మంచి మాట

జ్ఞానదీపము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవుడు ఈశ్వరుని అంశ. కాననే అతడు శాశ్వతుడు, చేతనుడు, నిర్మలుడు, స్వభావతః సుఖములకు నిధానముగా ఉంటాడు. జీవుడు మాయకు వశుడై చిలుకవలె, కోతివలె తనకు తానుగా బంధాలలో చిక్కుకుంటాడు. బాధలు అనుభవిస్తూ వుంటాడు. ఈ రీతిగా జడము చేతనములు ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయి. అసత్యమైన ఆ ముడి నుండి బయటపడి ముక్తిని పొందుట ఎంతో కష్టము. అపుడు జీవుడు జనన మరణ చక్రములో చిక్కుపడును. ఆ ముడి విడువదు, సుఖములూ కలుగవు. వేద పురాణాదులలో వీటికోసం ఎన్నో ఉపాయములను జగతికి అందించినవి. ఎంత జ్ఞానమబ్బినా ఆ ముడినుండి విముక్తి లభింపదు సరికదా అది యింకనూ గట్టిపడుతుంది.
ఈ విషయ పరిష్కారానికి ఈశ్వరానుగ్రహమున పరిస్థితులు అనుకూలించినచో ఆ ముడి విడిపోవుట జరుగుతుందని శ్రీరామ చరితమానసము ఉత్తరాకాండలో శ్రీ తులసీదాసు తమ దివ్య రచన ద్వారా జగతికి వెల్లడించారు. జ్ఞానదీపము లేక జ్ఞాన జ్యోతి దివ్య ప్రకాశం చెందవలెనన్న ప్రతిజీవుడు భక్తి మార్గముననుసరించి సాగాలి. భక్తి మహిమను తెలిసికొని అనుసరించాలన్నారు.
పరమశివుడు పార్వతీదేవికి జ్ఞానదీప వైశిష్ట్యాన్ని, భక్తి మార్గ అనుసరణను చక్కగా ఉపదేశించారని తులసీదాసు వివరించారు. భగవత్ కృపచే సాత్విక శ్రద్ధను జీవుడు హృదయంలో నింపుకోవాలి. ఇది వేదోక్తమైన జప, తప, వ్రత నియమాది కల్యాణప్రదమైన ధర్మాచరణమని తెలిపారు. ఆస్తిక భావాలను ఎదలో పదిలపరచుకోవాలి. విషయ వాసనా ప్రపంచమునుండి ముక్తి పొందే ప్రయత్నంలో భక్త్భివంతో జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి. నిష్కామ కర్మలను ఆచరించాలి. తత్త్వ విచారము, ప్రసన్న భావం, మధుర వచనములతో నిరంతరం జీవులు సంచరిస్తూ వుండాలి. తద్వారా వైరాగ్యమును జీవుడు పొందగలడు.
పరమేశ్వరుడు పార్వతీదేవి సందేహమును తీర్చడానికి భక్తి, జ్ఞాన మార్గముల తారతమ్యమును విశదీకరిస్తూ, రామాయణంలో జ్ఞానియైన కాకభుశుండి-ఖగరాజు సంవాదమును వివరించాడు. భక్తిజ్ఞానములలో భేదమేమియును లేదు. ఈ రెండునూ జీవుల సంసారిక దుఃఖములను బాపును. జ్ఞానము- వైరాగ్యము- యోగము- విజ్ఞానము ఇవి పురుష వర్గానికి చెందినవి. పురుషుల యందు ప్రతాపము ప్రబలమై యుంటుంది. ‘మాయ’ అనునది స్ర్తి సమూహమునకు చెందినది. స్వభావతః స్ర్తి ప్రకృతి స్వరూపిణి. ఆమె అబల- జడము అనే భావనలో వుంటారు.
వైరాగ్యవంతులు- ధీరులు- బుద్ధిమంతులైన పురుషులు ఏ స్ర్తి ఆకర్షణలకు లోనుగారు. కాముకుడైనవాడు స్ర్తికి అధీనుడై వుంటాడు. అట్లే జ్ఞానులైన మహర్షులు గూడా ‘మృగనయన’యు, చంద్రముఖియు అయిన స్ర్తిని గాంచి ఆమెకు అధీనులౌతారు. విష్ణుదేవుని మాయేయే సాక్షాత్తు స్ర్తి రూపంలో ప్రకటితవౌతుంది.
మాయ- భక్తి ఈ రెండును స్ర్తి వర్గానికి చెందినవని శాస్త్ర వచనము. రామచంద్రునికి ప్రియమైనది భక్తి. మాయ కేవలం ఒక నర్తకి మాత్రమే. శ్రీరాముడు భక్తిని విశేషంగా ఆదరిస్తాడు. మాయ ఆయనకు భయపడుతుంది. మునులు విజ్ఞానులై జ్ఞాన జ్యోతి కాంతులలో సమస్త సుఖములకు నిధానమైన, ఖనియగు భక్తి మార్గము వైపే మొగ్గుచూపుతారు. జ్ఞాన భక్తిమార్గములు అవిచ్ఛిన్నమైనవి. వీటి విషయాలను ఆకళింపు చేసికొని ఆ మార్గములో పయనించువారికి అఖండ భక్తి జనిస్తుంది. ఇది అనుభవైకవేద్యం. భక్తి జ్ఞానములచే లభించిన వైరాగ్యమనే వెన్నను యోగాగ్నియందు శుభాశుభ కర్మలనెడి ఇంధనములతో కాచవలెను. అపుడు ‘మమత’యనే మురికిపోయి జ్ఞానమనే నేయి మిగులుతుంది. ఈ రీతిగా తత్త్వజ్ఞానమనెడి తేజోమయ దీపమును వెలిగించినచో జీవులలోని అరిషడ్వర్గములు మాడిపోతాయి. తద్వారా పరబ్రహ్మమే నేను భావం జనించి అఖండ జ్యోతి అవుతుంది. అదియే జ్ఞాన దీపం యొక్క ప్రచండ దీపశిఖ. ఆత్మజ్ఞాన ప్రకాశం కల్గుతుంది. తమస్సు నశించి వెలుగును అందిస్తుంది. పరిపూర్ణ రామభక్తియే తరుణోపాయం.

-పి.వి.సీతారామమూర్తి