మంచి మాట

మాటల మూటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాట మనిషి తీరును తెలుపుతుంది. మాట్లాడే పద్ధ్తి మనిషి జీవితాన్ని నిలుపుతుంథి. చక్కని మాటలతో జీవితాన్ని నందనవనం చేసుకోవచ్చు. మనం మాట్లాడుకునే మాటలు ఎదుటివానికి నొప్పి కలిగించకపోతే వారు సదా మిత్రత్వాన్ని కలిగిఉంటారు. హృదయాన్ని నొప్పించేమాటలు మాట్లాడుతూ ఉంటే ఒకవేళ అవి నిజాలు కాకపోతే మాత్రం జీవితం ముళ్లబాట అవుతుంది. సహజంగా కొంతమందికి మాటలతో పోయేదానిని ఘర్షణల వరకు తీసుకెళ్లటంఅలవాటుగా ఉంటుంది. ఇటువంటివారికి అన్నీ తప్పు అర్థాలున్నట్టు కనిపిస్తారు.
శిరిడీసాయబాబా ఎపుడూ ఎదుటివారి తప్పులను ఎత్తిచూపటం, లేక ఎదుటివారిని దూషించడం అనేవి మంచికావని చెప్పేవారు. చాడీలు చెప్పటం అంటే అశుద్దాన్ని ముట్టుకున్నట్టే అనేవారు కూడా.
మసీదులో బాబాకు సేవలు చేసే విషయంలో కొందరు భక్తులు పోటీపడేవారు. వారు నిత్యం బాబాతొపాటే ఉండేవారు. బాబా సేవ ముక్తికి తోవ అని అనేవారంతా. అందుకే బాబాకు సేవ చేసే అవకాశం వస్తే ఎవరూ వదిలేవారు కారు. అపుడు సాయబాబా - నాకు సేవ చేయడం కంటే ఎవరికి సేవ అవసరమో తెలుసుకొని వారికి సేవ చేస్తే అపుడు భగవంతుడు మిమ్మల్ను మెచ్చుతాడు అని చెప్పేవారు.
షడ్రసోపేతంగా అన్నం తిన్నవారికి తిరిగి అన్నదానం చేస్తున్నా మంటూ అన్నం పెడితే వారికి ఎలా ఉంటుందో అట్లానే సేవలు అనవస రమైన వారికి సేవ చేయడం వృథా కాలయాపన తప్ప మరేమీ కాదు అనేవారు.
అణ్ణాచించణీకర్ బాబాకు గొప్ప భక్తుడు. అతని మరో పేరు దామోదర్ ఘనశ్యామ్. కాస్త మనిషి మొరటు. మనసు సున్నితం. అతనికి కల్లాకపటం తెలియవు. మనసులో ఏముందో బయటికి అదే మాట్లాడేవాడు. ఎవరినీ లెక్కపెట్టే తత్వంకాదు. పట్టింపు, పంతం, జగడం.. ఏదైనా సరే అక్కడికక్కడే తేలిపోవాల్సిందే. నానే్చవాడుకాదు. టక్కరి వేషాలు ఆయనకు తెలియవు. చక్కని భక్తి ఒక్కటే అతనికి తెలిసింది. బాబాకు అణ్ణాలోని భక్తికంటే అతనిలోని బండతనమే ఎక్కువగా నచ్చేది. అతని నిజాయతినీ మెచ్చుకునేవాడు. నిర్మల మైన మనసునే చూచేవాడు. అందుకే అతనిని ఎక్కువగా దగ్గరికి చేరదీసేవారు.
మసీదులో వేణుబాయి కౌజల్గి అనే ముసలి వితంతువుకూడా ఉండేది. ఆమెను బాబా ‘అమ్మా’ అని పిలిచేవారు. ఇతర భక్తులు మాత్రం ఆమెను మావిశీబాయి అని పిలిచేవారు. మావిశీబాయిది స్వచ్ఛమైన హృదయం.
ఒకరోజు వీరిద్దరు బాబాసేవలో నిమగ్నమయ్యారు. అణ్ణా బాబా కాళ్లు వత్తుతున్నాడు. మావిశీబాయి బాబా నడుమును మర్దన చేస్తోంది. ఆమెకు ఆ క్షణంలో ఆ పని తప్ప మరో ధ్యాస లేదు. ఆమె అలా మర్దన చేస్తున్నప్పుడు ఒకసారి అణ్ణ ముఖం ఆమె మీదకంటూ వెళ్లింది.
‘‘బాబా! ఈ అణ్ణా చూడు, నన్ను ముద్దుపెట్టుకోవాలని చూస్తున్నాడు. వయసు పెరిగినా బుద్ధి పెరుగలేదు’’ అంది మావిశీబాయి.
అణ్ణా గురించి చెప్పేదేముంది. ఆమె మాటలు వింటూనే కస్సున లేచాడు. ‘‘నేనా బుద్ధిలేనివాన్ని? నేనా నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకున్నది? నా జోలికొచ్చావో’’ అంటూ కయ్యానికి కాలు దువ్వాడు.
ముసలివాళ్లిద్దరి జగడాన్ని చూసి మసీదులో ఉన్నవారందరూ నవ్వుకోసాగారు. బాబా కూడా వారితో శృతి కలిపారు. అప్పుడు బాబా ఇలా అన్నారు.
‘‘అన్నా! ఎందుకంత గోల చేస్తున్నావ్? ఆమె నీ తల్లి వంటిది. తల్లిని కొడుకు ముద్దుపెట్టుకుంటే తప్పేముంది?’’
ఇలా ఉంటాయన్నమాట బాబా మాటలు. ఆ మాటలు వినగానే మనసులో ఏదైనా చెడు భావనలున్నా అవి దూరమయ్యేవి. చక్కని హృదయం ఉంటే ఏ చెడు భావనకు తావు ఉండదు. అందుకే బాబా నిష్కల్మషంగా ఉండాలని చెప్పేవారు. మన మనసు అద్దం అంత కల్మషం లేకుండా ఉంటే ఎదుటివారి భావాలు ఒకవేళ చెడువి అయనా అవి కూడా మంచిభావనలుగానే మారుతాయ.
ముందు మనలను మనం ఉద్దరించు కుంటే చాలు భగవంతుడు మనకు చేదోడు వాదోడుగా ఉంటారు. మనసును మంచిమార్గంలో పయనింపచేయాలి. దానికి సజ్జనసాంగత్యం ఎంతో పనికి వస్తుంది. గొప్పవారి జీవిత చరిత్రలు పనికివస్తాయ.

- సాయ అఖిల్