మంచి మాట

మత్స్యావతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్ణురూపాలెన్నో విలసిల్లు జగతిలో అనే నానుడికి ప్రసిద్ధంగా విష్ణుమాయలు అనేకం. శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల్లో ప్రథమమైనది శ్రీమత్స్వావతారము. చాక్షుష మన్వంతరము తర్వాత ఏర్పడనున్న జలప్రళయం నుండి తన భక్తులను, మహర్షులను కాపాడి, సత్యవ్రత మహారాజును వైవసత్వ మనువుగా చేసి, బ్రహ్మదేవుని నుండి వేదాలను అపహరించిన హయగ్రీవుడనే రాక్షసుణ్ణి వధించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మకిచ్చుటకై విష్ణువు మత్స్యావతారమును తాల్చాడు.
సత్యవ్రతుడు గొప్ప విష్ణ్భుక్తుడే కాకుండా ధర్మతత్పరుడై దేశాన్ని సుభిక్షంగా, ప్రజలను కన్నబిడ్డలు వలె పరిపాలిస్తున్నాడు. అలాంటి మహారాజు ఒకసారి మనోనిశ్చయంతో శ్రీవిష్ణుమూర్తిని మనసా వాచా కర్మణ సేవించేందుకు కృతనిశ్చయుడై జలానే్న ఆహారంగా గ్రహించి ఘోర తపస్సు చేయడానికి కృతమాలిక అనే నదికి వెళ్లి స్నానమాడి, భక్తితో శ్రీవారికి జలతర్పణం చేయుటకై దోసిటలో నీళ్ళు తీసుకోగా అందులో దివ్యకాంతులతో ప్రకాశించే ఒక చిన్న చేప పిల్ల వచ్చింది. అది చూసి సత్యవ్రతుడు ఎంతగానో ఆశ్చర్యం చెంది వెంటనే ఆ చేప పిల్లను నీళ్ళలోకి జారవిడవబోయాడు.
అప్పుడు ఎంతో ఆశ్చర్యంగొలుపుతూ ఆ చేప పిల్ల ‘‘మహారాజా! నన్ను రక్షించు. మిక్కిలి పసిదాన్ని అయిన నన్ను ఇలా ఒంటరిగా వదలివస్తే నదిలోని పెద్ద చేపలు నన్ను మ్రింగివేయగలవు. అందుకే అతి కష్టంమీద వాటి బారినుండి తప్పించుకోవడానికి నీ దోసిటిలో వాలాను. దయతో నన్ను కాపాడి పుణ్యం కట్టుకో’’ అని అర్థించింది. ఆ చేప పిల్ల మాట్లాడటం చూసి రాజు మరింత ఆశ్చర్యపోయాడు. మహారాజు చేప పిల్లపై జాలిపడి దానికోరిక ప్రకారం తన కమండలంలో దాన్ని ఉంచి రాజమందిరాన్ని చేరుకున్నాడు. ఆ మర్నాడు ఉదయం చూడగా చేప పిల్ల కమండలమంత కాగా, ఆ రాజు దానిని ఒక పెద్ద నీళ్ళ పాత్రలో వేయించాడు. కొద్ది క్షణాల్లోనే ఆ చేప ఆ పాత్ర పట్టనిదంతైపోయింది. దీనితో మహారాజు దిగ్భ్రాంతి చెంది ఆ వెనువెంటనే రాజభటులను రప్పించి దానిని భద్రంగా ఒక చెరువులో వేయించగా, మరొక్క క్షణంలోనే ఆ చేప ఆ చెరువును కూడా పట్టనంత పెద్దదిగా మారిపోయింది. ఇదంతా చూసిన రాజుకి అయోమయమైంది. ఇదేదో మహావిష్ణువు మాయో లేక తనను విష్ణువు చేస్తున్న పరీక్షయో అని సత్యవ్రతుడు భావించాడు. ఏమైనా ప్రాణరక్షణ కోరిన ప్రాణిని విడిచిపెట్టడం ధర్మం కాదు కదా అని రాజు పరిపరి విధాల ఆలోచించి దానిని ఒక పెద్ద నదిలో వదిలాడు. అక్కడ కూడా చేప తన ప్రభావం చూపుతూ నదంతా తానై కదలాడింది. రాజు శ్రీమహావిష్ణువును ప్రార్థించి అతి కష్టంమీద తన భటుల చేత దానిని మహా సముద్రంలోకి విడిచిపెట్టించాడు.
అపుడు ఆ చేప సముద్రమంతటి రూపము దాల్చి, మనుష్య భాషలో, ‘‘ఓ రాజా! ఎన్నో క్రూరమైన మొసళ్లు, జల చరాలు వుండే ఈ సముద్రంలోకి తిరిగి నన్ను వదలడం నీకు ధర్మమా?’’ అని ప్రశ్నించింది. అపుడు సత్యవ్రతుడు ‘‘ఓ మహామీనమా! నీవు సామాన్యమైనదానవు కావు. రోజుకొక శతయోజనాలు విస్తరించగల నీవంటిదానిని నేనెప్పుడు చూడలేదు. ఎన్నడూ ఇట్టిది వినలేదు. ఆ శ్రీ మహావిష్ణువే ఈ చేప రూపంలో నన్ను పరీక్షించుటకై వచ్చినట్లుగా తోస్తున్నది. దయతో నన్ను అనుగ్రహించు’’ అని చేతులు జోడించి భక్తితో ప్రార్థించాడు.
అపుడు చేప రూపంలోనున్న శ్రీమహావిష్ణువు రాజుకు తన నిజరూపమును చూపగా, రాజు శ్రీమన్నారాయణుని స్తుతించి, ఈ విధమైన చేప రూపం దాల్చుటకు కారణం లోకరక్షణార్థమేనని, జల ప్రళయం రానున్నదని, ఆ సమయంలో వేదాలను దొంగలించి సముద్రంలో దాగిన హయగ్రీవుని వెదకి పట్టి తన గదతో చావమోదుతూ, తుదకు వాడిని సంహరించి వేదాలను గ్రహించి బ్రహ్మదేవునికి అందించి జరిగిన విషయాన్ని వివరించాడు. ఈ విధంగా జలప్రళయం నుండి మహాత్ములను రక్షించి వేద సంరక్షణకు కృషిచేసిన తన భక్తుడైన సత్యవ్రతుణ్ణి ఏడవ మనువుగా నియమించి శ్రీమహావిష్ణువు ఈ దివ్య మత్స్యావతారాన్ని ఉపసంరించాడు.

- దాసరి కృష్ణారెడ్డి