మంచి మాట

మోక్షగామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ జగత్తుయందు మానవాళిని పురాణ పురుషులు ఎందరో భిన్న రకములుగా విభజించి ఉన్నారు. అది వృత్తిని బట్టి కావచ్చు మనస్తత్వమును బట్టి కావచ్చు. అదే విధముగా కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీశ్రీశ్రీ జగద్గురు చంద్రశేఖర సరస్వతివారు సైతం ఈ ప్రపంచమునందు మెలిగే మానవాళిని నాలుగు రకములుగా గుర్తించారు. స్వామివారి లెక్కల ప్రకారం మానవాళి నాలుగు రకముల మనస్తత్వములు కలవారు.
ఆర్తుడు, అర్దార్థి, జ్ఞాని, జిజ్ఞాసువు. ఈ విభజన చూచుటకు ఎంతో సామాన్యంగా కనబడవచ్చు గాని ఇందులో ఎన్నో నిగూఢ భావననలు, అంతరార్దము దాగియున్నది. విభజనలో మొదటిరకంగా చెప్పబడినవాడు ఆర్తుడు. ఆర్తుడు అంటే ఎవరు? ఆర్తి కలవాడు ఆర్తుడు. ఆర్తి అంటే మనోవ్యధ. ఎందుకు మనోవ్యధ, ఎందుకు దిగులు. ఆర్తుడు సదా దుఃఖమునందే యుంటాడు. దుఃఖమునకు కారణం కోరిక. మానవుడు ఒక కోరిక తీరిన తరువాత ఆగిపోడు. దానివలన మరొక కోరిక పుడుతుంది. ఆర్తుడి ఆత్మ సదా కామ, క్రోధ, మద, లోభముల చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. అందువలన శ్రమ, భయము, ఆందోళన అధికమగుతాయి. అపుడు ఆర్తపరాయణుడు అయిన భగవంతుని ప్రార్థిస్తాడు. భగవంతుడు ఆర్తుడి బాధ తొలగించినా ఆయన స్థిమితంగా ఉండలేడు. మరలా అదే చట్రంలో బిగించబడుతున్నాడు. ఇటువంటి వాడు మోక్షమునకు ఎలా అర్హుడవుతాడు? ఎప్పటికీ కాలేడు.
ఇక రెండవవాడు అర్థార్థి. అర్థము అంటే ఇచట ధనము అని భావం. ధనము గోరువాడు అర్దార్థి. ఈ అర్దార్థిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ సమస్త ప్రాణికోటి సిరిసంపదలకు పాదాక్రాంతము అయినందువలన ఆ సంపద పొందితే జగత్తుపై సర్వాధికారములు తనకు వశమవుతుందని భావించేవాడు. దానికై ఆరాటపడేవాడు. ఇటువంటివాడు ఎప్పటికీ మోక్షము పొందలేడు. సంపదవలన అదే లోకమని భావించి దానికై ఆరాటపడి పోరాడేవాడు.
ఇక జిజ్ఞాసువు. ఈయన పరిస్థితి విచిత్రమయినది. ఈ సృష్టిలోని ప్రతి అంశం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువ వీరికి. ఆ జిజ్ఞాస అనేది అనే్వషణకు దారితీస్తుంది. ఆ అనే్వషణ కోరికతోనే జీవితకాలమంతా గడిచిపోతుంది. వీరికి ఆత్మజ్ఞానం పొందే తడవు యున్న ఇంకా ఏంది? ఇంకా ఏంది? అనే భావనతోనే జీవనం గడుపుతారు. వీరికి కూడా మోక్షార్హత లేదనే చెప్పాలి.
ఇక మిగిలినది జ్ఞాని. ఇక్కడే అసలు చిక్కు ప్రశ్న. జ్ఞాని అంటే ఎవరు? విద్యనభ్యసించిన ప్రతి ఒక్కడు జ్ఞానియేనా? జ్ఞానముగలవారు మరలా రెండు విధములు. వీరు లఘు చేతస్కులు, విశ్వచేతస్కులు. వారి వారి మనస్తత్వమును బట్టి ఈ విభజన జరిగింది. లఘు చేతస్కులు అంటే అల్పమతులు. జ్ఞాన సముపార్జన చేసినప్పటికి సహనం, ఓర్పు, నిరీక్షణ చాలా తక్కువ. వీరు విశ్వచేతస్కుల చర్యలను సహించలేరు. ప్రతి చిన్న మంచి పనికి అనంతమయిన ప్రచారమును ఆశించెదరు.
ఇక విశ్వ చేతస్కులు- విశ్వజనీనత్వమునకు, భారతీయ ఆత్మకు ప్రతిరూపము వీరు. శక్తివంతమైన భావ తరంగములు వీరి సొంతము. వీరు భీతిరహిత ప్రపంచములో జీవిస్తూ తమ చుట్టూ ఉండే ప్రపంచమును ఆహ్వానించెదరు. ఆనందమును అందరికీ పంచే ప్రయత్నం చేస్తారు. వీరికి శారీరక దృఢ్వం, మానసిక దృఢత్వంతోపాటు వీరికి సంకల్పబలం చాలా ఎక్కువ. వీరిని మనము ధీరోదాత్తులుగా చెప్పవచ్చు.
వీరి దృష్టిలో మానవ జీవితం అంటే అనుభవించుట యొకటే గాదు అది ఒక రథయాత్ర లాంటిది. విశ్వచేతస్కుడు శరీరమును ఒక రథముగా భావిస్తాడు. శరీరమునకు కారణభూతమయిన ఆత్మను ఒక రథికునిగా, జీవనమును నడిపించే బుద్ధిని సారధిగా చంచలమయిన మనసును కళ్ళెముగా ముందుకు ప్రయాణిస్తారు. అంతర్ దృష్టిని అలవరచుకొని ప్రత్యగాత్మకై అనే్వషిస్తారు. వీరి ప్రభావం సమాజంపై అమోఘం. వీరు మోక్షమునకు అర్హులు.

- వేదగిరి రామకృష్ణ