజ్యం కోసం విస్తృత దృష్టి కలిగిన రాణీలు. ఈ వీరనారీమణులు, ఆంగ్లేయులు, మొఘలులు, మంగోల్స్ రాయల్స్, తైమూర్, టర్కిష్ సంతతి వారి నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. భారతీయ జోన్ ఆఫ్ ఆర్క్‌గా ప్రశంసింపబడిన రాణి లక్ష్మీబాయ్ ధైర్యవంతురాలు, గొప్ప యోధురాలు. 1857 సిపాయిల తిరుగుబాటులో ఆమె పాత్ర, సహకారం అపారం, చిరస్మరణీయం. దురదృష్టవశాత్తు ఆ వీరనారులలో చాలామందిని శత్రుసేనలు ఉరితీయడం లేదా హింసించి చంపడం జరిగింది.
భారతదేశ పురాణాలు, ఇతిహాసాలలో దుర్గ, సత్యభామ లాంటి పుణ్యస్ర్తిలు, వీరనారీమణుల గాథలు విన్నాం. కానీ స్వాతంత్య్రం వచ్చాక కొన్ని దశాబ్దాలు నిద్రపోయాం. ఈమధ్య మళ్లీ గాఢనిద్ర నుండి మేల్కొని అత్యంత అద్భుతమైన శారీరక భౌతిక పరిమితులను, అడ్డంకులను సవాళ్లుగా తీసుకొని తమ మేధస్సు, శక్తి సామర్థ్యాలని నిరూపించుతున్నారు.

ఈ దౌర్భాగ్యం ఎందుకొచ్చింది?
అవును, ఈ రోజు ఈ దౌర్భాగ్యం ఎందుకొచ్చింది అసలు. ఎక్కడ చూసినా ఆడపిల్లలే కావాలి, పెళ్లికూతుర్లుగా, పాపం మగపిల్లల తల్లిదండ్రుల బెంగ చూస్తే బాధగా వుంటుంది. చరిత్ర తలక్రిందులవ్వలేదా? 1970ల వరకు ఇంటికి కనీసం ఆరుగురు ఆడపిల్లలు వుండేవారు. మధ్యతరగతి అయినా బీదవారైనా తల్లిదండ్రులు వాళ్ళందరికీ నానా బాధలు పడి ఓ అయ్య చేతిలో పెట్టి బాధ్యత తీర్చుకొనేవారు. అంతేకానీ ఎనిమిది మంది ఆడపిల్లలు ఉన్నాక కూడా తొమ్మిదోసారి ఆడపిల్లపుట్టిందని కిరాతకంగా చంపేసేవారు కాదు. పిండం తొలగించేవారు అసలు కాదు. ఇక 80లలో అనగా మేమిద్దరం - మాకిద్దరు అనే నినాదం పుట్టుకొచ్చిన రోజుల్లో మాకు ఒక ప్లస్ ఒక మైనస్ లేదా మాకు రెండు మైనసులు అని దీనంగా, లేదా మాకు ఇద్దరూ ప్లస్సులే కొంచెం గర్వంగా.. ఇలా అనడం వింటూండేవాళ్లం. ఇప్పుడు చూస్తే ఆ ట్రెండ్ కాస్త తిరగబడి అందరికీ ఆడపిల్లలు తమ పుత్ర రత్నాలకోసం కావాలి. ఇదీ వరుస.
భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో తల్లుల హృదయలాను స్వార్థపూరితమైన ఆసక్తుల స్వార్థపూరిత ఉద్దేశ్యాలవల్ల కఠిన హృదయాలు పక్షపాత ధోరణితో చీల్చి చెండాడుతున్నాం. ఈ రోజు మహిళలు ఉన్నత స్థానానికి చేరుకొని యుద్ధ పోరాట పాత్రలతో సహా ప్రతి విభాగంలో తమను తాము రుజువు చేసుకొంటున్నప్పటికీ ఆడపిల్లలు పుట్టడం ఒక శాపంగా భావించేవాళ్ళు ఇంకా ఉన్నారు. అదొక సామాజిక రుగ్మత.
మన సమాజంలో ఇప్పటికీ భ్రూణహత్యలు పెరుగుతున్న సంఘటనలున్నాయి. ఇవి హేతుబద్ధమైన హత్యలే కాక కిరాతకమైన చర్యలు. గణాంకాల సమాచారం ప్రకారం దేశమంతటా లైంగిక నిష్పత్తులు వక్రంగా ఉన్నాయి. ఫలితంగా మహిళలు, పిల్లలపై జరిగిన నేరాలు విపరీత స్థయిలో పెరుగుతున్నాయి. ఇలా అయితే ఒకప్పుడు బహుభార్యాత్వంలాగా ఒకే స్ర్తిని బహుపురుషులు వివాహం చేసుకొనే గడ్డు రోజులున్నాయేమో! పరిస్థితి చెయ్యి దాటకముందే ప్రభుత్వం కొన్ని కఠిన చట్టాలు చేసి శిక్షలు వేయాలి. ఈ అండర్‌గ్రౌండ్ క్లీనికల్ వ్యవహారాలను వెలికితీసి అణచివేయాలి. సినీ తారలతో గూడిన ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’ లాంటి సృజనాత్మక ప్రచారాలు మంచివే కావచ్చు కానీ సమస్యను పరిష్కరించడానికి అంతగా సహాయం చేయకపోవచ్చు. అలాంటి దుర్వినియోగ నేరాలతో వ్యవహరించడానికి ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖలో రెగ్యులేటరీ మండలితో తనిఖీలు చేయించి వెలికితీయాలి.
1985లో మహిళా సంఘాలు మరియు సామాజిక సంస్థలు కలిసి ఎగనెస్ట్ సెక్స్ ప్రిడిటర్మినేషన్ అడ్ సెక్స్ ప్రీ సెలెక్షన్ అనే ఫోరంను (ఎఫ్‌ఎఎస్‌డిఎస్‌పి) ఏర్పాటుచేశారు. భ్రూణహత్యలు అంతం చేయడానికి తక్షణమే ప్రభుత్వం ఒక చట్టాన్ని చేయాలని కోరాయి. ఎట్టకేలకు 1994లో ప్రీ కనె్సప్షన్ అండ్ ప్రీ నాటల్ డయగ్నొస్టిక్ టెక్నిక్స్ చట్టం అమలులోకి వచ్చింది. ప్రీ నటల్ సెక్స్ పరీక్షలు నిషేధించింది. ఏదేమైనా రెండు దశాబ్దాలుగా ఈ చట్టం సమర్థవంతంగా అమలు చేయలేదు.

భారతదేశంలో పిల్లల లింగ నిష్పత్తి 1961లో 976, 1971లో 964, 1981లో 962, 1991లో 945, 2001లో 927, 2011లో జనానా లెక్కల ప్రకారం సేకరిచిన సమాచారం ప్రకారం 014కు స్థిరంగా క్షీణించింది. కఠినమైన చట్టాలు, సాంఘిక సంస్కరణలు స్థానంలో ఉన్నప్పటికీ భ్రూణహత్యలు, గర్భస్రావాలు కొనసాగుతున్నాయి. అత్యధిక పిల్లల లింగ నిష్పత్తి మిజోరాంలో 971 ఉండగా హర్యానాలో 830 దేశంలోనే కనిష్ఠ స్థాయిలో చివరి స్థానంలో ఉంది. ఇది తీవ్రమైన ఆందోళనకరమైన విషయం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 923 మరియు పట్టణ ప్రాంతాల్లో 905 పిల్లల లింగ నిష్పత్తి, మరియు తెలుగు రాష్ట్రాలలో 943 ఉంది. దీనివల్ల హర్యానాలో పెళ్లికొడుకులు వధువుల కోసం దేశవ్యాప్తంగా గాలిస్తున్నారు.

దేశమంతా గణతంత్ర పండుగ చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో సరిహద్దు భద్రతా దళాల మహిళలు మోటార్ సైకిల్స్‌పై ఫీట్స్ చేసి మొత్తం ప్రపంచానే్న అబ్బురపరిచారు.
‘‘అబ్బా ఏమి చేస్తున్నారు, వీళ్ళు ఆడవాళ్ళు కాదు ఆదిపరాశక్తులు’’ అని వేనోళ్ల పొగిడారు.
అవును నిజమే, ఆ దళం పేరు కూడా ‘సీమా భవాని’ అని పెట్టేరు. 113మంది ఉన్నారు, దుర్గాస్తోత్రంలో శ్లోకాల సంఖ్య కన్నా ఐదుగురు ఎక్కువున్నారు, అంటే లక్ష్మీ, సరస్వతి, గాయత్రి, సత్యభామ, సీత దేవతలు కూడా ఉన్నారు.
‘‘ఆ మోటార్ సైకిల్‌మీద నిలబడి వస్తున్నావిడని చూడండి, దుష్టశక్తులను, దురాగతాలనుండి కాపాడి, నీతి, న్యాయం, స్వచ్ఛమైన స్వాతంత్య్రం, ఆనందం, స్వేచ్ఛ కల్పిస్తానని అభయహస్తం ఇస్తూ దివ్య మనోహరంగా సింహంమీద కాలుపెట్టి నిలబడిన అపర కాళిలా కనిపించింది.

- సునీల్ ధవళ