మెయిన్ ఫీచర్

ఆడపిల్ల రక్షణ అరణ్యరోదనేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలనే ప్రపంచ బాలికల దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఎంత సిగ్గనిపించిందో?! ఏ పూటకాపూట, ఏ దినానికి ఆ దినం ఆ బాలికల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు పెచ్చు పెరిగిపోతున్న ఈ నవ సమాజంలో వావి వరుసలు, వయస్సుతో తేడా లేకుండా పసిబిడ్డపై అమానుష ప్రవర్తన, దాని పర్యవసానంగా చంపడం, కాల్చడం వంటివి జరుగుతున్నాయి. ఆడపిల్లను ఏ స్కూలు, ఏ బస్సు, ఏ ఉపాధ్యాయుడు వద్దకు పంపాలో తెలియక, పిల్లలు సురక్షితంగా ఇంటికి వచ్చే వరకూ తల్లిదండ్రులకు గుండెల్లో గుబులు. ముభావంగా మూలకు ఒరిగిపోయి, అన్నం సయించక ఖిన్నులై తమకు జరుగుతున్న అఘాయిత్వాన్ని తల్లిదండ్రులకు, స్నేహితులకు, పొరుగువారికి, యజమాన్యానికి కూడా చెప్పుకోలేక, తమకెందుకిలా వేదన, చెబితే చంపేస్తానన్నాడు ఆయన, మీ అమ్మానాన్న, తోబుట్టువులను లేపాస్తాం అంటాడు. ఆయన ఎవరు? కంచే చేను మేసినట్లా? మరి ఆ చిన్నారి భవిష్యత్తు, ఆ లైంగిక దౌర్భాగ్య చర్య పర్యవసానం?!
ఈ పైశాచిక ప్రవృత్తిని ఎలా అరికట్టడం? ఆ పశువులకు శీలం, నడవడిక, మనోనిగ్రహం, పరివర్తనకు ప్రయత్నిస్తే.. ఆ యువ వనరులను సన్మార్గంలో నడిపించటం పెద్ద కష్టం కాదు. మన హృదయంలో మనం పుట్టగానే భగవంతుడు ఉన్నాడని, మనస్సాక్షితో మెలగాలని, సమాజంలో తలెత్తుకు తిరిగే ప్రవర్తన, సానుభూతి, దయ, సాటివారికి సాయం చేయాలన్న ప్రవృత్తి, భగవంతుని ప్రార్థన, ధ్యానం, యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి ప్రక్రియలను బాలబాలికలకు నేర్పడం మన కర్తవ్యం. వారిలో సమస్థితిని పెంచాలి. తల్లిదండ్రులు బిడ్డలను గమనిస్తుండాలి. ఇరువురూ ఉద్యోగస్తులైనా, అలాంటి నిఘా, పర్యవేక్షణ పిల్లల పట్ల చేయలేకపోతున్నామని వాపోవడం సబబుకాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు. నేటి పక్కదోవలు తొక్కుతున్న సమాజంలో భవిష్యత్తు నిర్మాతలని గ్రహించండి. పిల్లల ఆలోచనలు, మాటలు, చర్యలు, అలవాట్లు వారి నడవడిక వారి భవిష్యత్తుకు పునాదులు. వేన్నీళ్లకు చన్నీళ్లుగా శ్రమిస్తున్న విషయం ఎంత వాస్తవమో వారిని పర్యవేక్షిస్తూ చక్కదిద్దకపోవడం అంత అన్యాయం.
తొమ్మిది నుంచి పదమూడేళ్ల బాలికలు యథేచ్చగా పబ్బుల్లో పాల్గొని మాదక ద్రవ్యాలు స్వీకరించటం, పోలీసువారి కనుగప్పి గోడదూకి పారిపోవడం హతాశులను చేస్తోంది. పాకెట్ మనీ ఇవ్వండి. విచ్చలవిడి అలవాట్లు పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, సమాజంలో తలెత్తుకు మనగలిగేలా తీర్చిదిద్దండి.
ఎంతసేపూ బాలికల వేషధారణ ఆకర్షణలకు లోనుచేస్తున్నదని, డ్రెస్‌కోడ్ అంటూ నినాదాలు చేస్తున్నారు కానీ మరి చిన్నారుల వేషమూ? మరి అలాంటి లైంగిక చర్యలను ప్రేరేపించేది ఏమిటి? ఆత్మవిమర్శ చేసుకోవాలి. బాలికాదినోత్సవం అంటూ కంటితుడుపులు వద్దు. దేశం ప్రగతి ఆడబిడ్డమీద కూడా ఆధారపడిందని, వారి సంరక్షణ, వారి భద్రత మనందరి బాధ్యత.

- పరిమి శ్యామలా రాధాకృష్ణ