మంచి మాట

నాగరికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకంలో భగవంతుని అనుగ్రహం కరుణ అదృష్టవంతులకే లభిస్తుంది. ఈ విషయానే్న భగవద్గీతలో కృష్ణపరమాత్మ ఏడవ అధ్యాయంలో ఒక శ్లోకంలో విపులీకరించారు.
మనుష్యాణాం సహస్రేషు-..... వేత్తితత్త్వతః
పెక్కు వేల మానవ సమాజంలో ఒక్కడు మాత్రమే పరమ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తాడు అట్టి సిద్ధిని సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్ధంగా తెలుసుకోగలుగుతాడు.
పశుపక్ష్యాలకు, పశుత్వం నింపుకున్న మనుషులకు, మానవ రూపంలో వున్న పశువులకు దైవ సాక్షాత్కారం సాధ్యం కాదు. విదేశాల్లో ఆహారం కొరకు కొన్ని సమయాల్లో కొందరు ఒక దీవినుండి మరొక దీవికి ప్రయాణం చేసి ఆహారాన్ని పొందుతుంటారు. కానీ పక్షులుమాత్రం ఒక చెట్టుమీదనుండి మరొక చెట్టుమీదకి ఎగిరి సులభంగా తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి.
భౌతికావసర వస్తువుల కోసం వెదుకులాటలో మానవ నాగరిక నిజమైన నాగరికత కాదు. మానవులకు పరమాత్మఅయిన భగవంతునితో కల సంబంధాన్ని అతడు తెలుసుకోవడానికి సాయం చేసేదే నిజమైన నాగరికత. మనుజులు దైవ సంబంధం కొరకు అన్ని మత గ్రంథాలలోని సాహిత్యం ద్వారా తెలుసుకోవచ్చును. మానవుడు భగవంతునితో గల సంబంధాన్ని తెలుసుకోవడమే ముఖ్య కర్తవ్యమని ప్రతి వారికి తెలియజేయడమే శ్రీకృష్ణ తత్వం. ముఖ్యమైన ఉద్దేశం కూడా. ఎల్లరు ఈ విజ్ఞానానే్న అలవరుచుకోవాలి. భగవంతుని ప్రేమించడానికి యత్నించాలి. ఆ రీతిగా ప్రేమించడానికి సులభమైన మార్గమును తెలుసుకుని దానినే ఆచరణలో చూపించాలి. ఆశయం ముఖ్యం కాదు. ఆచరణ కావాలి. మంచి మార్గాన్ని ఎన్నుకోవడంలో అసూయా ద్వేషాలకు ఎలాంటి అవకాశం ఇవ్వరాదు. ఈ విషయాన్ని చాణుక్యుడు ఒక శ్లోకాన్ని ఉటంకిస్తూ ఇలా అన్నారు.
విషాదస్యామృతం .......దుష్కులాదపి అన్నారు.
మంచిని ఎక్కడినుంచైనా గ్రహించాలని, ఒక విషపు పాత్రలో ఎంత కొంచెం అమృతం కలిసి వున్నా, అమృత లేశాన్ని గ్రహించి, విషాన్ని విడిచేయాలని తెలిపాడు చాణుక్యుడు. సంఘంలో తక్కువవాడైననూ పరమ సత్యమును తెలుసుకొన్నచో అతనిని గురువుగా భావించి అతనినుండి జ్ఞానాన్ని పొందాలి అన్నాడు. తత్వవేత్త హీన కులజుడుగావున అతనిని గురువుగా అంగీకరించరాదని ఎవరూ భావించరాదు. ఆ విధంగా భావిస్తే అది దోషమవుతుంది. అలాగే భగవంతుని అర్ధం చేసుకోవడానికి అధికమైన ఆసక్తి కావాలి. కుల మతాల ప్రసక్తి ఇందులో వుండరాదు. అలా ఆలోచించరాదు. దైవ ప్రేమను గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి కలవాడు తనకు ఏమార్గం ఆచరణ సాధ్యమో ఆలోచించాలి. భగవంతుని పట్ల ప్రేమను అభివృద్ధి చేసుకోవడమే వైదిక గ్రంథాల ఆవశ్యకత. దైవ భక్తిని తెలుసుకోవాలంటే శక్తివంతమైన మార్గం ఎన్నుకోవాలి.వివేకవంతులు అదృష్టం కలవారు మాత్రమే భగవత్ సేవా మార్గాన్ని అనుసరిస్తారు. దాని నందరు చేయలేరు. శ్రీకృష్ణుని సేవించడమే వారి ఒకే ఒక కోరిక. కాంక్ష. నిరంతరం వారు కృష్ణ సేవలో నిమగ్నులై వుంటారు. పవిత్రమైన భక్తి గలవారికి శ్రీకృష్ణుని సేవ తప్ప మరో వ్యాపకం వుండదు. ఇదే అందరు అనుసరించదగిన మార్గం. ఈ విషయంలో మన మేధస్సును ఆలోచనలతో పదును పెట్టవలసి వచ్చినపుడు శ్రీకృష్ణుని కోసమో, ఆ దైవం కోసమో శ్రమపెట్టాలి. మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే సముచిత కార్యం. ఈ పద్ధతిని భాగవతంలో వ్యాసులవారు ఇలా సెలవిచ్చారు. తస్యైవహతోః ........ ముపర్యధః అంటూ ప్రపంచంలో నాలుగు దిక్కులలో పర్యటించినా ఏది లభించదో దానిని పొందడానికి మాత్రమే మానవుడు ప్రయత్నించాలి. అది కేవలం భక్తి యొక్కటే. అదే శుద్ధ భక్తి.
దేవాధిదేవుడైన ఆ కృష్ణపరమాత్మ స్థితికర్తగా వుండి ప్రాణికోటికి ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. పోషణ కారిగదా భగవంతుడు. ఈ విషయానే్న వేదాలు జీవుల అవసరాలను భభగవంతుడే తీర్చగలడని బోధించాయి. కావున ప్రకృతి విధానాన్ని లేదా భగవంతుని రీతిని అనుసరించి ప్రతివస్తువు ప్రాణులకు పరిపూర్ణంగా అందుతుందని, అది పూర్ణమని ఈశావావోప్యనిషత్తు పేర్కొంది. భక్తిసేవలో పునీతులు కావాలి. ఇదే మానవ జీవితంలో నిజమైన నాగరికత. మానవ ధ్యేయం లక్ష్యం.

-పి.వి.సీతారామమూర్తి