మంచి మాట

మానవజన్మ సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ జగత్తును ఎవరు సృష్టించారు? ఈ జగత్తులో జరుగుతున్న సంఘటనలకు కారణం ఎవరు? ప్రతి జీవికి పుట్టుకకు ముందూ మరణం తరువాత మనుగడ ఎక్కడ? ఇలాంటి సందేహాలకు వెనువెంటనే సమాధానాలు దొరకనంత మాత్రాన కర్మ సాక్షి అయిన భగవంతుడనేవాడు లేడనీ అంతా యాదృచ్ఛికమనీ, కనిపించేదంతా మిథ్య అని అనుకోరారు.
ఈ సృష్టిలో ఎన్నో రకాలైన జీవజాతులు మానవునితో సహజీవనం చేస్తున్నాయి. అవన్నీ తమ పరిధిలో ఆలోచిస్తూ తమకు తెలిసినంత వరకే ఈ లోకమని భావిస్తాయి. అయినా వాటి జ్ఞానానికి అందని లోకమెంతో వుంది కదా! వాటి ఊహలకందని సత్యాలు ఎన్నో వున్నాయి కదా! విచక్షణాజ్ఞానం, ఆలోచనా శక్తి కలిగియున్న మనిషి కూడా వాటిలాగే ఆలోచిస్తే వివేకవంతమనిపించుకుంటుందా! వాటికీ మనకూ ఏమైనా తేడా వుంటుందా!
ఈ లోకంలో ఏ జీవికీ లేని విచక్షణాశక్తి, ఇంగితజ్ఞానం, ఆలోచనా శక్తి, సభ్యత సంస్కారం వంటి ఎన్నో ప్రత్యేకతలను భగవంతుడు మనిషికిచ్చాడు.
కొందరు భగవంతుడిచ్చిన ఈ ప్రత్యేకతలను సరిగా ఉపయోగించుకోలేక, అందుకు తగిన శ్రద్ధ, ఓపిక, సహనంతో కూడిన ప్రయత్నం చేయలేక ఇక అంతటితో అలసి ఈ సృష్టంతా యాదృచ్ఛికమనీ, మిథ్య అనీ తీర్మానిస్తున్నాయి. సృష్టిలోని కదలికలన్నీ పరిపూర్ణమైన జ్ఞానాన్నీ, సత్యాన్నీ ఆవిష్కరిస్తున్నాయి. మనమే అజ్ఞానాంధకారాలనే కటిక చీకటి మధ్య వాటిని చూడలేకున్నాము.
కొందరు ఆ అజ్ఞానాంధకారాల కటిక చీకటిని ఛేదించగలిగి సంపూర్ణమైన జ్ఞానంతో సత్యాన్ని దర్శించగలిగి ఆ పరమాత్మ దివ్య వైభవాన్ని వర్ణించగలుగుతున్నారు.
ఈ సృష్టిలో ఏ జీవికి లేని ప్రత్యేకతలు కలిగిన మనిషి వాటిని సరిగా ఉపయోగించుకోలేక అసహనంతో అసలు సత్యమే లేదని నిర్ణయించి రెండు కాళ్ళ జంతువుగా తయారవుతున్నాడు. మనలోని విచక్షణకూ, ఇంగితజ్ఞానానికీ, ఆలోచనాశక్తికీ తపన, జిజ్ఞాసలనే ఆజ్యాన్ని పోసి రగిల్చి జ్వలింపజేసి ఆ బ్రహ్మాండమైన వెలుగులో వీక్షిస్తే సత్యం దేదీప్యమానంగా ఆవిష్కృతమవుతుంది.
మానవ జన్మను భగవంతుడు మనకనుగ్రహించింది లక్షలు, కోట్లు సంపాయించుకోమనీ లేదా అటువంటి చింతనలతో కాలం వెళ్ళబుచ్చమనీ కాదు. జన్మరాహిత్యాన్ని సిద్ధింపచేసుకోవడానికి! కనీసం ఓ స్థాయి వయసు వరకూ వ్యవహార జీవనం, వ్యవహార జ్ఞానం కలిగియుండవచ్చుగానీ వయసుమీద పడిన తరువాత కూడా అదే తపన కలిగి వుండకూడదు.
ఆధ్యాత్మిక జీవనం, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ప్రయత్నించాలి. మనిషి జీవనానికి ఇవే అర్థాన్నీ పరమార్థాన్ని ఇస్తాయి. ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మానవ జన్మ లభించిందంటే అది ఎన్నో జన్మల పుణ్యఫలాలు పోగయితేగానీ సాధ్యపడి ఉండదని గ్రహించాలి. అటువంటి పరమ దుర్లభమైన మానవ జన్మను జన్మరాహిత్యం చేసుకోవడానికి ఒక అవకాశంగా భగవంతుడు మనకిచ్చాడు.
అందుకోసం ఆయన జీవరాశిలో మరేజీవికి లేని విశేష అంశాలను మనిషికి కల్పించాడు. ఆ విశేషాంశాలను లోక సంబంధ విషయాలకోసం దుర్వినియోగపర్చకుండా, జన్మరాహిత్య విషయాలకోసం సద్వినియోగపరచుకుని, కర్మ బంధ చక్రము నుండి తప్పించుకోవాలి.
లోక సంబంధమైన వ్యవహార జ్ఞానాన్ని సాధించినవాడు తన చుట్టూ వున్న మానవ జాతిలోనే గొప్పవాడనిపించుకుంటాడు. ఆధ్యాత్మిక సంబంధమైన బ్రహ్మజ్ఞానాన్ని సాధించినవాడు తన చుట్టూ వున్న మానవ జాతిలోనే కాక, మొత్తం జీవజాతిలోనే గొప్పవాడవుతాడు. అలాంటి బ్రహ్మజ్ఞాన సాధనకై నిరంతర సత్యశోధనకై ఎంతో విలువైన ఈ మానవ జన్మను సద్వినియోగపరచుకోవాలి.
-- పేరు వ్రాయలేదు