మంచి మాట

సరస్వతీ పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాక్కు ప్రప్రథమంగా ఓంకార ప్రణవ రూపం లో ఏకపదియై, తర్వా త వ్యాహృథి సావిత్రీ రూపములో ద్విపదియై, అటుపైన ఋగ్యజుస్సామధర్వవేదముల రూపములో చతుష్పదియై, అనంతర శిక్షా వ్యాకరణ ఛందోనిరుక్త కల్ప జ్యోతిష పురాణ ధర్మ శాస్తమ్రుల రూపంలో అష్టపదియై, తదుపరి మీమాంస న్యాయసం ఖ్య యోగ పంచరాత్ర పాశుపతా యుర్వేద ధనుర్వేద గాంధ ర్వ వేదముల రూపంలో నవపదియై తరువాత అనంతములైన వాక్య సందర్భాలచే సహస్రాక్షరయై అప్రమేయ ప్రభావంతో ప్రకాశిస్తున్నది. అలా ప్రకాశించే స్వరూపమే సరస్వతి.
సరస్వతీ నమస్త్భ్యుం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసర వర్ణినీ
నిత్యం పద్మాలయాం దేవీ సామాంపాతు సరస్వతీ
అని ఆ సరస్వతీదేవిని ఉపాసించడం అనాదిగా వస్తోంది.
కేవలం ఐం అన్న ఒక్క శబ్దాన్ని స్మరించిన అనామకునికి అమేయజ్ఞాన సంపదను అనుగ్రహించిన దేవత సరస్వతీ దేవి. ఆ తల్లి అనుగ్రహ వీక్షణాలుంటే చాలు ఏ కష్టాన్నైనా దూది పింజంలా ఎగుర గొట్టవచ్చు.
ఈ తల్లిని జన్మనక్షత్రం మూల. కనుక శరన్నవరాత్రిలో సప్తమి మూలనక్షత్రం రోజును శారదాదేవిగా అలంకరించి ఆదిపరాశక్తిని సరస్వతీ దేవిగా కొలుస్తారు. -ఈ శారదాదేవి బుద్ధిని విద్యను, జ్ఞానమును, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని, వివేచనాశక్తిని, జ్ఞాపకశక్తిని, కల్పనా నైపుణ్యాన్ని ధారణా శక్తిని ప్రసాదిస్తుంది. శుంభనిశుంభలను రాక్షసులు ‘కౌశికి’ యై దునుమాడిన ఈతల్లి వాగ్దేవియై అందరి నాలుకపై నర్తిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం వల్లనే మానవుల్లో సంస్కారము, సత్వగుణము, మాటతీరు సద్బుద్ధి, విచక్షణాజ్ఞానం కలుగుతాయ. ఇవన్నీ అనుగ్రహించిది కనుకనే ఈ తల్లి నరులను నారాయణమూర్తులను గావిస్తుంది.
‘సరస్వతి’ శబ్ధానికి ‘శ్రోతస్విని’ అని లేదా ‘గమన రూపిణి’ అని రెండర్థాలు. ఆ శబ్దానికి లౌకికార్థములో నది అని అర్థమున్నా, ఆధ్యాత్మిక భావనలో ప్రచోదనాశక్తి స్వరూపిణిగా సంభావిస్తారు. శే్వత వస్రత్ధారిణిగా పుస్తకపాణిగా వీణను మీటుతూ మనసులను సత్వగుణం వైపు మళ్లించే ఈ తల్లిని మల్లెలు, తులసీదళాలు, కలువపూలు, కడిమిలు, సంపెంగపూలు, జాజి, మల్లికలు, గనే్నరు పూలు, కమలములు, బిల్వపత్రములు, మొల్లలు పొగడలు, పచ్చగోరింట, పొగడపూలు, మందారము, దిరిసెన పూలు, మొగలిపూలు, విష్ణుక్రాంత, జిల్లేడు, మాధవీపుష్పాలు ఇలాంటి పువులన్నింటితో పూజించినా ముఖ్యంగా తెల్లనిరంగువాటిని అమ్మకు ప్రీతిపాత్రంగా సమర్పిస్తారు.
చంద్రికా చంద్రవదనా చంద్రరేఖా విభూషితా
సావిత్రీ సురసాదేవి దివ్యాలంకారభూషితా అని సేవించే ఈ తల్లి చింతామణి, జ్ఞాన , నీల ఘట, కిణి, అంతరిక్ష మహా సరస్వతులుగా సప్తనామాలతో కొలువులందుకుంటుంది. శరన్నవరాత్రుల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి యైన దుర్గాదేవి తన అంశలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరింపచేయడమనేది ఈ శరన్న వరాత్రుల్లోని అంతరార్థం.

- ఎస్. నాగలక్ష్మి