మంచి మాట

దేవీ భాగవతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరాణిక సాహిత్యంలో భాగవతము అను పేరిట రెండు పురాణగ్రంథాలు ప్రస్తావించబడినవి. మొదటిది దేవీ భాగవము. రెండవది శ్రీమద్భాగవతము. దేవీ భాగవతము శాక్త భాగవతం గాపేర్కొనబడింది. ఇందులో శాశ్వత సనాతన ధర్మమునకు చెందిన గాధలే ఇతివత్తంగా వర్ణించబడినవి.
శివ, మత్స్య మహా పురాణములు రెంటియందు కాళికా ఉప పురాణమునందు ఆదిత్య ఔప పురాణమునందు దేవీ భాగవతమును మహా పురాణముగా తెలుపబడినది. దేవీ భాగవతమునందు ప్రకృతి ప్రాధాన్యముగా ఒకే ఒక జగన్నియంతను గురించి వర్ణించబడింది. దేవీ భాగవతము-శ్రీమద్భాగవతము రెండును సనాతన ధర్మమునకు పట్టుకొమ్మలుగా హైందవ జాతికి నిధులుగా అలరారుచున్నవి.
శ్రీ వేద వ్యాస మహర్షి వేరు వేరు దేవతల పేర్లతో పలు పురాణాలు రచించారు లోకంలోని రకరకములైన ఉపాసకుల కొరకు. కొందరు దేవీ ఉపాసకులు-కొందరు శివోపాసౌకులు, కొందరు విష్ణు-గణేశ-హనుమ- దత్తోపాసకులుగా రామ-కృష్ణ ఉపాసకులుగా ఉన్నారు. అందరి ధ్యేయం ఒకటే. అదే పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి లభించటకే. మహర్షివారు ఒక్కో దేవతకు ప్రాధాన్యత ఇచ్చి, ఆయా దేవతల పేరుతో ఒక్కో పురాణమును రచించి, ఉపాసకుల దృష్టిని ఒకే ఒక పరబ్రహ్మ పరమాత్మవైపు మళ్లించుట జగతిలోని జనుల అదృష్టం.
ఈ దేవీ భాగవతమునందు ఆధ్యాశక్తిగా దేవినే పేర్కొని త్రిమూర్తుల ఆవిర్భావము, తిరోభావములు పరాశక్తి ద్వారానే జరిగినదని వర్ణించబడింది. ఇందులో దేవీయే సచ్చిదానంద పరబ్రహ్మమని తెలిపారు. ఉపాసకులు తమ ఇష్ట దైవమందే ఏకనిష్ఠను కలిగి వుండవలెనన్నాడు ఋషి వ్యాసుడు. ఆ దేవతనే అనన్య భావముతో ఆరాధించాలని, ఇతర దేవతలను ద్వేషించరాదన్నారు. ప్రతి దేవతను పరబ్రహ్మస్వరూపంగా భావించాలి. దివ్యమైన పవిత్రమైన ఋజుమార్గంలో ఉపాసకులు పయనించాలి.
వేదములు స్వయంగా ఈ భాగవతమునందు భగవతీదేవిని పరాశక్తి స్వరూపంగా స్తుతించాయి.
‘నమోదేవి మహామాయే-విశ్వోత్పత్తి కరేశివే
నిర్గుణే సర్వభూతేశి మాతః శంకర కామదే’ అన్నాయి.
శ్రీ సూత మహర్షి శౌనకాది మునులకు దేవీ భాగవతమును ఉపదేశిస్తూ త్రిమూర్తుల సృజన-పాలన-సంహార శక్తులు, ఆదిత్యునిలోని ప్రకాశ శక్తి, ధారణ శక్తి-దాహక శక్తి-చలన శక్తి వీటన్నింటిలోగల శక్తిస్వరూపమే ఆద్యాశక్తి అనబడునని పురాణోక్తి. సర్వత్రా వ్యాపించి వున్న ఆద్యా శక్తియే ‘బ్రహ్మ’ అను పేరుతో నిరూపించబడింది. భగవతి పరాశక్తిని సనాతన దేవిగా భావించి త్రిమూర్తులు పలు రకాల యజ్ఞములు నిర్వహిస్తూ దేవిని మానసికముగా ధ్యానించారట. సకల దేవతలకు రక్కసులకు ఈ పరాశక్తియే ఆరాధించుటకు యోగ్యమైనది. త్రిలోకాల్లో జగదంబికను మించిన వారు లేరనీ, ఈ దేవిని సగుణంగా గానీ, నిర్గుణ రూపంగా గానీ పూజించాలి. చిన్మయ రూపిణి పరాశక్తియే అంటూ
‘ఆరాధ్యా పరమాశక్తిఃసర్వైరపి సురాసురైః
నాతఃపరతరం-కించి దధికం భువనత్రయ
సత్యం సత్యం పునఃసత్యం-వేద శాస్త్రార్ధనిర్ణయః
పూజనీయా-పరాశక్తిః-నిర్గుణ సగుణాధమ అని దేవీ భాగవతం తెలిపింది. వటపత్రశాయిగా బాల రూపంలో వున్నది విష్ణు భగవానునితో స్వయంగా దేవి ‘సర్వం ఖల్వితమేవాహం-నాన్యదస్తిత సనాతనం’ అని పేర్కొన్నది. కావున భగవతి జగదంబికయే సనాతన పరబ్రహ్మ తత్వమని ప్రకటించబడింది. దేవీ స్వయంగా బ్రహ్మము, నేను ఒక్కటే. ఏది అతడో అదే నేను ఏది నేనో అతడు అదియే గాని నాలో, బ్రహ్మలో ఎప్పుడూ ఏమాత్రము రవంత భేదములేదు. బుద్ధి భ్రమించితే భేదము గోచరిస్తుంది. మాలోగల సూక్ష్మ భేదమును ఎవరు గుర్తించెదరో వారు ముక్తులగుదురు అని జగన్మాతయే బ్రహ్మదేవునితో అన్నది. కాన శక్తికి శక్తిమంతునికీ భేదము లేదు.
భగవతి సచ్చిదానంత స్వరూపిణిగా, గాయత్రి నామముతో ఖ్యాతి వహించినది. ‘హ్రీం’ స్వరూపమైన ఆ జగదంబను ఆరాధించి, ఉపాసించి పూజించినచో దయతో బుద్ధికి సత్ప్రేరణ కలిగిస్తుంది.్భక్తి శ్రద్ధలతో మెలగాలి. జ్ఞాన ప్రాప్తిని పొందాలి.అమ్మ కృపకు పాత్రులు కావాలి.

- పి.వి.సీతారామమూర్తి