మంచి మాట

మధుర భాషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి స్థాయి ఏమిటో అతని మాటలవలన ఎరుగగలరు. అధికముగా మాట్లాడిన వదరుబోతని, మాట్లాడనిచో ముంగి అని అందురు. జ్ఞానులు మితభాషిణులు, మూర్ఖులు అతి ప్రసంగము చేయుదురు.
సానుభూతి సంభాషణ బాధను తొలగించును. మాటలో కాఠిన్యము సరికాదు, పనికిరాదు. మాటలలో వెలువడు పరుష వాక్యాలు ఎన్నటికి మాసిపోవు. మంచి మాటలు వుత్సాహము కల్గించును. అవి శ్రోతలో శక్తిని ప్రేరేపించును. సదా శుభవచనలనే వక్కాణించవలెను. అర్జునునికి కృష్ణుడు ఉత్సుకత కల్గించు నేపథ్యంలో గీతోపదేశము కావించినాడు. శల్యుడు కర్ణునికి ఉత్సాహము నీరుగార్చే విధముగా క్రుంగదీయు విధంగా మాట్లాడినాడు. దీనినే శల్యసారథ్యము జాతీయముగా (సామెత)గా స్థిరపడినది. జంతువులు మూగగా రోదిస్తూ ప్రాణము వదులును. మానవుడు ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలాడి తప్పించుకొని ధన్యత నొందును.
మాట పాషాణ హృదయమునైనా కరిగించును. తాత్కాలిక ఉద్రేకముతో పొరపాటున అనరాని మాటంటే అది ఎంత బాధ కల్గించునో శ్రీమద్రామాయణము ఇతిహాసములో చక్కటి దృష్టాంతము.
మారీచుడు బంగారు జింకగా మారి అడవిలో సచరించుచున్నపుడు సీతాదేవి అది తనకు తెచ్చివ్వమని శ్రీరాముని కోరుతుంది. సీత రక్షణ నిమిత్తం శ్రీరాముడు లక్ష్మణుని సీత సంరక్షణ నిమిత్తమచ్చటే ఆశ్రమమునందు ఉండుమని ఆజ్ఞాపించాడు.
శ్రీరాముని దెబ్బకు మారీచుడు కూలిపోతూ, హా లక్ష్మణా అంటూ దాశరథి కంఠస్వరమును అనుకరిస్తూ అరిచాడు. ఆ చావు కేక విని సీత బెంబేలెత్తి వెంటనే లక్ష్మణుని వెడలమని అనగా, తన్ను వదినను రక్షిస్తూ ఆశ్రమమందే ఉండాలని శ్రీరాముని మాటలు ఉటంకించి, అది రాక్షస మాయ అని, అన్నగారికి ఏ ఆపదా వాటిల్లదని భయంలేదని తెల్పెను. ఆందోళనతో సీత అనరాని మాటలు అన్నది. నీలో ఏదో దురాలోచన ఉన్నది. నా రాముని ఆర్తనాదం వినిపించలేదా? శ్రీరామచంద్రునికి కావలసిన నన్ను కాజేయాలనుకున్నావా అని నిష్ఠురోక్తులాడినందున లక్ష్మణుడు అన్న శ్రీరాముని అన్వషణకై వెళ్తాడు.
లంకనుండి యుద్ధమైన పిదప అందరూ బయల్దేరారు. శ్రీరాముడన్నాడు, సీతా ఇన్నాళ్ళు రావణుని చెరలో సంతోషముగా గడిపినట్లుగా ఉన్నావే అనగానే ఆమె హృదయాన్ని దహించివేస్తాయి. విభీషణుడు చకితుడైనాడు. లక్ష్మణునికి అన్నపై ఆగ్రహం కలిగింది. అన్నా! ఆపు, మాతృమూర్తి వంటి సీతను అలాంటి మాటలనవద్దు. ఆమె దేవత అన్నాడు. ఆంజనేయుడు మోకాళ్ళపై వంగి కూర్చుని కన్నీళ్ళతో మా అమ్మను బాధించవలదని వేడెను.
శ్రీరాముడపుడు తన మనస్సులోని మాటను బయటపెట్టినాడు. సీతా, ఆనాడు లక్ష్మణుని అనరాని మాటలన్నపుడు తమ్ముడి హృదయం ఎంత క్షోభకు గురియై బాధపడినదో ఇపుడైనా అనుభవపూర్వకంగా తెలిసినదా. ఈ విధముగా మాట్లాడినాను కాని నిన్ను, నీ శీలమును శంకించి కాదు. లక్ష్మణునికి స్వాంతన చేకూర్చుట మన విధి అని శ్రీరామచంద్రమూర్తి వక్కాణించాడు.
మాట విలువ తెలిసి, మసలుకోవాలి. సందర్భశుద్ధి, సంయమనము కల్గి తగు రీతిలో మాట్లాడుతూ ఎవరి స్థాయి వారు నిలబెట్టుకోవాలి.
అందుకే ఎక్కడ మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఏ సందర్భమిది అన్నదాన్ని జ్ఞప్తిలో ఉంచుకుని మరీ మాట్లాడాలి. కాని ఎదుటివారిని కించపరిచేటట్టుగానో, ఎవరినో అనవసరంగా పొగడడమో అధికప్రసంగం చేయడమో అదీ కాకపోతే ఏమీ తెలియకపోయనా బాగా తెలిసినట్టుగా మాట్లాడడమో చేయాలి. అసలు బాగా తెలసిన వారు ఎంత అవసరమో అంతవరకే మాట్లాడుతారు. అనవసరపు మాటలు మాట్లాడరు. ఇట్లా చేయడం వల్ల ఎవరినీ బాధపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడదు.

- పి.వి.గౌడ్