మంచి మాట

భాతృవిదియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకమాసంలోని శుక్ల పక్ష విదియకు ‘్భతృవిదియ’ అని పేరు. అపమృత్యు భయం, నరకలోక ప్రాప్తి లేకుండా చేసి స్ర్తిలకు సకల సౌభాగ్యాలు కలకాలం వర్థిల్లేలా చేసే పుణ్యదినం- భాతృవిదియ’. దీనికే ‘యమద్వితీయ’, ‘కాంతి ద్వితీయ’, ‘్భగినీ హస్త్భోజనం’ అని పేర్లు. సోదరీ, సోదరుల మధ్య అనురాగానికీ, ఆప్యాయతలకూ నిదర్శనంగా నిలిచే పండుగ రోజు- ‘్భతృవిదియ’. బలమైన కుటుంబ వ్యవస్థ వున్న మన భారతదేశంలో ఇంటి ఆడపడుచును శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా, శక్తి స్వరూపిణిగా భావించడం ఆచారం. లక్ష్మీ స్వరూపంగా భావించడంవల్లనే పుట్టింటి నుంచి అత్తవారింటికి మంగళ, శుక్రవారాల్లో పంపరు.
నరక లోకాధిపతి అయిన యమధర్మరాజు సోదరి యమునా నది. యమున తన అన్న అయిన యముడిని తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు కోరింది. అయితే నరకలోకంలో తీరికే లేకుండా వున్న యముడు చెల్లెలి ఇంటికి వెళ్లలేకపోయాడు. చివరకు ఒక రోజు యమధర్మరాజు సోదరి అయిన యమున ఇంటికి చిత్రగుప్తుడుతోపాటు తన పరివారాన్ని వెంటబెట్టుకుని వెళ్లాడు. ఆ రోజు కార్తీక మాస శుక్లపక్ష విదియ. తన అన్న తన ఇంటికి రావడంతో యమున ఎంతో సంతోషించింది. అన్నకు సపర్యలు చేయడంతో పాటూ రకరకాల పిండివంటలను చేసి యముడితోపాటు అందరికీ స్వయంగా భోజనం పెట్టింది. సంతోషంతో అన్నను పూజించి నమస్కరించింది.
తన సోదరి యమున తన పట్ల చూపిన ప్రేమాభిమానాలు గౌరవాన్ని చూసి ఉప్పొంగిపోయిన యమధర్మరాజు తన చెల్లెలిని ఆశీర్వదించి ఏదైనా వరం కోరుకోమన్నాడు.
అందుకు- ‘‘అన్నా! ఈరోజున ఎవరైతే సోదరి ఇంటికి వెళ్లి సోదరి చేతి వంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యు దోషం లేకుండా వరం ప్రసాదించండి’’ అని యమున కోరింది.
‘‘అమ్మా, యమునా! నీవు కోరిన వరం ప్రసాదిస్తూ వున్నాను. నేను ఇకమీదట ప్రతి సంవత్సరం కార్తీకమాసం శుక్లపక్ష విదియ నాడు నేను నీ ఇంటికి వచ్చి నీ చేతి వంట తింటూ వుంటాను. ఎవరైతే ఈనాడు సోదరి ఇంటికి వెళ్లి సోదరి చేతి వంటను భుజిస్తాడో వారికి నరకలోకప్రాప్తి కానీ, అపమృత్యు భయం కానీ వుండదు. ఎవరైతే ఈ రోజు తన సోదరుడిని తన ఇంటికి ఆహ్వానించి తన చేతి వంటకాన్ని వడ్డించి భుజింపజేసి సోదరుడి ఆశీర్వాదం పొందుతుందో.. ఆమెకు వైధవ్య బాధలు ఉండవు. కలకాలం సకల సౌభాగ్యాలతో వర్థిల్లుతుంది’’ అని యముడు వరం ప్రసాదించాడు.
అప్పటినుంచి ‘్భతృవిదియ’ పండుగ ఆచరణలోనికి వచ్చినట్లు స్మృతికౌస్త్భుం, వ్రతచూడామణి వంటి గ్రంథాల్లో చెప్పబడింది.
కార్తీకమాసం శుక్లపక్ష విదియ రోజు సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి స్వయంగా వంట చేసి వారికి భోజనం పెట్టవలెను. అంతేకాకుండా నరకలోకాధిపతి అయిన యమధర్మరాజుతోపాటు ఈ రోజు చిత్రగుప్తున్ని స్మరించడం, పూజించడం చేయాలని శాస్తవ్రచనం. పాడ్యమి బలిపాడ్యమి బలి చక్రవర్తి పాడ్యమినాడు పూజలు అందుకుంటాడు. తిరిగి విదియ నాడు పాతాళ లోకానికి వెళ్లిపోతాడు కనుక ఈ దినం బలి చక్రవర్తికి వీడ్కోలు పూజలు చేయడంతోపాటు శక్తిమేరకు పండితులకు దానం చేయాలని శాస్తవ్రచనం. కాగా భాతృవిదియ తర్వాతి రోజు ‘సోదరీ తృతీయ’. భాతృవిదియనాడు సోదరి చేత పూజలందుకున్న సోదరుడు సోదరీ తృతీయనాడు ఆమెకు చీర సారెలను ఇచ్చి సోదరిని గౌరవించాలని చెప్పబడింది. ఈ విధంగా సోదరీ సోదరుల అనురాగానికి నిదర్శనంగా నిలిచే ‘్భతృవిదియ’ను జరుపుకోవడంవల్ల అపమృత్యు భయం నరకలోక బాధలు తొలిగిపోయి ఆయురాగ్యాలు వృద్ధి చెందడంతో పాటు స్ర్తిలకు సకల సౌభాగ్యాలు కలకాలం వర్థిల్లుతాయి.

-కె.విజయలక్ష్మి