మంచి మాట

సేవా ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి కలిపురుషుడు బ్రహ్మదేవునితో ఎవరిని సేవిస్తే అధిక ఫలితం వస్తుందని అడిగాడు. దానికి బ్రహ్మ గురువును సేవిస్తే చాలు త్రిమూర్తులకన్నా అధిక సంపన్నుడు గురువు అని చెప్పాడు. గురువు స్వయంగా శిష్యుని పాపాన్ని కడిగివేసి అతనిని శాశ్వతంగా దుఃఖ సముద్రం నుండి గట్టు చేర్చగల శక్తి సంపన్నుడు కేవలం గురువు అని బ్రహ్మ కలిపురుషునకు చెప్పాడు. గురువు శిష్యుని పట్ల సంప్రీతుడైతే త్రిమూర్తులు కూడా సంతృప్తి చెందుతారు అని కూడా చెప్పాడు.
గురువును మెప్పించిన శిష్యుడు బ్రహ్మస్థానాన్ని పొందగలడు. అతినికి తీర్థయాత్రలు, వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురువు సేవ వలనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునకు వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సదసద్వివేకము, కర్మాచరణ భక్తి, వైరాగ్యం, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షము లభించదు. గురువు లేకుంటే శాస్త్ర శ్రవణము, తత్వశ్రవణం లభించవు. అవి లభించని మానవులకు కలిపురుషుని వల్ల భయం తప్పదు, శాస్త్రాలు కేవలం ఎవరికి వారు చదువుకుంటే పై పై జ్ఞానం వచ్చినట్లుగా భ్రమ కలుగుతుంది. కాని అంతర్లీనమైన జ్ఞానం కేవలం గురు అనుగ్రహం వల్లనే వస్తుంది.
పూర్వకాలంలో గోదావరీ తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేకమంది సద్బ్రాణులు వ్రతదీక్ష పూనినవారు తపస్వులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు, వేద ధర్ముడనే ముని ఉండేవాడు. ఆయనకెందరో శిష్యులున్నారు. ఆ వేద ధర్ముడు ఓసారి శిష్యులని పరీక్షించాలని అనుకొన్నాడు. ‘శిష్యుల్లారా! నేను పూర్వజన్మలనుంచి నాతో పాటు వచ్చే పాపసంచితాన్ని పూర్తిగా పోగొట్టుకోలేకపోతున్నాను. ఒకవేళ ఇపుడు నేనా ప్రయత్నం చేస్తే నా తపోశక్తి దుర్వినియోగం అయిపోతుంది.
అందుకనే నేనే ఆ పాపఫలితాన్ని స్వయంగా అనుభవిద్దామని అనుకొంటున్నాను అని చెప్పారు. అంతేకాదు నేను ఈ పాపఫలితాన్ని పోగొట్టుకోవడానికి గళుత్కుష్టరోగంతోను, కుంటితనంతోను, గుడ్డితనంతో 21 సంవత్సరాలు కర్మఫలాన్ని కాశీలో అనుభవించదలచాను. ఈ 21 ఏళ్లు నాతో పాటు ఉంటూ నాకు నేను కోరన సేవ చేసేవారెవరు ఉన్నారు అని ఆలోచిస్తానని చెప్పాడు. గురువు గారు చెప్పింది విని శిష్యులంతా వౌనం వహించారు.
అందులో దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి ‘స్వామీ మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. కాని మీరనుతిస్తే మీ బదులు నేనే ఆ పాపాన్ని అనుభవించి మీకు సేవ చేస్తాను ’అని చెప్పాడు అపుడా గురువు సంతోషించి ఈ పాపం నేను అనుభవించవలసిందే. వేరొకరు అనుభవిస్తే పోయేది కాదు. రోగం అనుభవించే వారికంటే రోగికి సేవచేసే వారికే దీనివల్ల కష్ట కలుగుతుంది. అందుకు ఇష్టమైతే నీవు నాకు సేవ చేయవచ్చు అని గురువు దీపకునితో చెప్పాడు. దానికి అంగీకరించి దీపకుడు గురువుతో కాశీకి వెళ్లాడు.
వేదధర్ముడు గంగాస్నానం చేసి విశే్వశ్వరుని పూజించాడు. దీపకుడు నిర్మించి ఇచ్చిన కుటీరంలో గురువు నివసించసాగాడు. ఆయన శరీరమంతా కుష్టువ్యాధి బారిన పడింది. దానికితోడు మతిస్థిమితం కోల్పోయాడు. అటువంటి స్థితిలో ఉన్న గురువును దీపకుడు సాక్షాత్తు విశే్వరునిగా తలుస్తూ గురుసేవ చేసేవాడు. భిక్షాటన చేసి వచ్చి గురువుకు అన్నం పెడుతుండేవాడు.
కాని గురువు శిష్యుని ఎంతో బాధించేవాడు. ఎన్నోరీతులుగా నొప్పించేవాడు. ఒకసారి నీవు నాకు సరిగా భోజనం పెట్టడం లేదని అనేవాడు. మరొకసారి నీవే నిజమైన శిష్యుడివి నీవు నాకోసం ఇంత కష్టపడుతున్నావు అని చెప్పేవాడు. కాని గురుసేవనే సకల తీర్థ సేవ అనుకొన్న దీపకుడు ఏమాత్రం నొచ్చుకోకుండా అహర్నిశమూ ఎంతోశ్రద్ధ్భాక్తులతో గురుసేవ చేస్తుండేవాడు.
చివరకు వేదధర్ముడు దీపకుని మెచ్చుకుని ఇదంతా తన పరీక్ష మాత్రమే నని చెప్పాడు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్నుసేవిస్తూ ఉంటాయి. నీవు సదా ఈ కాశీలోనే ఉంటూ విశ్వనాథునికి సేవ చేయి అని వేద ధర్ముడు తన శిష్యుని దీవించాడు. ఇలా గురువు సేవ వలన కోరకుండానే ఎన్నో అణమాది సిద్ధులు ఒనగూడుతాయి.
యోగమార్గంలో ఉన్నవారికి భక్తి, నిష్ఠ, ఓరిమి, విశ్వాసము ఇవన్నీ ఉండితీరాలి. ఇవి కలుగాలన్నా కూడా గురుసేవ తప్పనిసరి.

- వడ్డూరి రామకృష్ణ