మంచి మాట

దీపదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివకేశవులకు ప్రీతికరమైన కార్తికంలో దీపం దానం చేసినవారికి అనంతమైన పుణ్యం వస్తుంది. శివకేశవుల్లో ఎవరిని పూజించినా వారికి ముక్కోటి దేవతలను పూజించినఫలం ఆ పరమేశ్వరుడే కలుగచేస్తాడని స్కాందపురాణం చెప్తుంది. కార్తికంలో చేసే దీపారాధనకు ఆవునేయి, నువ్వులు, విప్ప, కొబ్బరి లాంటి నూనెలతో ఉపయోగించాలి. దీపారాధన చేయడం కాని వెలుగుతున్న జ్యోతికి కాస్త నూనెను చేర్చడం కాని, కొడిగట్టుతున్న దీపాన్ని సరిచేయడం కాని చేసినాకూడా కార్తికంలో పుణ్యమే లభిస్తుంది.
ఉసిరి మూలమున శ్రీహరి, స్కందమున శివుడు, ఊర్థ్వమున బ్రహ్మ, సూర్యుడు, శాఖలయందు, సమస్త దేవతలు కూడి కార్త్తిక మాసంలో ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారు. కనుక కార్తికమాసంలో ధాత్రీపూజ అశ్వమేధ ఫలాన్ని అందిస్తుంది. శివనామం జపిస్తూ ఉసిరిక కాయమీదనో, పిండి ప్రమిదతోనో, మట్టి ప్రమిదతోనో దీపం వెలిగిస్తే వచ్చే పుణ్యం ఇంతఅని చెప్పలేం. దీపప్రజ్వలనానికి సంబంధించి ఓ పురాణ కథ ఉంది.
పురాణ కథ: పూర్వం పాంచాలదేశానే్నలే రాజు శివభక్తుడు. అతని శివపూజవల్లనే అతని రాజ్యం సర్వసుభిక్షంగా ఉందని అతడు భావించే వాడు. ప్రజలు కూడా రాజు లాగే శివపూజాతత్పరులై ఉండేలా రాజు ఆజ్ఞలు జారీచేశాడు. కాని, తనకు మాత్రం వారసులు లేరని బాధ రాజుకు ఉండేది. శివునికి తనపై పూర్తి అనుగ్రహం లేనందువల్లే తనకు సంతానం కలుగడం లేదని ఆయన నిరంతరం తపించేవాడు.
ఒకసారి ఆయన దగ్గరకు పిప్పలాదుడనే మహర్షి వచ్చారు. రాజు ఆ పిప్పలాదుని దర్శించుకొని తనకు సంతాన యోగం కలిగించమని కోరుకున్నాడు. ఆ పిప్పలాద మహర్షి ‘ఓ రాజా కార్తికమాసంలో శివాలయంలో నీవు దీపదానం చేయి. నీకు ఇష్టకామ్యార్థసిద్ధి కలుగుతుంది’ అని దీవించాడు. ఆ పాంచాల రాజు పరమానందభరితుడై కార్తికంలో ఉపవాసాది నియమాలు పాటిస్తూ శివాలయంలో మహర్షి చెప్పిన విధంగా దీపదానం చేసాడు. దాంతో ఆ రాజుకు శివానుగ్రహం కలిగింది. పుత్రుడు పుట్టాడు. రాజు సంతోషానికి అవథులు లేవు. ఆ పుట్టిన శిశువుకు శత్రజిత్తు అని పేరుపెట్టి శివ ప్రసాదం అని అల్లారుముద్దుగా పెంచడం ప్రారంభించాడు.
శత్రజిత్తు కు గారాబం ఎక్కువై పొగరు బోతుతనం అబ్బింది. దానితో విచక్షణా జ్ఞానం కొరవడింది. పెద్దలను తూలనాడడం నేర్చుకున్నాడు. స్ర్తిలను, వృద్ధులను అవమానించడం ప్రారంభించేవాడు. పరకాంతావ్యామోహంలో చిక్కుకున్నాడు. చివరకు ఓ బ్రాహ్మణ స్ర్తితో విహరించడం మొదలుపెట్టాడు. ఓరోజు వారిద్దరూ కలిసి ఏకాంతంకోసం ఓ పాడుబడిన శివాలయం చేరుకొన్నారు. వీరి కథ తెలుసుకొని ఆ బ్రాహ్మణ స్ర్తి భర్త వీరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని కోరికతో వెంబడించసాగాడు. ఆ ప్రేమికులలోని స్ర్తి వెలుగుకోసం తన చీరచెంగును చించి వత్తిగా చేసి అక్కడున్న ప్రమిదలో పెట్టి దీపం వెలిగించింది. ఆ రాజకుమారుడు అక్కడ ఇక్కడ ఉన్న ప్రమిదలలో మిగిలి ఉన్న నూనెను తెచ్చి ఆ వెలుగుతున్న ఆ దీపానికి చేర్చాడు. ఆ వెలుగులో వారు వూసులాడుకోసాగారు. దీన్నంతా చూస్తున్న ఆ స్ర్తి భర్త వారిరువురిని అదునుచూసి హత్యచేశాడు. తాను పాపం చేసానన్న బాధతో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురి ప్రాణాలను తీసుకొని వెళ్లడానికి వచ్చిన శివ దూతలు వచ్చారు. అపుడే అక్కడి వచ్చిన యమకింకరులు వారిని చూచి ఆశ్చర్యపడి వీరుముగ్గురు కూడా దోషం చేసినవారే. మరి మీరు ఎలా వీరికోసం వచ్చారని అడిగారు. శివదూతలు శివుడు పరమ దయాళుడు. కరుణామయుడు వీరి చేసిన పుణ్యం వల్లనే వీరికి శివసాయుజ్యం దొరికింది అని చెప్పారు.
వీరు చేసిన పుణ్యమేమిటని యమదూతలు అడిగారు. ఇదుగో వీరుముగ్గురూ శివాలయంలో కార్తిక పౌర్ణమి తిథినాడు దీపం వెలిగించారు. రోజంతా ఉపవాసం చేశారు. శివానుగ్రహం కలిగింది. వీరిని తీసుకురమ్మని పరమశివుడు ఆదేశించాడు. దానివల్ల మేము వచ్చాం చెప్పారు. ఆ ముగ్గురికీ శివలోకం ప్రాప్తించింది. ఇలా తెలిసి చేసినా తెలియకచేసినా దీపారాధనకు అనంతమైన పుణ్యం లభిస్తుంది. మాసం మొత్తం సాయం వేళ దీపం పెట్టలేనివారు పూర్ణిమరోజైనా, సోమవారం నాడేనా సాయంత్రం వేళలో దీపారాధన చేసినవారికీ శివానుగ్రహం కలుగుతుంది. కనుక ఎవరికి చేతనైనంత గా దీపదానాలు చేద్దాం.

- ఎస్. నాగలక్ష్మి