మంచి మాట

పంచాక్షరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమ శివుని అనుగ్రహం పొందడానికి ‘శివపంచాక్షరి’ మంత్రమే అత్యంత శక్తివంతమైనది. ప్రణవం నుంచే పంచాక్షరి ప్రభవించిందనీ, పంచాక్షరి నుండి గాయత్రీ మంత్రము, దాని నుండి సర్వవేద సారస్వతం ఉద్భవించెనని శివభారతంలో చెప్పబడింది.
పంచాక్షరీలో ‘న’ అక్షరం బ్రహ్మను భూమిని, ‘మ’ అక్షరం విష్ణువును జలాన్ని, ‘శి’ అక్షరం రుద్రుణ్ణి, అగ్నిని, ‘వా’ అను అక్షరం మహేశ్వరుణ్ణి వాయువుని, ‘య’ అక్షరం సదాశివుణ్ణీ, ఆకాశాన్ని సూచిస్తాయి. పరమశివుడు పంచకృత్య పారాయణుడు అని వాయు పురాణంలో చెప్పబడింది.
‘రుద్ర’ అంటే రోదనం పోగొట్టేవాడు. ‘శివ’ అంటే మంగళకరమైనవాడు. జీవులకు రోదనము పోగొట్టి మోక్షము కలిగించేవాడు శివుడు భోళాశంకరుడు. భక్తవత్సలుడు. ‘మహదేవ’ అని ముమ్మారు భగవన్నామాన్ని భక్తిశ్రద్ధలతో ఉచ్ఛరిస్తే వారికి ఒక్క నామస్మరణకి ముక్తిని ప్రసాదించి, మిగిలిన రెండు నామాలకీ ఋణపడి ఉంటాడు.
సద్యోజాత . వామదేవ . అఘోర . తత్పురుష. ఈశాన- ఈ పంచ ముఖాల నుండి క్రమక్రమంగా ఉద్భవించిన నకార, మకార, శికార వకార, యకారముల సమ్మిళితమే నమఃశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రము.
పరమశివుని పంచముఖాలలో నకారం ప్రకాశించే ముఖం తూర్పు దిశను చూస్తూ సిద్ధసురాసుర గణాలచే నుతించబడుతున్నదనీ, మకారమున విలసిల్లే ముఖం దక్షిణ దిక్కును చూస్తూ అఖండ తేజోవంతంగా ఉంటుందనీ, శికార ముఖం గోక్షీరం నురుగువలే శే్వతవర్ణంలో అరుణ నేత్ర సంయుతంగా ఉంటుందనీ, పడమటి దిక్కును చూస్తూ బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడుతున్నదనీ, వకార ముఖం ఉత్తర దిక్కును చూస్తూ గోరవర్ణంతో మందహాసాన్ని వెదజల్లుతుంటుందనీ, యకారముఖం ఊర్థ్వముఖమై ముప్పది ఆరు తత్వాల సంయుతమై వుంటుందని శివపురాణంలో చెప్పబడింది. ఈ పరమేశ్వరుని ఆరాధనకు కార్తికం పరమ పవిత్రమైంది.
కార్త్తిక సోమవారం శుద్ధ ఏకాదశినాడు తమ నివాసంలో కనుక రుద్రాభిషేకం చేయించుకుంటారో వారింట్లో ఆ రుద్రుడే నివాసముంటాడు. శంకరుడు భక్తసులభుడు. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం భక్తులకు చాలా తేలిక. శివుని దయను పొందడానికి కార్తిక సోమవారాలు శ్రేష్టమైనవి. ఆరోజుల్లో ఉదయానే్న స్నానం చేసి శివుడిని దర్శించి ఏకభుక్తం ఉంటూ పంచామృతాలతో శివాభిషేకం చేసినవారికి అఖండమైన పుణ్యరాశి లభిస్తుంది. కార్తిక ఏకాదశి లేదా సోమవారంనాడు శివలింగాన్ని అభిషేకిస్తారో వారి సమస్త పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయ.
ఈ కార్తికంలో రుద్రాక్ష ఎంతో పవిత్రమైనది. రుద్రాక్షను స్పర్శించినా, చూసినా, నెత్తిమీద ఉంచుకున్నా సాక్షాత్తు శివుడి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే రుద్రాక్షలతో శివుడిని అభిషేకించినా ఆ స్వామి ఎంతో పరవశించిపోతాడు. కార్తీక పురాణం పారాయణం చేస్తారో వారిపై శంకరుడి కరుణా కటాక్షాలు అనంతంగా కురుస్తాయి. అంతేకాదు కార్తిక పురాణాన్ని, లేదా శివపురాణాన్ని భక్తులకు దానం చేసినా అనంత పుణ్యరాశి ఇస్తాడు శివుడు. బోళాశంకరుడు, జ్ఞానప్రదాత, మోక్షప్రదాత అయిన ఆ స్వామి తన భక్తులను కరుణించి, కటాక్షించేందుకు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఆ శివలింగం ఎదురుగా కాని, వాకిట్లో గాని, లేదా తులసి చెట్టు దగ్గర కాని ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో కార్తీకస్నానాంతరం దీపం వెలిగించినవారికి, సాయంసంధ్యలో దీపారాధన చేసినవారికి ఆ ముక్కంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. బిల్వ పత్రంతో పూజించినచో ప్రసన్నుడు అవుతాడు.
‘మాని యే మహేశస్య ధ్రువమ ప్రజ్ఞానతోపి వా తేషాం కరతలే ముక్తిః’’- ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానం చేత కాని, అజ్ఞానం చేతకాని స్తుతిస్తూ వున్నారో వారికి ముక్తి చేతిలోనే వుంది అని వేదంలో పేర్కొనబడింది. వేదాలలో యుజుర్వేదం గొప్పది. దానిలో నాలుగవ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మధ్యంలోని ‘పంచాక్షరి’ అంతకంటే ఇంకా గొప్పది. పంచాక్షరిలోని ‘శివ’ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి. ‘శివ’ నామోచ్చారణ మహాత్మ్యమునకు సంబంధించిన ఇతివృత్తం పద్మపురాణంలో పాతాళ ఖండంలో వుంది.
ఓమ్ నమఃశివాయ అని అంటూ ఉంటే చాలు పరమశివుని దయామృతం లభ్యమవుతూ ఉంటుంది.

- హనుమాయమ్మ