మంచి మాట

అహంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరిషడ్వర్గాల్లోని మదము అహంకారాన్ని సూచించే లక్షణమే. అధికత్వ భావన ప్రదర్శనమే అది. గర్వం దాని మరో రూపం. మన పురాణేతిహాసాల్లోని చాలా పాత్రలు అహంకారానికి నెలవులే. దుర్యోధనుడు అభిమానధనుడు. అహంభావమే అంతర్లయ. మహాభారతం ఉద్యోగ పర్వంలో కృష్ణరాయబార ఘట్టంలో చెప్పవలసిన హితవు ఎవరు చెప్పినా లక్ష్యపెట్టడు దుర్యోధనుడు. అప్పుడు ఆ సభలో వున్న పరశురాముడు కూడా తన మాటగా దంభోద్భవుడు అనే మహారాజు కథ చెబుతాడు. ఆ రాజుకి భూలోకంలో తనతో యుద్ధం చేయగలవారెవరూ లేరనే అహంకారం. ఎవ్వరూ ఎదిరించే సాహసం చేయకపోవటంతో ఆ దురహంకారం ఇంకా ఇంకా ఎక్కువౌతుంది. ఒకసారి కొందరు విప్రులు రాజసభకి వచ్చి గంధమాదన పర్వతంమీద తపోనిష్ఠలో వుండే నరనారాయణుల గురించి చెప్పి, ధైర్యం వుంటే వెళ్లి వాళ్ళతో యుద్ధం చేయమని సవాలు చేస్తారు. దంభోద్భవుడు హుంకరిస్తూ నరనారాయణులపై యుద్ధానికి వెళ్ళాడు. అతని గర్వాంధతకి నవ్వుకున్నారు వారు. సరే కానిమ్మని నరుడు ఒక దర్భపోచని తీసి ‘ఇది నిన్నూ, నీ సైన్యాన్నీ నిలువరిస్తుంది’ అని వదిలాడు. ఆ మహారాజూ సైన్యమూ శరపరంపరతో శస్త్రాస్త్ర ప్రయోగం చేశారు. ఫలితం లేకపోయింది. ఆ గడ్డిపోచ వీరినందరినీ కకావికలు చేసింది. దంభోద్భవునికి బుర్ర తిరిగింది. బుద్ధి వచ్చింది. నరనారాయణునికి మ్రొక్కి వారి అనుగ్రహాన్ని కోరాడు. ఈ గాథ విన్నా దుర్యోధనుడి మనసు మారదు. సంధి పొసగదు. చివరకు అతని అహమే అతన్ని అంతం చేస్తుంది కదా కురుక్షేత్ర సంగ్రామంలో.
మహాభారతం ఉద్యోగ పర్వంలోనే గరుడ గర్వభంగ వృత్తాంతమూ వుంది. పధ్నాలుగు భువనాల్ని భరిస్తున్న విష్ణుమూర్తి భారానే్న తాను వహిస్తున్నానని గరుత్మంతుని అహంకారం, గర్వం. నాగజాతి సంహారానికి పూనుకుంటాడు. ఆ క్రమంలో సుముఖుడు అనే సర్పజాతి సుందరుని వంతు రాబోతుంది. కానీ అతనికి ఇంద్రుని సారధి మాతలి కుమార్తె గుణకేశితో వివాహ ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు మాతలి ప్రార్థనపై సుముఖునికి పూర్ణాయుర్దాయం ప్రసాదించి గరుడుని గర్వాన్ని భంజిస్తాడు విష్ణువు. దుర్యోధన ప్రేరితుడైన దుర్వాస మహర్షి తన పదివేలమంది శిష్యులతో ధర్మరాజు ఆతిథ్యం కోరి వస్తాడు. నిజానికి ఆయన ఆంతర్యం ధర్మరాజుని అవమానించటమే. కానీ, ద్రౌపది శ్రీకృష్ణుని ఆదరణవలన దుర్వాసుని దురాలోచన దెబ్బతింటుంది. తానే భంగపడి వెళ్లిపోతాడు దుర్వాసుడు. ఇదే దుర్వాసునికి అంబరీషుని చేతిలోనూ గర్వభంగం జరుగుతుంది మహాభాగవత గాథలో.
ఛాందోగ్యోపనిషత్తులోని శే్వతకేతు వృత్తాంతం కూడా ప్రసిద్ధి చెందినదే. శే్వతకేతు తండ్రి ఉద్దాలకుడు. ఆ ఋషికి ఆరుణి అనే పేరూ వుంది. శే్వతకేతుకి పనె్నండేండ్ల వయసురాగానే, ఉద్దాలకుడు శాస్త్ర విద్యాభ్యాసానికి గురుకులానికి పంపుతాడు. శే్వతకేతు శిక్షణ ముగించుకుని తిరిగి తండ్రి ఆశ్రమానికి వస్తాడు. శే్వతకేతుకి తాను మహా పండితుడినైనాననే అహంకారం నెత్తికెక్కింది. తండ్రికి నమస్కారమే చేయడు. తండ్రి పరామర్శకు ‘హుం హుం..’ అని ‘నేను సర్వమూ నేర్చుకున్నాను. నాకు తెలియనిది ఏదీ లేదు’ అని దురుసుగా సమాధానమిస్తాడు. ‘ఒకటి తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్టే కదా, అది ఏమిటి?’ అని అడుగుతాడు ఉద్దాలకుడు. శే్వతకేతు పొగరుగా ‘నాకు తెలిసినది నీకు తెలియదు. తెలియనివానికి చెప్పినా అర్థం కాదు. చెప్పను’ అని తండ్రిని తృణీకరిస్తాడు. ఉద్దాలకుడు కొడుకు అహంకారాన్ని అణచటానికి తానే సమాధానం చెబుతాడు. ‘తత్వమసి’ని వివరిస్తాడు. ఆ మహావాక్యాన్ని విని ఆత్మతత్త్వాన్ని అవగాహన చేసుకోవటం ఎంత కష్టమో అర్థమవుతుంది శే్వతకేతుకు. జ్ఞానాహంకారం ఎంత ప్రమాదకరమో తెలుపుతుందీ కథ.
మానవ సంబంధాలకు అణుకువ, వినయం అనేవి ఎంతగానో ఉపకరిస్తాయి. బాహ్యవర్తనలోనూ, అంతర్గత జీవనంలోనూ మనిషి సామూహిక సత్యం గురించీ, శ్రేయస్సు గురించీ ఆలోచన చేస్తూ, ఆ ఆలోచన కార్యాచరణ రూపం కలిగిస్తేనే బ్రతుక్కి అర్థమూ పరమార్థమూ ఒనగూడుతాయి.

-విహారి