మంచి మాట

క్షీరాబ్ది ద్వాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకుంఠవిహారి, అనంతశయనస్వామి లక్ష్మీవల్లభుడు అయన వికుంఠుడు కార్తిక ద్వాదశినాడు బృందావనానికి విచ్చేస్తాడు. ఏకాదశి ఉపవసించి ద్వాదశి రోజు బృందావనానికి విచ్చేసిన స్వామిని సేవించిన వారికి ఇహపరసుఖాలు లభిస్తాయ. వారి మనోరథాలు అన్నీ ఈడేరుతాయ. హరిని ప్రత్యేకంగా సేవించేరోజు కనుక హరిద్వాదశి అని అంటారు. ఈరోజు చలిమిడి తయారు చేయడానికి రోటిలో చెరుకు గడలతో పిండిని దంచుతారు. ఆ దంచేటపుడు పిండి చుక్కలు చేతులపై పడితే ఆ చుక్కలు ఎన్ని పడితే అన్ని ఏళ్లు పాలకడలిలో పవళించిన స్వామిని అక్కడే ఉండి సేవించవచ్చు అని ఐతిహ్యం ఉంది కనుక దీనిని చిలుకుద్వాదశి అనీ అంటారు. ఈ ద్వాదశిని యోగీశ్వర ద్వాదశి అని అంటారు.
తిరునల్వేలి ప్రాంతంలో పాండురంగణ్ణి ఓ మాల దాసరి నిత్యం వేకువ ఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని గుడికి వెళ్లి తనకొచ్చిన కైశిక రాగంలో పాటలు వినిపించడం ఓ వ్రతం లాగా పెట్టుకుని ప్రార్థించేవాడు. ఒకానొక రోజు అర్థరాత్రి సమయంలోనే తెల్లవారిందని భ్రమతో మేల్గాంచాడు. తన వ్రతం ఆచరించడానికి రంగని స్తుతిస్తూ బయలుదేరాడు. ఆ దాసరి విష్ణునామాసంకీర్తనా ధ్యాసలో పడిపోయ దారిలో మర్లు తీగెను తొక్కడంతో దారి తప్పాడు. చివరకు చీకటిగా ఉన్న ప్రాంతంలో ముందుకు వెళ్తూ ఓ బ్రహ్మరాక్షసునిచేతికి చిక్కాడు. అతిభయంకరంగా ఉన్న రాక్షసుడు ఆ మాలదాసరి తినివేస్తానని బెదరించాడు.
తనను తిన్నా ఫర్వాలేదు కాని ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు కనుక ఆ రంగని వైభవాన్ని కీర్తించి వస్తాను. ఆ తరువాత నీ ఆకలిని నీవు యథేచ్చగా తీర్చుకోవచ్చు. ఈ ఒక్క సదుపాయం నాకు కలుగ చేయ అని మాలదాసరి బ్రహ్మరాక్షసుని ప్రార్థింఛాడు. తాను మహావిష్ణువైన తిరక్కురంగనికి తన గానాన్ని విన్పించి వస్తానని, అది తన వ్రతమని చెప్పి ఆ రంగని ప్రార్థించడానికి వీలు కల్పించమని పదేపదే వేడుకున్నాడు. ఇలా తన్ను బతిమాలుకునే దాసరి వినయబుద్ధిని చూచి బ్రహ్మరాక్షసునిలో జాలి కలిగింది. ఆలోచించే బ్రహ్మరాక్షసుడిని చూచి దాసరి ఏదైనా నా వ్రతం పూర్తిచేసుకొనే భాగ్యం కలిగించమని మనసున శ్రీహరిని ప్రార్థిస్తూ తిరిగి ‘‘నీవు నమ్ము. ప్రతిరోజూ ఆచరించే వ్రతాన్ని వమ్ముచేయవద్దు. నా వ్రతాన్ని పూర్తి చేసుకుని వచ్చి నేను నీకు ఆహారం అవుతాను. నేను కొలిచే ఆ రంగని పై ఒట్టు’’ అన్నాడు. ఇంతగా చెప్పే అతని మాటలకు కరిగిపోయ బ్రహ్మరాక్షసుడు వ్రతాచరణకు వెళ్లి రమ్మనాడు.
మాట తప్పితే ఆ రంగని సైతం మింగివేయగలశక్తి సంపన్నుడు తానని బెదరించాడు. రంగని కొలిస్తే చాలు నీవెంత వీరాధివీరుడి వైనా నేను ఏమీ నీతో యుద్ధం చేయను. నేను తిరిగి వచ్చి నీకు ఆహారంగా నిల బడుతాను అని మళ్లీ చెప్పి బ్రహ్మరాక్షసుని అనుమతితో రంగనిసేవకు దాసరి మరిలాడు. తాను మాట ఇచ్చిన ప్రకారమే రంగని కొలిచి తిరిగి బ్రహ్మరాక్షసుని వద్దకు వచ్చాడు. తన్ను ఆహారంగా భుజించమని చెప్పాడు. అతడి సత్య సంధతకు మెచ్చిన రాక్షసుని హృదయం పరివర్తన చెందింది. తాను సోమశర్మ అనే బ్రాహ్మణుడినని, తాను చేసిన కర్మఫలితంగా ఈ రాక్షసాకారంలో ఉన్నానని నీ గాన ఫలాన్నిచ్చి తన్ను కాపాడమని ప్రార్థించాడు. రంగని దాసుడైన మాల దాసరి తనకేదన్నా ఫలం ఇచ్చేటట్లు అయితే దానితో ఈ రాక్షసుని కాపాడమని భగవంతుని ప్రార్థించాడు. వీరిరురి మనస్సును మెచ్చిన రంగడు వారిద్దరికీ మోక్షం ఇచ్చాడు. కనుక ఈ ద్వాదశిని కైశిక ద్వాదశి గా కూడా పిలుస్తున్నారు. బృందావనంలో ఈరోజు లక్ష్మీసమేతుడై ఉన్న నారాయణుని సేవిస్తారు. విష్ణుస్వరూపమైన ఉసిరిక కొమ్మను, లక్ష్మీ స్వరూపమైన తులసిని దగ్గరకు చేర్చి లక్ష్మీ నారాయణుల వివాహాన్ని అంగరంగ వైభోగంగా చేస్తారు. ఉసిరిక దీపాలను దానాలు చేస్తారు. దుర్వాస మహాముని శాపం వల్ల సిరిసంపదలు, అమరావతిని, ఇంద్రపదవినీ కోల్పోయి అడవులు పట్టిన ఇంద్రుడు మహావిష్ణువు ఆదేశానుసారం దానవులతో కలసి క్షీర సాగరం మధనం ఈ కార్తిక ద్వాదశిని ఆరంభించాడు. అలా క్షీరాబ్దిని మధించిన రోజు కనుక క్షీరాబ్దిద్వాదశి అన్న పేరు కూడా ఈకార్తిక ద్వాదశికి వచ్చింది.
ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన మహావిష్ణువు కార్తిక ఏకాదశినాడు మేల్కాంచి ద్వాదశి నాడు అందరికీ దర్శనం ఇస్తునందుకు ఆనందంతో వేడుకలు జరుపుతారు కనుక క్షీర్దాబ్ది ద్వాదశి అనీ అంటారు.

- చివుకుల రామమోహన్